పాప ప్రక్షాలన కోసం గుడుల చుట్టూ తిరిగేవారు చాలామంది ఉంటారు. అలాంటివారికి ఈ ఆలయం గురించి తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడికి వెళితే వారి పాపాలు పూర్తిగా పోతాయి. అవును.. అంత ఖచ్చితంగా చెప్పడానికి ఓ కారణం ఉంది. ఈ ఒక్క కారణంతో భక్తులు ఇక్కడకి పోటెత్తుతున్నారు. పాపాలు పోవడానికి దానదర్మాలు చేయాల్సిన పనిలేదని.. ఈ ఆలయం సందర్శన సరిపోతుందని ప్రచారం చేస్తుండడంతో ఇటీవల ఆ ఆలయం బాగా ఫేమస్ అయ్యింది. ఇంతకీ అక్కడికి వెళితే పాపాలు ఖచ్చితంగా పోతాయి అని చెప్పడం వెనుక అసలు కారణం ఏంటి? ఆ ఆలయం ఎక్కడ ఉంది? తెలుసుకోవాలంటే రాజస్థాన్ వెళ్లాల్సిందే.
రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో గిరిజనుల హరిద్వార్‌గా పిలుచుకునే పురాతన ఆలయం ఉంది. ఇది శతాబ్దాలుగా తీర్థయాత్రలకు ప్రసిద్ధిగాంచింది. అయితే, అన్ని ఆలయాల మాదిరి ఇక్కడ కూడా అక్కడకు వచ్చే భక్తులకు రసీదుని ఇస్తారు. కానీ, అది రసీదు మాత్రమే కాదు. భక్తల పాపాలు పూర్తిగా మాఫీ అయిపోయాయి అనే దృవీకరణ పత్రం. వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఈ ఆలయంలో ఎన్నో ఏళ్లుగా పాపం పోయినట్లు ధ్రువీకరణ పత్రాలను ఇచ్చే ఆచారం ఉందట.

అందుకే దీన్ని గౌతమేశ్వర్ మహాదేవ్ పాపమోచన తీర్థంగా పిలుస్తూ వస్తున్నారు. ఈ ఆలయ సమీపంలోనే మందాకిని పాప విమోచిని గంగా కుండ్ అనే రిజర్వాయర్ ఉంది. ఈ రిజర్వాయర్‌లో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసంగా ఉంది. అంతేకాదు, ఈ గుడిలో కేవలం పన్నెండు రూపాయలు చెల్లించి వాటర్ ట్యాంక్‌లో స్నానం చేస్తే పాపవిమోచన పత్రం అందిస్తారట.
జీవిని బాధించిన పాపం వెంటాడుతుందని..
ఈ ఆచారంపై అక్కడి ఆలయ పూజారి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారందరికీ పాప విమోచర ధృవీకరణ పత్రం అందిస్తూ వస్తున్నాం. అంతేకాదు, మనసులో తప్పులు చేశాం, ఎన్నో పాపాలు చేశామన్నా భావనే వారిని ఆలయంవైపు అడుగులు వేసేలా చేస్తుంది అని చెప్పుకొచ్చారు. అంతేకాదు, వ్యవసాయం చేస్తున్నప్పుడూ తెలిసో తెలియక మనవల్ల కొన్ని రకాల సరీసృపాలు, కీటకాలు చనిపోతాయని, అలా కూడా ఒక జీవిని బాధించిన పాపం మనలని వెంటాడుతుందని గ్రామస్తులు చెబుతున్నారు.

పెరుగుతోన్న పాప విమోచన ధృవీకరణ పత్రాలు
ఇలాంటి కారణాలతో కూడా స్థానిక రైతులు ఈ ఆలయానికి వచ్చి దృవీకరణ పత్రం అందుకుని సంతోషంగా వెళ్లిపోతుంటారు. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి స్వామిని దర్శించుకుని ఈ గంగా కుండ్‌లో స్నానాలు ఆచరించి సర్టిఫికేట్‌ని తీసుకునేందుకు ఇటీవల కాలం భక్తులు క్యూ కడుతున్నారు. ప్రతి సంవత్సరం ఈ గౌతమేశ్వరాలయంలో దాదాపు 250 నుంచి 300 దాక పాప విమోచన ధృవీకరణ పత్రాలు ఇవ్వడం జరగుతుందని ఆలయ పూజారి చెబుతున్నారు.
ఈ ఆచారం దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ కొనసాగుతుంది అంటున్నారు. అయితే, ఏటా అందించే దృవీకరణ పత్రాల సంఖ్య పెరుగుతూ వస్తోందని, అందుకు కారణాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనా 12 రూపాయలకే పాపాలు పోతాయి అంటే.. అక్కడికి భక్తులు బారుతు తీరకుండా ఉంటారా చెప్పిండి.



Click it and Unblock the Notifications













