Search
  • Follow NativePlanet
Share
» »తిరుమ‌ల వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. జ‌న‌వ‌రి నెల శ్రీ‌వారి కోటా ట‌క్కెట్ల తేదీలు విడుద‌ల‌..

తిరుమ‌ల వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. జ‌న‌వ‌రి నెల శ్రీ‌వారి కోటా ట‌క్కెట్ల తేదీలు విడుద‌ల‌..

తిరుమల వెళ్లే శ్రీవారి భ‌క్తుల‌కు శుభ‌వార్త‌.. జ‌న‌వ‌రి (2025) నెల స్వామివారి ఆర్జీత సేవా, వర్చువల్, అంగప్రదక్షిణం సహా ఇతర దర్శనం, గదుల బుకింగ్ టికెట్లకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు విడుద‌ల చేశారు. అక్టోబర్ 19వ తేది నుంచి 24వ తేదీ వరకు ఈ కోటా టిక్కెట్ల‌ను విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఈ మేర‌కు ఈ నెల (అక్టోబర్) 19వ తేదిన శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేయనుంది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా ఆన్ లైన్ టికెట్లకు సంబంధించి వచ్చే ఏడాది జనవరి నెల కోటాను ఈనెల 19వ తేదిన ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్న‌ట్లు అధికారులు వివ‌రించారు.

ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల (అక్టోబరు) 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఎల‌క్ర్టానిక్ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు అక్టోబర్ 21వ తేది నుంచి 23వ తేదీ వ‌ర‌కు మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంద‌ని తెలిపారు. వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూర‌వుతాయ‌ని వివ‌రించారు. వీటితోపాటు తిరుమ‌ల స్వామివారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఈ నెల (అక్టోబర్) 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ఆల‌య అధికారులు ప్రకటించారు.

అక్టోబర్ 22న..

శ్రీ‌వారి జ‌న‌వ‌రి నెల‌కోటాకు సంబంధించి వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించి టిక్కెట్ల‌ను ఈ నెల (అక్టోబరు) 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల స‌మ‌యంలో ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు. వీటితోపాటు 2025 జనవరి నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను కూడా ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

Good news for those going to Tirumala Srivari Kota ticket dates

శ్రీవాణి టికెట్లు..

తిరుమ‌ల స్వామివారి శ్రీవాణి టికెట్లకు సంబంధించిన జనవరి నెల ఆన్ లైన్ కోటాను ఈ నెల (అక్టోబరు) 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వీటితో పాటు వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల స్వామివారిని ద‌ర్శ‌నం కోసం జనవరి నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను అక్టోబరు 23వ తేదీ మధ్యాహ్నం మూడు గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

స్పెష‌ల్ ఎంట్రీ టిక్కెట్లు..

జనవరి (2025) నెల‌కు సంబంధించిన స్పెష‌ల ఎంట్రీ టికెట్ల కోటాను ఈ నెల (అక్టోబరు) 24వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న‌ట్లు ఆల‌య అధికారులు పేర్కొన్నారు. వీటితోపాటు తిరుమల, తిరుపతిలో 2025 జనవరి నెల గదుల కోటా టిక్కెట్ల‌ను కూడా అక్టోబరు 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. భ‌క్తులు ఇత‌ర పూర్తి స‌మాచారం కోసం టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.inను సంపప్ర‌దించ‌గ‌ల‌రు. అలాగే, శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లు బుక్ చేసుకోవాలనుకునేవారు కూడా ఈ వెబ్‌సైట్‌ను సంప్ర‌దించాల్సిందే.

నేడు పౌర్ణమి గరుడ సేవ..

తిరుమ‌ల స్వామివారి ఆల‌యంలో నేడు (అక్టోబరు 17న) పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా నిర్వహించనున్నట్లు టీటీడీ పేర్కొంది. ప్రతినెలా పౌర్ణమి రోజున టీటీడీ గరుడ సేవ కార్య‌క్ర‌మం నిర్వహిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7గంట‌ల‌ నుంచి 9 గంటల మధ్య శ్రీమలయప్ప స్వామి గరుడునిపై తిరుమాడ వీధులలో విహ‌రించి భక్తులకు క‌నిపిస్తారు.

More News

    Read more about: srivari kota ticket ttd news
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+