హైదరాబాద్ లాంటి మహానగరంలో ఉండేవారు ఎక్కడికైనా సరదాగా టూర్ వెళ్లాలంటే దానికి చాలా ప్లానింగ్ అవసరం. మనం సమయం కేటాయించినప్పుడు టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉండకపోవచ్చు. టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉన్న రోజుల్లో మనకు వెళ్లేందుకు అవకాశం ఉండకపోవచ్చు. అయితే, అలాంటి ఔత్సాహికుల కోసం తెలంగాణ టూరిజం శాఖ సరికొత్త టూర్ ప్యాకేజీ అందిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రతిరోజూ అందుబాటులో ఉండేలా ఓ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.
శ్రీశైలం టూర్ పేరుతో పరిచయమవుతోన్న ఈ టూర్ ప్యాక్ ఒక రాత్రి, 2 పగళ్లు ఉంటుంది. ప్రతిరోజూ అందుబాటులో ఉండడంతో శ్రీశైలం వెళ్లాలనుకునేవారు ఈ ప్యాకేజీవైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఒక్క శ్రీశైలం మాత్రమే కాకుండా.. అక్కడి పలు పర్యాటక ప్రదేశాలను చూసే అవకాశం కల్పిస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ శ్రీశైలం టూర్ ప్యాకేజీలో ఉన్న పలు ఆసక్తికరమైన విశేషాలు చూసేద్దామా?!
ముందుగా హైదరాబాద్‌లోని పర్యాటక భవన్ నుంచి తొలి రోజు ఉదయం 8.30 గంటలకు తెలంగాణ టూరిజం బస్సులో జర్నీ ప్రారంభం అవుతుంది. అలా అక్కడి నుంచి బషీర్‌బాగ్‌తో ప్రయాణికులను ఎక్కిన తర్వాత తొమ్మిది గంటలకు శ్రీశైలం ప్రయాణం మొదలవుతుంది. ఈ జర్నీలో మార్గం మధ్యలోనే మధ్యాహ్న భోజన ఏర్పాట్లు ఉంటాయి. అలా శ్రీశైలం చేరుకున్న పర్యాటకులకు ముందుగా సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు శ్రీశైలం కొండ మీదకు తీసుకువెళతారు. ముందుగానే ఏర్పాటు చేసిన హోటల్‌లో రాత్రికి అక్కడే విడిది చేయాల్సి ఉంటుంది.

మనసారా ఆస్వాదించవచ్చు..
మరుసటిరోజు ఉదయం అక్కడి నుంచి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి తీసుకువెళతారు. అక్కడ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఆలయ విశిష్టతను క్లుప్తంగా తెలియజేస్తారు. అనంతరం అల్పాహారం ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా హోటల్‌కు వెళ్లి చెకవుట్ చేయాల్సి ఉంటుంది. తర్వత సందర్శకులను రోప్ వేకు తీసుకువెళతారు. ఈ రోప్ వే ప్రయాణం ఓ అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. కొండపైన ఉండే చెట్లు.. ఏదో పచ్చని తిపాచీ పరిచనట్లు కనువిందు చేస్తాయి.
అక్కడికి చేరువలో ఉన్న పాతాళగంగ, పాలధార, పంచధార, హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు, శ్రీశైలం డ్యామ్, శిఖరం లాంటి సందర్శనీయ ప్రదేశాలను చూస్తూ.. టూర్ క్షణాలను మనసారా ఆస్వాదించవచ్చు. అక్కడి నుంచి నేరుగా రిటన్ జర్నీ అవుతారు. రాత్రి సుమారు ఏడు గంటలకు హైదరాబాద్‌లో అడుగుపెట్టడంతో శ్రీశైలం టూర్ పూర్తవుతుంది.

అందుబాటులో ప్యాకేజీ ధరలు..
తెలంగాణ టూరిజం శాఖ శ్రీశైలం టూర్ ప్యాకేజీ టికెట్ ధరలను అందరికీ అందుబాటులో ఉండేలా అందిస్తున్నారు. ఏసీ బస్ ప్యాకేజీ విషయానికి వస్తే.. పెద్దలకు రూ. 2400, 5 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు రూ. 1920గా ప్రకటించారు. అలాగే, నాన్ ఏసీ బస్సుకయితే పెద్దలకు రూ. 2000, పిల్లలకు రూ. 1600గా నిర్ణయించారు. బస్సు ప్రయాణంతోపాటు హోటల్‌లో విడిది లాంటివి ప్యాకేజీలోనే కవరవుతాయి. అయితే భోజనంతోపాటు దర్శనం టికెట్లు, ఇతర ఖర్చులు పర్యాటకులే ప్రయాణికులే భరించా. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్ సందర్శిస్తే సరిపోతుంది.



Click it and Unblock the Notifications













