Search
  • Follow NativePlanet
Share
» »ఏపీలోని రైలు ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. వందేభారత్ రైలు పొడిగింపు..

ఏపీలోని రైలు ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. వందేభారత్ రైలు పొడిగింపు..

ఏపీలోని రైలు ప్ర‌యాణికుల‌కు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ అందిచింది. ఏపీ మీదుగా నడుస్తున్న వందేభారత్ రైలును పొడిగించేందుకు రైల్వేశాఖ సిద్ధ‌మ‌య్యింది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును పొడిగించాలని ప్రతిపాదనలు వ‌చ్చిన మేర‌కు రైల్వేశాఖ ఈ కీల‌క నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం చెన్నై-విజయవాడల మధ్య నడుస్తున్న వందేభారత్‌ను భీమవరం వరకు పొడిగించనున్న‌ట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు.

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్ర‌స్తుతం విశాఖ-సికింద్రాబాద్ మెయిన్‌లైన్‌లో మధ్య న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ట్రైన్‌ను ఏలూరు వాసులు ఎక్కే అవ‌కాశం లేదు. ఎందుకంటే, అక్క‌డ స్టాప్ లేదు. ఈ జిల్లా వాసులు ఆ ట్రైన్ ఎక్కాలంటే విజ‌య‌వాడ, రాజ‌మండ్రి వెళ్లాల్సిందే. చెన్నై విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను పొడిగించాలని రైల్వే శాఖ నిర్ణ‌యం తీసుకుంది. వచ్చే నెల నుంచి ఈ రైలును పొడిగించ‌నున్నారు. భీమవరం వరకు ఈ ట్రైన్ నడవనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయ‌నున్నారు.

త్వ‌ర‌లోనే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్..

20677 అనే నెంబ‌ర్‌గ‌ల చెన్నై విజ‌య‌వాడ ట్రైన్ చెన్నైలో ఉదయం 5.30కి ప్రారంభ‌మ‌వుతుంది. మ‌ధ్యాహ్నం 12.10 గంట‌ల స‌మ‌యంలో విజయవాడకు చేరుకుంటుంది. 20678 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ అక్కడి నుంచి తిరిగి 3.20కి చెన్నై బ‌య‌లుదేరుతుంది. ప్రస్తుతం ఈ ట్రైన్ విజయవాడ స్టేషన్‌లో దాదాపు 3.10 గంటలు ఉంటుంది. ఈ ట్రైన్ కోసం ప్రత్యేకంగా ఒక ప్లాట్‌ఫాంను కూడా కేటాయించాల్సి వ‌స్తోంది. దీనివ‌ల్ల విజయవాడ జంక్షన్‌లో రైళ్ల రద్దీ,రైళ్ల రాకపోకలకు ప‌లు స‌మ‌స్య‌లు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణ‌యం తీసుకుంది.

extensionofvandebharat bhimavaram

ఈ మేరకు చెన్నై రైల్వే కూడా అనుమతి ఇవ్వడంతో ఈ జిల్లాకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ త్వ‌ర‌లోనే పరుగులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ ట్రైన్ విజయవాడ నుంచి గంటలో భీమవరం ఉంటుంది. తిరిగి ఇక్కడ నుంచి 2 గంటలకు బయలుదేరి విజయవాడ వెళ్లే విధంగా అధికారులు షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. భీమవరం నుంచి చెన్నై వెళ్లే ప్రయాణికులకు కూడా ఎటువంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా ఉంటుంది.

ఒకే ఒక్క రైలు.. సర్కార్‌ ఎక్స్‌ప్రెస్

ప్రస్తుతం చెన్నైకు పశ్చిమ‌ గోదావరి జిల్లా నుంచి న‌డుస్తోన్న‌ ఒకే ఒక్క రైలు సర్కార్‌ ఎక్స్‌ప్రెస్ మాత్రమే. అయితే, ఇది కూడా కాకినాడ నుంచి బయలుదేరి తణుకు, భీమవరం, ఆకివీడు మీదుగా న‌డుస్తోంది. అంతేకాదు, దూర ప్రాంతం నుంచి రావడంతో ఈ రైలుకు ముందుగా రిజ‌ర్వేష‌న్‌లు చేసుకునేందుకు ప్ర‌య‌త్నించినా.. టికెట్లు దొర‌క‌డం క‌ష్ట‌మ‌య్యేది. ఇలాంటి స‌మ‌యంలో రైల్వే శాఖ తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌యాణికులకు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌నుంది. పగటి పూట వందేభారత్‌ వస్తుండటంతో ఒంగోలు, నెల్లూరు మీదుగా చెన్నై ప్రయాణికులకు కూడా ఊరట దక్కుతుంది.

అలాగే, వందేభారత్ రైలు వేగానికి త‌గ్గ‌ట్టుగా ఇప్ప‌టికే ట్రాక్ ప‌నులు ఆధునీక‌రించిన‌ట్లు రైల్వే అధికార‌లు స్ప‌ష్టం చేశారు. విజయవాడ- భీమవరం మధ్య పాత ట్రాక్‌లను తొలగించి చాలాచోట్ల కొత్త ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల‌ సిమెంట్‌ స్లీపర్స్‌ కూడా మార్చారు. రెండేళ్ల క్రితం విజయవాడ- నరసాపురం మధ్య డబ్లింగ్‌ లైన్‌ పనుల్లో భాగంగా ఒక లైన్‌ కొత్త ట్రాక్‌ వేసిన సంగతి తెలిసిందే. అయితే, విజ‌య‌వాడ‌- భీమ‌వ‌రం మ‌ధ్య వందేభార‌త్ మ‌రే స్టేష‌న్‌ల వ‌ద్ద‌నైనా ఆగే అవ‌కాశం ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

More News

Read more about: bhimavaram andhra pradesh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+