Search
  • Follow NativePlanet
Share
» »తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వెళ్లేవారికి విజ‌య‌వాడ నుంచి స్పెష‌ల్ టూర్ ప్యాకేజీ..

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వెళ్లేవారికి విజ‌య‌వాడ నుంచి స్పెష‌ల్ టూర్ ప్యాకేజీ..

ఏపీలో ప్ర‌సిద్ధిచెందిన పుణ్య‌క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో దేశవ్యాప్తంగా ప్ర‌సిద్ధిచెందిన‌ది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం. ఇక్క‌డికి నిత్యం భ‌క్తులు తండోప‌తండాలుగా త‌ర‌లివ‌స్తుంటారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి ఒక్క ఏపీనుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా భ‌క్తులు తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ పుణ్య‌క్షేత్రానికి ఒక్క ఏపీ నుంచి కాదు. దేశంలోని ప్ర‌తి ప్ర‌దేశం నుంచి ప‌ర్యాట‌కులు, భ‌క్తులు వ‌స్తుంటారు.

ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్‌ రాజధాని అయిన‌ అమరావతి ప్రాంతం నుంచి తిరుమలకు ప్లాన్ చేసుకునేవారికి ఏపీ పర్యాటకశాఖ ఓ గుడ్‌న్యూస్ అందించింది. అతి త‌క్కువ ధ‌ర‌లోనే తిరుమల స్వామివారి దర్శన భాగ్యం పొందొచ్చు. అదికూడా విజయవాడ నుంచి తిరుపతికి ప్రతిరోజూ ప్ర‌త్యేక‌ టూర్ ప్యాకేజీనీ ఏపీ ప‌ర్యాట‌క శాఖ ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులోకి తెచ్చింది. తిరుమల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వెళ్లాల‌నుకునే ప‌ర్యాట‌కుల‌కు ఇదొక గొప్ప అవ‌కాశం. మ‌రెందుకాల‌స్యం ఈ టూర్ ప్యాకేజీ విశేషాలేంటో తెలుసుకుందాం ప‌దండి.

ఏసీ బ‌స్సులో ప్ర‌యాణం..

విజ‌య‌వాడ టు తిరుప‌తి స్పెష‌ల్ టూర్ ప్యాకేజీ ప్రతి రోజూ విజయవాడ నుంచి బయ‌లుదేరుతోంది. ఏసీ స్లీపర్‌ బస్సులో ఈ జ‌ర్నీ సాగుతోంది. ఈ స్పెష‌ల్ టూర్ ప్యాకేజీలో భాగంగా వసతి సౌక‌ర్యం, ఫుడ్‌, స్వామివారి ద‌ర్శ‌నాల‌తో పాటు ఇత‌ర ద‌ర్శ‌నాల‌ను కూడా ఏపీ పర్యాటకశాఖ అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ మొత్తం రెండు రోజులు యాత్రికుల‌కు అందుబాటులో ఉంటుంది. వాస్త‌వానికి చెప్పాలంటే ఈ టూర్ విశాఖ‌ప‌ట్నం నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఇక‌, ఈ ఏసీ స్లీపర్‌ బస్సులకు విజయవాడలో కూడా స్టాప్ పాయింట్‌ ఇవ్వటంతో ఈ స్పెష‌ల్ టూర్ ప్యాకేజీని అమ‌ల్లోకి తీసుకురానున్నారు.

Special tour package from Vijayawada for Tirumala Srivari darshan

ఈ ప్యాకేజీలో భాగంగా ప్రతిరోజూ రాత్రి 11 గంటలకు విజయవాడ బెంజిసర్కిల్‌ నుంచి బస్సు బయల్దేరుతుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న‌వారు బెంజిసర్కిల్‌ దగ్గర ఉన్న ఫ్లై ఓవర్ పిల్లర్‌ నెంబర్‌ 4 దగ్గర ఏపీటీడీసీకి చెందిన ఏసీ స్లీపర్‌ బస్సు హాల్ట్ ద‌గ్గ‌రికి వెళ్లాలి. ఈ స్పెష‌ల్ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న ప్ర‌యాణికులు ఏపీటీడీసీకి చెందిన ఏసీ స్లీపర్‌ బస్సు హాల్ట్ ద‌గ్గ‌రికి రావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బ‌స్సు ప్ర‌యాణం తెల్లవారుజామున ఉద‌యం ఆరు గంటలకు తిరుమల కొండ‌కు చేరుకుంటుంది. భ‌క్తుల‌కు కొండపై వసతి సౌక‌ర్యం కూడా కల్పించ‌డం జ‌రుగుతుంది.

టూర్ ప్యాకేజీ ధ‌ర‌లివే..

తిరుమ‌ల కొండ‌ను చేరుకున్నాక బ్రేక్‌ఫాస్ట్ అనంత‌రం ప‌దిగంట‌ల స‌మ‌యంలో తిరుమ‌ల స్వామివారి దర్శనానికి బ‌యలుదేరుతారు. ద‌ర్శ‌నం అయ్యేలోపు మ‌ధ్యాహ్నం అవుతుంది. శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేసుకున్నాక భోజనం ముగించుకుని, స‌మీపంలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆల‌యానికి వెళ్తారు. అదే రోజు రాత్రి అక్క‌డే డిన్న‌ర్ చేసేస్తారు. అదే నైట్ తిరుపతి నుంచి తిరుగు ప్ర‌యాణానికి బస్సు ప్రారంభ‌మ‌వ‌తుంది. ఇక‌, మరుసటి రోజు ఉదయం విజయవాడకు చేరుకోవ‌డంతో ఈ స్పెష‌ల్ టూర్‌ప్యాకేజీ ముగుస్తోంది.

ఈ టూర్ ప్యాకేజీ ధ‌ర‌లు వివ‌రాలు ఓసారి చూసేద్దాం.. ఈ స్పెష‌ల్ ప్యాకేజీ పొందాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా వీటి ధ‌ర‌ల గురించి తెలుసుకోవాలి. పెద్దల‌యితే రూ. 3,970 చెల్లించాల్సి ఉంటుంది. అదే పిల్లలకయితే రూ.3,670గా ఉంటుంది. . ఈ ప్యాకేజీ ప్రతి ఒక్క ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులో ఉంటుంది. మ‌రెందుకాల‌స్యం తిరుమ‌ల స్వామివారి ద‌ర్శ‌నానికి సిద్ధం కండి..

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+