Search
  • Follow NativePlanet
Share
» »విజ‌య‌న‌గ‌రంలో రేప‌టినుంచి ప్రారంభం కానున్న శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి ఉత్స‌వాలు..

విజ‌య‌న‌గ‌రంలో రేప‌టినుంచి ప్రారంభం కానున్న శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి ఉత్స‌వాలు..

దేశంలో అమ్మ‌వారి జాత‌ర‌లు, ఉత్స‌వాల‌కు ఎంతో ప్రాముఖ్య‌త ఉంది.ఒక్కో ప్రాంతంలో ఒక్కో పండుగ విశిష్ట‌త ఉంటుంది. ఇక ఏపీలోని ప్ర‌తి ఒక్క ప్ర‌దేశం వాటి స్థానిక ఉత్స‌వాల‌కు ప్ర‌సిద్ధిగాంచింది. ఉత్త‌రాంధ్ర గురించి అయితే, ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక్క‌డి వారు నిత్యం పండుగ‌లు, ఉత్స‌వాలు జాత‌ర‌లు, యాత్ర‌లతో మునిగిపోతుంటారు.ఈ నెల‌ల ఉత్త‌రాంధ్ర‌లో శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి జాత‌ర మ‌హోత్స‌వం ఉంటుంది. ఈ ఉత్స‌వాలు విజ‌య‌న‌గరంలో జ‌రుగుతాయి.

రేప‌టి నుంచే ఈ జాత‌ర ఉత్స‌వాలు ప్రారంభంకానున్నాయి. అక్టోబ‌ర్ 30 వ‌ర‌కు ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తారు. ఇక ఈ నెల 30వ తేదిన ఉద‌యం 8 గంట‌ల నుంచి స్వామివార్ల దీక్షల విర‌మ‌ణ జ‌రుగుతుంది. ఇక‌, ఈ పండుగను ఏపీ ప్ర‌భుత్వం రాష్ట్ర‌పండుగగా ప్ర‌క‌టించింది. ఈ జాత‌ర మ‌హోత్స‌వాల సంద‌ర్భంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అమ్మ‌వారికి ప‌ట్టు వ‌స్త్రాలు కూడా స‌మ‌ర్పిస్తుంది. రండి ఈ జాత‌ర విశేషాలేంటో తెలుసుకుందాం పదండి..

ఉత్స‌వాలు...

రేపు (సెప్టెంబ‌ర్ 20) ఉద‌యం 8 గంట‌ల‌కు చ‌దురుగుడి వ‌ద్ద పందిరి రాట‌, మండ‌ల దీక్షతో శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి జాత‌ర ఉత్సవాలు ప్రారంభమ‌వుతాయి. ఈ సంద‌ర్భంగా ఉద‌యం 11 గంట‌ల‌కు వ‌నం గుడి వ‌ద్ద ఉత్సవాలు ప్రారంభమ‌వుతాయి. అక్టోబ‌ర్ 10వ తేదిన అర్ధమండ‌ల దీక్షలు ఉంటాయి. వీటితోపాటు అక్టోబ‌ర్ 14వ తేదిన తొలేళ్ల ఉత్సవం, అక్టోబ‌ర్ 15వ తేదిన సిరిమానోత్సవం, అక్టోబ‌ర్ 22వ తేదిన తెప్పోత్సవం, అక్టోబ‌ర్ 27వ తేదిన క‌ల‌శ‌జ్యోతుల ఊరేగింపు, అక్టోబ‌ర్ 29వ తేదిన ఉయ్యాల కంబాల ఉత్సవం, అక్టోబ‌ర్ 30వ తేదిన వ‌నంగుడిలో చండీహోంతోపాటు పూర్ణాహుతి అనంత‌రం దీక్ష విర‌ణ‌మతో ఈ ఉత్సవం ముగుస్తోంది. శ్రీ పైడిత‌ల్లి అమ్మవారి తెప్పోత్సవం అక్టోబ‌ర్ 22న సాయంత్రం జ‌రుగుతుంది.

sripaidithalliammavariutsavala

ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌న‌గరం ప‌ట్టణంలోని పెద్ద చెరువులో మంగ‌ళ వాయిద్యాల న‌డుమ‌, ఎంతో సంప్రదాయ బ‌ద్ధంగా నిర్వ‌హిస్తారు. తెప్పోత్స‌వం కార్య‌క్ర‌మం పెద్ద చెరువులో నిర్వ‌హిస్తారు. ఈ అపూర్వ దృశ్యాన్ని వీక్షించేందుకు భ‌క్తులు భారీగా త‌ర‌లి వ‌స్తారు. నిర్ణీత ముహూర్తంలో పైడిత‌ల్లి ఆల‌యం నుంచి అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేక ప‌ల్లికిలో తిరువీధోత్సవం నిర్వహిస్తారు. అనంత‌రం పెద్ద చెరువు ప‌డ‌మ‌టి భాగానికి అమ్మ‌వారి విగ్ర‌హాన్ని చేర్చుతారు. హంస‌వాహ‌న ప‌డ‌వ‌పై తెప్పోత్సవ కార్య‌క్ర‌మాన్ని నిర్వహిస్తారు.

సాంస్కృతిక కార్యక్రమాలు..

ఇక‌, ఈ పైడిత‌ల్లి అమ్మ‌వారి ఉత్సవాల‌కు సుమారు ఆరు ల‌క్షల మంది భ‌క్తులు వ‌చ్చే అవ‌కాశముంద‌ని అధికారులు భావిస్తున్నారు. ప‌ట్టణంలోని 11 ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. వీటితోపాటు ఈ ఉత్సవాల‌కు రెండు వేల మంది పోలీసుల‌తో బందోబ‌స్తు ఏర్పాటు చేస్తారు. ఎటువంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయ‌నున్నారు. శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆల‌యం ప‌ట్ట‌ణంలో మూడు లాంత‌ర్ల కూడ‌లి వ‌ద్ద వెల‌సింది.

అమ్మవారి ఉత్సవాలు ఏన్నో యేళ్ల నుంచి నిర్వ‌హిస్తున్నారు. ఈ ఉత్స‌వాలు 1758లో ప్రారంభ‌మై 250 ఏళ్లగా నిరాటంకంగా కొన‌సాగుతున్న‌ట్లు ఇక్క‌డివారు చెబుతున్నారు. ఇక్క‌డ సిరిమానోత్స‌వం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీ. ద‌స‌రా పండుగ అనంత‌రం ఈ వేడుక ఉంటుంది. సోమ‌, మంగ‌ళ‌, బుధ‌వారాల్లో పండ‌గ ఉంటుంది. మంగ‌ళ‌వారం సిరిమానోత్సవం ఉంటుంది. సిరిమానుకు ముందు బెస్తవారి వ‌ల‌, పాల‌ధార‌, తెల్ల ఏనుగు, అంజ‌లి ర‌థం వంటివి ఉంటాయి. సిరిమాను 33 మూర‌లు ఉంటుంది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+