Search
  • Follow NativePlanet
Share
» »ఏపీలో కుండ‌పోత వ‌ర్షం... నేటి నుంచి మూడ్రోజుల పాటు 20 రైళ్లు ర‌ద్దు..

ఏపీలో కుండ‌పోత వ‌ర్షం... నేటి నుంచి మూడ్రోజుల పాటు 20 రైళ్లు ర‌ద్దు..

ఏపీలోని రైలు ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌... రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా విజ‌య‌వాడ డివిజ‌న్‌లోని ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. విజయవాడ డివిజన్‌లో భారీ వర్షాల నేప‌థ్యంలో, ప్రయాణికుల భద్రతా కారణాల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు విజయవాడ డీఆర్ఎం ఓ ప్రకటన కూడా విడుద‌ల చేశారు. నేటి (శ‌నివారం ) నుంచి మ‌రో మూడురోజుల పాటు 20 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ర‌ద్ద‌యిన రైళ్ల వివ‌రాల జాబితాను కూడా రైల్వే అధికారులు విడుద‌ల చేశారు. ఆ జాబితా ఏంటో చూసేద్దాం..

రద్దైన రైళ్ల జాబితా ఇదే..

- 07279 అనే నెంబ‌ర్‌గ‌ల విజయవాడ టు తెనాలి వెళ్లే ట్రైన్ వ‌చ్చే నెల ఒక‌టో తేదీన ( 01.09.24) రద్దు చేశారు.

- 07575 అనే నెంబ‌ర్‌గ‌ల తెనాలి టు విజయవాడ వెళ్లే ట్రైన్ రేపు (01.09.24) రద్దయ్యింది.

- 07500 అనే నెంబ‌ర్‌గ‌ల విజయవాడ టు గూడూరు వెళ్లే ట్రైన్ నేడు (31.08.24) రద్దు చేయ‌బ‌డింది.

- 07458 అనే నెంబ‌ర్‌గ‌ల గూడూరు టు విజయవాడ వెళ్లే ట్రైన్ రేపు ( 01.09.24) రద్దు చేయ‌బ‌డింది.

- 17257 అనే నెంబ‌ర్‌గ‌ల విజయవాడ టు కాకినాడ పోర్ట్ వెళ్లే ట్రైన్ 31.08.24న రద్దయ్యింది.

- 07874 అనే నెంబ‌ర్‌గ‌ల తెనాలి టు రేపల్లె వెళ్లే ట్రైన్ నేడు, రేపు (31.08.24 & 01.09.24) రద్దు చేయ‌బ‌డింది.

Heavy rains in AP 20 Trains will be canceled

- 07875 అనే నెంబ‌ర్‌గ‌ల రేపల్లె టు తెనాలి వెళ్లే ట్రైన్‌ నేడు, రేపు (31.08.24 & 01.09.24) రద్ద‌య్యింది.

- 07868 అనే నెంబ‌ర్‌గ‌ల గుడివాడ టు మచిలీపట్నం వెళ్లే ట్రైన్ నేడు, రేపు (31.08.24 & 01.09.24) రద్ద‌య్యింది.

- 07869 అనే నెంబ‌ర్‌గ‌ల మచిలీపట్నం టు గుడివాడ వెళ్లే ట్రైన్ ఈ తేదీల్లో 31.08.24 & 01.09.24 ర‌ద్దుచేశారు.

- 07885 అనే నెంబ‌ర్‌గ‌ల భీమవరం జంక్షన్ టు నిడదవోలు తేదీల్లో 31.08.24 & 01.09.24 ర‌ద్ద‌య్యింది.

- 07886 అనే నెంబ‌ర్‌గ‌ల నిడదవోలు టు భీమవరం జంక్షన్ వెళ్లే ట్రైన్ 31.08.24 & 01.09.24 తేదీల్లో రద్దు చేశారు.

- 07281 అనే నెంబ‌ర్‌గ‌ల నర్సాపూర్ టు గుంటూరు వెళ్లే ట్రైన్ 31.08.24 & 01.09.24 ఈ తేదీల్లో రద్దయ్యింది.

- 07784 అనే నెంబ‌ర్‌గ‌ల గుంటూరు టు రేపల్లె వెళ్లే ట్రైన్‌ 31.08.24 & 01.09.24 ఈ తేదీల్లో రద్దయ్యింది.

- 07785 అనే నెంబ‌ర్‌గ‌ల రేపల్లె టు గుంటూరు వెళ్లే ట్రైన్ 31.08.24 & 01.09.24 ఈ తేదీల్లో రద్దు చేశారు


- 07976 అనే నెంబ‌ర్‌గ‌ల గుంటూరు టు విజయవాడ వెళ్లే ట్రైన్‌ 31.08.24 & 01.09.24 ఈ తేదీల్లో రద్ద‌య్యింది.

- 17269 అనే నెంబ‌ర్‌గ‌ల విజయవాడ టు నర్సాపూర్ వెళ్లే ట్రైన్ 31.08.24 & 01.09.24 ఈ తేదీల్లో రద్దయ్యింది.

- 07576 అనే నెంబ‌ర్‌గ‌ల ఒంగోలు టు విజయవాడ వెళ్లే ట్రైన్ 31.08.24 & 01.09.24 ఈ తేదీల్లో రద్దయ్యింది.

- 07898 అనే నెంబ‌ర్‌గ‌ల విజయవాడ టు మచిలీపట్నం వెళ్లే ట్రైన్ 31.08.24 & 01.09.24 ఈ తేదీల్లో రద్దయ్యింది.

- 07899 అనే నెంబ‌ర్‌గ‌ల మచిలీపట్నం టు విజయవాడ వెళ్లే ట్రైన్ 01.09.24 & 02.09.24 ఈ తేదీల్లో రద్దయ్యింది.

- 07461 అనే నెంబ‌ర్‌గ‌ల విజయవాడ టు ఒంగోలు వెళ్లే ట్రైన్ 01.09.24 & 02.09.24 ఈ తేదీల్లో రద్దయ్యింది.

భ‌ద్రతా కార‌ణాల‌తో మ‌రో రెండు రైళ్లు ర‌ద్దు..

వీటితోపాటు భ‌ద్రతా కార‌ణాల‌తో మ‌రో రెండు రైళ్లను ర‌ద్దు చేస్తున్న‌ట్లు వాల్తేరు డివిజ‌న్ నిర్ణయం తీసుకుంది. ఈ రైళ్ల ర‌ద్దుతో ప్ర‌యాణికుల‌కు ఎటువంటి ఇబ్బందుల‌కు గురికాకుండా, వారికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు మ‌రో నాలుగు రైళ్లకు అదనపు కోచ్‌లను తాత్కాలిక ప్రాతిప‌దిక‌న పెంచాల‌ని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

జీఎంఆర్ చెన్నై సెంట్రల్ నుంచి బ‌య‌లుదేరే జీఎంఆర్‌ చెన్నై సెంట్రల్-భువనేశ్వర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (06073) ట్రైన్ ర‌ద్ద‌య్యింది. ఈ ట్రైన్ సెప్టెంబ‌ర్ 2 నుంచి సెప్టెంబ‌ర్ 9 వ‌ర‌కు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉండ‌దు. దీంతోపాటు భువనేశ్వర్-జీఎంఆర్‌ చెన్నై సెంట్రల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (06074) ట్రైన్‌ను కూడా ర‌ద్దుచేశారు. ఇక‌, ఈ ట్రైన్ సెప్టెంబ‌ర్ 3 నుంచి సెప్టెంబ‌ర్ 10 వ‌ర‌కు ర‌ద్దయ్యింది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+