Search
  • Follow NativePlanet
Share
» »ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌...నాందేడ్ నుంచి శ్రీ‌కాకుళం వ‌ర‌కూ రెండు స్పెష‌ల్ ట్రైన్స్‌..

ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌...నాందేడ్ నుంచి శ్రీ‌కాకుళం వ‌ర‌కూ రెండు స్పెష‌ల్ ట్రైన్స్‌..

రైలు ప్ర‌యాణికుల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు ఓ శుభ‌వార్త‌ను అందించారు. నాందేడ్ నుంచి శ్రీ‌కాకుళం వ‌ర‌కు రెండు స్పెష‌ల్ ట్రైన్ల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల సంద‌ర్భంగా ప్ర‌యాణికుల ర‌ద్దీనీ గ‌మ‌నంలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప‌లు స్పెష‌ల్ ట్రైన్లు న‌డింపేందుకు సిద్ధ‌మ‌య్యింది. ఈ ట్రైన్లు నాందేడ్ నుంచి శ్రీకాకుళం రోడ్ వరకూ న‌డ‌వ‌నున్నాయి. ఈ మేరకు స్పెష‌ల్ ట్రైన్స్‌పై దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన కూడా జారీ చేసింది. రండి వాటి పూర్తి వివ‌రాలేంటో తెలుసుకుందాం.

స్పెష‌ల్ ట్రైన్స్‌..

07487 అనే నెంబ‌ర్‌గ‌ల స్పెష‌ల్ ట్రైన్ ఆగస్ట్ 14వ తేదిన నాందేడ్ నుంచి శ్రీకాకుళం రోడ్‌‍కు న‌డ‌వ‌నున్న‌ట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ స్పెష‌ల్ ట్రైన్ బుధవారం మధ్యాహ్నం 2గంటల స‌మ‌యంలో నాందేడ్ నుంచి బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12గంటలకు శ్రీకాకుళం రోడ్‌కు చేరుకుంటుంద‌ని అధికారులు వివ‌రించారు. 07488 అనే నెంబ‌ర్‌గ‌ల స్పెష‌ల్ ట్రైన్ ఆగ‌స్టు15వ తేది గురువారం సాయంత్రం ఐదు గంట‌ల స‌య‌మంలో నాందేడ్‌లో బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.25గంటల స‌మ‌యానికి నాందేడ్‌కు చేరుకుంటుంది.

జనరల్ క్లాస్ బోగీలు ఉండ‌వు..

ఇక‌, ఇదే స్పెష‌ల్ ట్రైన్ గురువారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీకాకుళం రోడ్ నుంచి నాందేడ్‌కు బ‌య‌లుదేరుతోంది. అక్క‌డి నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం అంటే ఆగస్ట్ 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇర‌వై ఐదు నిమిషాల స‌మ‌యానికి నాందేడ్ చేరుకుంటుందని అధికారులు వివ‌రించారు. ఈ స్పెష‌ల్ ట్రైన్స్‌లో జనరల్ క్లాస్ బోగీలు ఉండ‌వ‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఇందులో కేవలం ధర్డ్ ఏసీ, స్లీపర్ కోచ్‌లు మాత్ర‌మే ఉంటాయి. ఇందులో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది.

twospecialtrainsfromnandedtosrikakulam

ఈ స్టేష‌న్ల మీదుగా రాక‌పోక‌లు..

అంతేకాదు, ఈ స్పెష‌ల్ ట్రైన్స్ పలు స్టేష‌న్ల మీద రాక‌పోక‌లు సాగిస్తాయి. అవి ముద్కేడ్‌, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, సింహాచలం నార్త్‌, కామారెడ్డి, సికింద్రాబాద్‌, ధర్మాబాద్‌, బాసర, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిజామాబాద్‌, గుంటూరు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్ల మీదుగా ఈ స్పెష‌ల్ ట్రైన్లు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటాయి. ఈ విష‌యాన్ని ప్ర‌యాణికుల‌కు గ‌మ‌నించ‌గ‌ల‌ర‌ని అధికారులు కోరుతున్నారు.

వ‌రుస సెల‌వులు..

ఇదిలా ఉంటే.. ఈనెల‌లో వ‌రుస సెల‌వులు వ‌స్తున్నాయి. ఆగ‌స్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సెల‌వు రావ‌డంతో రైళ్ల‌లో ప్ర‌యాణికుల ర‌ద్దీనీ గ‌మనంలో ఉంచుకుని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఆగస్ట్ 15తో పాటుగా ఆ మరుసటి రోజు అంటే ఆగ‌స్టు 16 వరలక్ష్మీ వ్రతం రావ‌డంతో రెండు రోజులు వ‌రుస సెల‌వులు రానున్నాయి. దీంతో పాటు ఆగ‌స్టు 18వ తేది ఆదివారం సాధార‌ణ సెల‌వు. ఆగ‌స్టు 19వ తేది రాఖీ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా వ‌రుస సెల‌వులు రానున్నాయి. దీంతో సొంత ఊర్ల‌కు వెళ్లేవారి సంఖ్య‌, ట్రిప్‌ల‌కు వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉంటుందని అధికారుల అంచ‌నా. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌యాణికులకు ఎటువంటి స‌మ‌స్య‌లు రాకుండా ప‌లు ప్ర‌త్యేక రైళ్ల‌ను ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. ఈ విష‌యాన్ని ప్ర‌యాణికులు దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా అధికారులు కోరారు.

More News

    Read more about: srikakulam andhrapradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+