Search
  • Follow NativePlanet
Share
» »ప‌చ్చ‌ని సీమ‌లో దాగిన.. ప్ర‌కృతి అందాలు! (రెండ‌వ భాగం)

ప‌చ్చ‌ని సీమ‌లో దాగిన.. ప్ర‌కృతి అందాలు! (రెండ‌వ భాగం)

అలా ప‌చ్చ‌ని ప్ర‌కృతిని ఆస్వాతిస్తూ.. ఎగువ అహోబిలానికి 11.30 నిమిషాలకు చేరుకున్నాం. అప్ప‌టికే కొండ‌పైన కొన్ని పెళ్లితంతులు జ‌రుగుతున్నట్లు ఉన్నాయి. కొండ‌పైన స‌రైన సెల్ఫీ స్టాంట్స్ ఉన్నాయి. సరదాగా కొన్ని సెల్సీలు, ఫొటోలు తీసుకున్నాం. అనంతరం చుట్టూ క‌మ్మేసిన పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాలు, కొండలపై నుంచి జాలువారే జలపాతాల శబ్దాలు, భజంత్రీలు, ప్రకృతి సోయగాల నడుమ మా అడుగులు ముందుకు సాగాయి.

 ప‌చ్చ‌ని సీమ‌లో దాగిన.. ప్ర‌కృతి అందాలు! (రెండ‌వ భాగం)

ప‌చ్చ‌ని సీమ‌లో దాగిన.. ప్ర‌కృతి అందాలు! (రెండ‌వ భాగం)

అప్ప‌టికే, దిగువన జలపాత ధారల కింద యాత్రికులు కుటుంబాల సమేతంగా కేరింతలు కొడుతూ స్నానాలు చేస్తున్నారు. ఉర‌క‌లు వేస్తోన్న జ‌ల‌పాత ధార‌లు అక్క‌డి ప్ర‌కృతి సోయ‌గాల‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తాయ‌న‌డంలో సందేహ‌మే లేదు. ఆ కొండలపై కొంత దూరం వెళ్లాక అక్కడక్కడ చెక్కలతో కట్టిన వంతెనలు చాలా బాగున్నాయి. తెలుగు రాష్ట్రాల‌నుంచే కాకుండా కర్నాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రల నుంచి వచ్చిన యాత్రీకులు వాటిపై నిలబడి ఫొటోలు, సెల్ఫీలు దిగుతున్నారు. మేమూ కొన్ని ఫొటోలకు ఫోజులిచ్చాం. అనంతరం తిరిగి వచ్చి, అందరం కలిసి గండికోటకు బయలుదేరాం..

గండికోట ముచ్చట్లు..

గండికోట ముచ్చట్లు..

పెన్నా ఒడ్డున వెలసిన గండికోట కడప జిల్లా 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. అహోబిలం నుంచి గండికోటకు మధ్యాహ్నం 3.15 గంటలకు చేరుకున్నాం. దానికి ముందు జమ్మలమడుగులో బిర్యానీ, కూల్డ్రింక్స్, వాటర్ బాటిల్స్, స్నాక్స్ ఇంకా కొన్ని తినుబండారాలు తీసుకుని వెళ్లాం. కోట ముఖద్వారానికి ఇనుప‌ రేకుతో తాపడం చేసిన కొయ్య తలుపులు చాలా ఎత్తుగా ఉన్నాయి. కోట ప్రాకారం ఎర్రటి నున్నని రాళ్ళతో నిర్మించారు. ఇక్కడ మరో విశిష్టత ఏంటంటే... కొండ రాతిపై పునాదులు లేకుండా గోడలు నిర్మించడం. గోడ పైభాగాన సైనికుల నడవడం కోసం ఐదు మీటర్ల వెడల్పుతో బాట ఉంది. 'మర్యాదరామన్న' సినిమాలో హీరో హీరోయిన్లు అక్కడ నుంచొని మాట్లాడుకునే సీన్ టక్కున గుర్తుకొచ్చింది. మరో సీన్లో గండికోట గ్రామంలో హీరో సునీల్ విలన్‌ల‌ నుంచి తననుతాను కాపాడుకోవడం కోసం పరిగెత్తడం వంటి సీన్లు ఇక్కడే షూట్ చేశారు. కోట అంతర్భాగంలోని మాధవరాయ, రంగనాథ ఆలయాల పరిసర ప్రాంతాలు చూడగానే 'సాహసం' సినిమాలోని సన్నివేశాలు గుర్తుకొచ్చాయి. మీర్ జామా మసీదును సుందరంగా నిర్మించారు. కోటలో పెద్ద ధాన్యాగారము, మందుగుండు సామగ్రి గిడ్డంగి, పావురాలు గోపురం, మీనార్లు వంటి ముఖ్యమైన కట్టడాలు పర్యాటకులకు.. ఓ కనువిందు. అక్కడే ఉన్న కర్మాగారం, రంగ్ మహల్ కూడా చూడదగ్గదే. నీటి వసతి కోసం ఏర్పాటు చేసుకున్న రాజుల చెరువు, కత్తుల కోనేరు, బావులు మనకు కనపడతాయి. గతంలో ఈ కోటలో సుందరమైన, ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, తోటలు ఉండేవని అక్కడి గైడ్ లు చెబుతున్నారు.

కోట గత వైభవానికి ప్రతీక..

కోట గత వైభవానికి ప్రతీక..

ఇప్పుడు గండికోటలోని శిథిలాలు, మిగిలి ఉన్న కట్టడాలు ఈ కోట గత వైభవానికి ప్రతీకలుగా నిలిచి ఉన్నాయి. ఎందరో రాజులు, రాజవంశాల పరాక్రమానికి, నాటి రాజకీయ, సామాజిక పరిస్థితులకు ఇది నిలువుటద్దం. పడమర, ఉత్తర దిక్కుల్లో పెన్నానది ఉదృతంగా ప్రవహిస్తోంది. నదికి దక్షిణ తీరాన ఎత్తయిన కొండల మీద నిర్మించిన రక్షణ గోడలు ఆనాటి శిల్పుల పటిమను గుర్తు చేస్తాయి. అడుగ‌డుగునా అబ్బుర‌ప‌రిచే అప్ప‌టి నిర్మాణ‌శైలి ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌కు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా చెప్పుకొవ‌చ్చు. కోట నుంచి చూస్తే దాదాపు 300 అడుగుల లోతులో, 250 అడుగుల వెడల్పుతో పెన్నానది కన్పిస్తుండడం విశేషం. ఆ సుంద‌ర దృశ్యం సినిమాల్లో చూపించే లొకేష‌న్ కంటే అందంగా క‌నిపించింది. మొత్తంగా రాయలసీమ అందాలను అన్నీ కాకున్నా, ఒక్కరోజులో కొంతవరకూ చూడగలిగామన్న సంతృప్తితో తిరుగు ప్రయాణమయ్యాం.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+