Search
  • Follow NativePlanet
Share
» »విజ‌య‌వాడ రైలు ప్ర‌యాణికుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌.. ప‌లు రైళ్లు రద్దు..

విజ‌య‌వాడ రైలు ప్ర‌యాణికుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌.. ప‌లు రైళ్లు రద్దు..

ఏపీలో రైలు ప్రయాణికులకు అల‌ర్ట్‌.. ప‌లు రైళ్ల‌ను ర‌ద్దుచేస్తున్న‌ట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో గ‌ల నిర్వహణ పనుల కార‌ణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్న‌ట్లు, మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆ రైళ్ల జాబితా ఏంటో చూద్దాం..

07977/07978 అనే నెంబ‌ర్‌గల విజయవాడ-బిట్రగుంట మధ్య నడిచే ట్రైన్స్ మే 27 నుంచి జూన్ 23 వరకు రద్దు చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. వీటితోపాటు మే 27 నుంచి 31 వరకు, జూన్ 3 నుంచి 7 వరకు, జూన్ 10 నుంచి 14 వరకు.. జూన్ 17 నుంచి జూన్ 21 వరకు 17237/17238 అనే నెంబ‌ర్‌గ‌ల బిట్రగుంట-చెన్నై సెంట్రల్ ట్రైన్స్ ర‌ద్ద‌యిన‌ట్లు తెలిపారు. గుంటూరు-రాయగడ (17243/17244) ట్రైన్స్ కూడా మే 27 నుంచి జూన్ 24 వరకు రద్ద‌య్యాయి. అలాగే, కాకినాడ పోర్ట్, విశాఖపట్నం మధ్య నడిచే (17267/17268) ట్రైన్స్ కూడా రద్దు చేశారు.

Vijayawada train passengers Many trains are cancelled

మచిలీపట్నం-విజయవాడ (07896),

విజయవాడ-మచిలీపట్నం (07769),

విజయవాడ-మచిలీపట్నం (07866),

మచిలీపట్నం-విజయవాడ (07770),

మచిలీపట్నం-విజయవాడ (07870),

విజయవాడ-నర్సపూర్‌ (07861),

నర్సపూర్‌-విజయవాడ (07863),

విజయవాడ-భీమవరం జంక్షన్ (07283) రైళ్లంటిన్ని పాక్షికంగా నిలిపివేసిన‌ట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇక‌, ఈ ట్రైన్స్ విజయవాడ, రామవరప్పాడు మధ్య మే 27వ తేదీ నుంచి జూన్‌ 23 వరకు రద్దయ్యాయి.

దారి మ‌ళ్లించిన ట్రైన్స్ జాబితా..

వీటితో పాటు మ‌రికొన్ని రైళ్ల‌ను వయా విజయవాడ, గుడివాడ, భీమవరం, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు. మే 27, జూన్ 3, 10, 17న ఎర్నాకులం-పాట్నా (22643) రైలును దారి మళ్లించారు. అలాగే, 12756 అనే నెంబ‌ర్‌గ‌ల భావనగర్-కాకినాడ పోర్ట్ ట్రైన్‌ను జూన్‌ 1, 8, 15, 22 తేదీల్లో దారి మళ్లించ‌డం జ‌రిగింది. దీంతో పాటు 12509 అనే నెంబర్‌గ‌ల బెంగళూరు-గౌహతి ట్రైన్ మే 29, 31 తేదీల‌తో పాటు జూన్‌ 5, 7, 12, 14, 19, 21 తేదీల్లో కూడా దారి మళ్లించారు. ధన్‌బాద్‌-అల్లపూజ (13351) ట్రైన్ మే 27వ తేదీ నుంచి జూన్‌ 23 వరకు దారి మళ్లించిన‌ట్లు అధికారులు తెలిపారు.

Vijayawada train passengers Many trains are cancelled

11019 అనే నెంబ‌ర్‌గ‌ల ఛ‌త్రపతి శివాజీ టెర్మినస్-భువనేశ్వర్ ట్రైన్ మే 27, 29, 31 తేదీల‌తోపాటు జూన్‌ 1, 3, 5, 7, 8, 10, 12, 14, 15 తేదీల్లో దారి మళ్లించారు. వీటితోపాటు మే 30, జూన్‌ 6, 13, 20 తేదీల్లో టాటానగర్‌-యశ్వంత్‌పూర్‌ (18111) ట్రైన్ దారి మ‌ళ్లించారు. అలాగే, హతియా-ఎర్నాకులం (22837) ట్రైన్‌ను మే 27, జూన్‌ 3, 10, 17 తేదీల్లో దారి మళ్లించడం జ‌రిగింది. 18637 అనే నెంబ‌ర్‌గ‌ల హతియా-బెంగళూరు ట్రైన్ జూన్‌ 1, 8, 15, 22 తేదీల్లో దారి మళ్లించారు. హతియా-బెంగళూరు (12835)ట్రైన్‌ను మే 28, జూన్‌ 2, 4, 9, 11, 16, 18, 23 తేదీల్లో దారి మ‌ళ్లించారు. అలాగే, టాటానగర్‌-బెంగళూరు (12889) ట్రైన్ మే 31, జూన్‌ 7, 14, 21 తేదీల్లో దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.

మ‌రికొన్ని రైళ్లు దారి మ‌ళ్లింపు..

మచిలీపట్నం-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17219) ట్రైన్ మే 27 నుంచి జూన్‌ 22వ తేదీ వరకు రద్దయ్యింది. తిరుపతి-విశాఖ డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ (22708) ట్రైన్‌ను రద్దు చేశారు. 17239 అనే నెంబ‌ర్‌గ‌ల గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్ కూడా ర‌ద్ద‌య్యింది. 17240 అనే నెంబ‌ర్‌గ‌ల విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను కూడా ర‌ద్దుచేశారు. 22707 అనే నెంబ‌ర్‌గ‌ల విశాఖ-తిరుపతి డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్ కూడా ర‌ద్దుచేశారు.

ఇక‌, మార్చి 28 నుంచి జూన్‌ 23వ తేదీ వరకు విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ (17220) ట్రైన్‌ను ర‌ద్దుచేశారు. వీటితో పాటు విశాఖ-గుంటూరు డబుల్‌ డెక్కర్‌ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ (22701), గుంటూరు-విశాఖ డబుల్‌ డెక్కర్‌ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ (22702) ట్రైన్స్‌కూడా ర‌ద్ద‌య్యాయి. ఇక‌, మే 27 నుంచి జూన్‌ 23వ తేదీ వరకు రాజమండ్రి-విశాఖ మెము (07466), విశాఖ-రాజమండ్రి మెము (07467) న‌డిచే రైళ్లను కూడా ర‌ద్దుచేసిన‌ట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్ర‌యాణికుల‌కు ఈ విష‌యాన్ని గ‌మ‌నంలో ఉంచుకోవాల‌ని కోరారు.

More News

    Read more about: vijayawada andhrapradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+