ఏపీలో ప్రసిద్ధిచెందిన ప్రముఖ దేవాలయాలు చాలానే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం.. రెండునెలలో దసరా పండుగరానుంది. విజయవాడ పేరు చెప్పగానే అందరికీ ఇంద్రకీలాద్రీపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారు గుర్తొస్తారు. ఈ అమ్మవారు ఎంతో మహిమగళది. ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుకుంటే కోరిన కోర్కెలు తీరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఇక్కడికి నిత్యం భక్తులు తరలివస్తుంటారు. ఇక, ప్రత్యేక రోజుల్లో అయితే ఇక్కడ రద్దీ చెప్పక్కర్లేదు. పండుగలు, ఉత్సవాలు, శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తులకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. దసర సందర్భంగా ఇక్కడ ప్రతి ఏటా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక, ఈ ఏడాది కూడా ఈ ఉత్సవాల షెడ్యూల్‌ను ఆలయ అధికారులు విడుదల చేశారు. ఆ షెడ్యూల్ ఏంటో చూసేద్దా పదండి..
అక్టోబర్ 3 నుంచి ఉత్సవాలు..
బెజవాడ ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 3వ తేది నుండి 12 తేది వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల నిర్వహణ పైన ఆలయ అధికారులు తాజాగా ఒక ప్రకటన కూడా విడుదల చేసారు.ఈ ఉత్సవాలు మొత్తం తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి. పది అలంకారాలలో విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 3వ తేదిన శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు కనిపించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన అక్టోబర్ 12వ తేది న దుర్గమాత రాజరాజేశ్వరి దేవీగా దర్శనమిస్తారు.

తొమ్మిదిరోజుల షెడ్యూల్..
ఇంద్రకీలాద్రీపై వెలసిన అమ్మవారికి తొమ్మిది రోజుల శరన్నవరాత్రుల మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల షెడ్యూల్‌ను ఆలయ అధికారులు వెల్లడించారు. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజల్లో భాగంగా అమ్మవారి దర్శనానికి ఉదయం తొమ్మిది గంటల నుంచి భక్తులకు అనుమతిస్తారు. నవరాత్రుల్లో మొదటి రోజు అక్టోబర్ 3వ తేది బాలా త్రిపుర సుందరీదేవిగాగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. నాలుగో తేదిన గాయత్రీదేవిగా అవతరించనున్నారు.
5వతేది న అన్నపూర్ణ దేవిగా, 6వ తేదిన లలితా త్రిపుర సుందరీదేవిగా, 7 వ తేదిన మహాచండీగా, 8వ తేదిన మహాలక్ష్మీ దేవిగా , 9వ తేది న సరస్వతి దేవిగా, 10న దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు కనిపించనున్నారు. పదోతేదిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన చేతుల మీదుగా దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 11వ తేదిన మహిషాసురమర్దిని రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. 12 తేదిన రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారి అలంకరణ ఉంటుంది. శరన్నవరాత్రుల వేళ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రామారావు వివరించారు. ఈ ఏడాది జరగబోయే దసరా ఉత్సవాలకు 9 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు.
ప్రత్యేక సిబ్బంది..
శరన్నవరాత్రులు జరిగే మహోత్సవాల్లో భాగంగా తొమ్మిదిరోజులు మూలా నక్షత్రం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీనీ దృష్టిలో ఉంచుకుని అంతరాలయం దర్శనం గతంలో నిలుపుదల చేసి సామాన్య భక్తులకు అవకాశం కల్పించారు. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా దేవాదాయ శాఖ సిబ్బందిని కూడా నియమించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదిరోజులు పది అలంకారాల్లో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వబోతున్నారు.



Click it and Unblock the Notifications












