ఆంధ్రా యూనివర్శిటీ.. ఈ పేరు వినగానే ఉన్నత చదువులు.. క్యాంపస్ జ్ఞాపకాలు గుర్తుకోస్తాయి. అయితే, విశాఖపట్నంలో ఉన్న ఆంధ్రా యూనివర్శిటీ క్యాంపస్‌లో తెలుగు సినిమా షూటింగ్‌లు జరుగుతాయని చాలామందికి తెలియదు. అంతేకాదు, ఇక్కడ క్యామరా రోలింగ్ అయ్యిందంటే చాలా.. ఆ సినిమా బాక్సీఫీసు ముందు కలక్షన్‌ల వర్షం కురిపిస్తుందనే సెంటిమెంట్ కూడా ఉందండోయ్.
యూనివర్సిటీలో ఆప్యాయంగా పలకరించే పురాతన భవనాలు, పచ్చదనం నిండిన చెట్లతో ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం క్యాంపస్‌కు మంచి సహజసిద్ధమైన వింటేజ్ లుక్‌ను అందిస్తుంది. ఈ కారణాలతో తెలుగు డైరక్టర్లు ఇక్కడ షూటింగ్ చేసేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా.. ప్రేమ కథలు.. కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అంటే.. ఆ సినిమాల్లో ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్ తప్పకుండా ఉండాల్సిందే!

అభిమాన నటులను దగ్గరగా..
పర్యాటక నగరి విశాఖ అందాలను ఆస్వాదించాలనుకునేవారు ఈ క్యాంపస్‌లో అడుగుపెట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే.. తెలుగు సినిమాల్లో కాలేజీకి సంబంధించిన సన్నివేశాలతోపాటు ఫ్లాష్ బ్యాక్‌లు, ఫైట్లు, ప్రేమ సన్నివేశాలు చిత్రీకరించిన అనేక స్పాట్‌లలో మీరు సెల్ఫీలు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఈ యూనివర్శిటీ విద్యార్థులకు మాత్రమే దక్కిన అవకాశం ఏదైనా ఉందంటే.. అది, తమ అభిమాన నటులను దగ్గరగా చూసుకోవచ్చు. ఇక్కడి పాతకాలపు వాతావరణం ఈ ప్రదేశానికి మరింత అందాన్ని చేరువ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. క్యాంపస్ సందర్శనకు ప్రత్యేక అనుమతులు లేకపోయినప్పటికీ ఎవ్వరికీ ఇబ్బంది కలిగించకుండా యూనివర్సిటీ అందాలను పర్యాటకులు కూడా ఆస్వాదించవచ్చు.
యూత్‌ఫుల్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్..
ఈ యూనివర్సిటీలో దశాబ్దాలుగా తెలుగు సినిమాల చిత్రీకరణ జరుగుతూ వస్తోంది. అలాగే, ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో షూటింగ్ చేసిన సినిమాలలో ఎక్కువ శాతం హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ క్యాంపస్ మంచి షూటింగ్ స్పాట్‌గా గుర్తింపు పొందింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన నిన్నుకోరి సినిమాలో కాలేజీ సన్నివేశాలన్నీ ఈ క్యాంపస్‌లోనే షూట్ చేశారు. అలాగే, హీరో రామ్ నటించి యూత్‌ను ఉర్రూతరూరించిన ఒకటే జిందగీ సినిమాలో క్యాంపస్ అందాలు ప్రేక్షకులను కనువిందు చేశాయి.
శర్వానంద్ నటించిన జాను సినిమా గుర్తుందా? ఆ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్‌లో కనిపించే కాలేజీ సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరించారు. ఇటీవల విడుదలై యువతీయువకులను ఆకర్షించిన సూపర్ హిట్ సినిమా ఉప్పెనలో కూడా క్యాంపస్ ఓ భాగమయ్యిందని చాలామందికి తెలియదు. యూత్‌ఫుల్ మూవీస్‌గా నిలిచిపోయిన నువ్వు నేను ప్రేమ, కేరాఫ్ కంచరపాలెం, క్షణం, మహాసముద్రం ఇలా ఎన్నో తెలుగు సినిమాలకు ఆంధ్రా యూనివర్సిటీ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.
అందుకే అంటారు విశాఖ నగరంలో ఉన్న బీచ్ ఎంత ఫేమస్ అయిందో.. ఇక్కడి యూనివర్శిటీ కూడా అంతే ఫేమస్ అయ్యిందని. ఇక్కడికి దేశ, వీదేశాల నుంచి ఎందరో విద్యార్థులు చదువుకోడానికి వస్తుంటారు. అలా ఓవైపు చదువుల నిలయంగానూ.. మరోవైపు.. టాలీవుడ్‌కు బెస్ట్ షూటింగ్ స్పాట్‌గానూ ఆంధ్రా యూనివర్సిటీ నిలిచిపోతుంది. మరెందుకు ఆలస్యం.. మీ వైజాగ్ ప్రయానంలో ఈ యూనివర్సిటీ క్యాంపస్‌ను విజిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.



Click it and Unblock the Notifications













