Search
  • Follow NativePlanet
Share
» »సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ సంద‌డి చేసిన షూటింగ్ స్పాట్.. జ‌మ్మ‌ల‌మ‌డుగు!

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ సంద‌డి చేసిన షూటింగ్ స్పాట్.. జ‌మ్మ‌ల‌మ‌డుగు!

సినిమా షూటింగ్ స్పాట్స్ అన‌గానే ప‌చ్చ‌ని ప్ర‌కృతి అందాలు, జాలువారే జ‌ల‌పాతాలు గుర్త‌కు వ‌స్తాయి. అక్క‌డి వాతావ‌ర‌ణాన్ని ఓ లెవెల్‌లో ఊహించుకుంటారు. అయితే, ఇటీవ‌ల కాలంలో ఏపీలోని ఓ ప్ర‌దేశం మంచి షూటింగ్ స్పాట్‌గా గుర్తింపు పొందుతోంది. అదే జ‌మ్మ‌ల‌మ‌డుగు. ఈ పేరు విన‌గానే చాల‌మంది సందేహ‌ప‌డోచ్చు. ఎందుకంటే, జమ్మలమడుగు ప్రాంతం నాపరాయి గనులకు ప్రసిద్ది. అలాంటి ప్ర‌దేశం సినిమా షూటింగ్ స్పాట్ ఏంటి అనుకుంటున్నారా? అయితే, అక్క‌డి విశేషాలు తెలుసుకోవాల్సిందే!

ఆంధ్రప్రదేశ్‌లోని క‌డ‌ప జిల్లా జమ్మలమడుగు మంచి షూటింగ్ స్పాట్‌గా పేరుగాంచింది. సూపర్ స్టార్ రజనీకాంత్ న‌టిస్తోన్న కొత్త‌ సినిమా 'వెట్టయాన్' (Vettaiyan) షూటింగ్‌లోని కొన్ని స‌న్నివేశాలు ఇటీవ‌ల‌ జ‌మ్మ‌ల‌మ‌డుగులో చిత్రీక‌రించారు. ఇక్క‌డ‌ ర‌జ‌నీతోపాటు చిత్ర బృందం సందడి చేసింది. దీంతో ఈ ప్రాంతం మంచి షూటింగ్ స్పాట్‌గా ప్ర‌చారంలోకి వ‌స్తోంది. జమ్మలమడుగు దగ్గర, ఎర్రగుంట్ల ప్రాంతంలో ఉన్న నాపరాయి క్వారీలో 'వెట్టయాన్' సినిమా షూటింగ్ జరిగింది. అందులో భాగంగా రజనీకాంత్, ఫహాద్ ఫాజిల్, రితిక సింగ్, కృష్ణుడు ల మీద ఆ సినిమాకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ క్వారీలో చిత్రీకరించారు. ఎర్ర‌గుంట నాప‌రాయి గ‌నిలో మూడు రోజుల‌పాటు ప‌లు స‌న్నివేశాలు షూట్ చేశారు.

superstarrajinikanthspopularshootingspot

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మూవీ షూటింగ్‌తో

రూ. 700 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న వెట్ట‌యాన్‌ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్‌తోపాటు అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితిక సింగ్, రావు రమేష్ ఇంకా చాలామంది నటీనటులు ఉన్నారు.

ఇంత పెద్ద ఫేమ్ ఉన్న చిత్ర‌ యూనిట్ జ‌మ్మ‌ల‌మ‌డుగులో సంద‌డి చేయ‌డంతో నాప‌రాయి గ‌నులు మ‌రింత ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయ‌నే చెప్పాలి. గ‌తంలోనూ ఈ ప్రాంతంలో అనేక చిత్రాల షూటింగ్ జ‌రిగింది. అయితే, ఇంత‌టి భారీ బ‌డ్జెట్‌తో నిర్మిత‌మ‌వుతోన్న ఈ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మూవీ షూటింగ్‌తో జ‌మ్మ‌ల‌మడుగు షూటింగ్ స్పాట్ పేరు బాగా ప్రాచుర్యంలోకి వ‌చ్చింది.

గండి కోట అందాలు..

జ‌మ్మ‌ల‌మడుగు టూర్ ప్లాన్ చేస్తే మాత్రం అస్స‌లు మిస్స‌వ్వ‌కూడ‌ని ప్ర‌దేశం గండికోట‌. శతాబ్దాల కాలంనాటి శిల్పకళా సంపదకు నిలువెత్తు రూపంగా నిలిచిన ఈ గండికోట కాకతీయుల పాలనకు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా చెప్ప‌బ‌డుతోంది. జమ్మలమడుగు తాలూకాలో పెన్నానది ఒడ్డున గల ఒక చిన్న గ్రామమే ఈ గండికోట. ఇక్కడి ఎర్రమల పర్వత శ్రేణినే గండికోట కొండలని పిలుస్తారు. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చినట్లు చ‌రిత్ర చెబుతోంది. ఈ ఇరుకు లోయలో నది వెడల్పు 300 అడుగులు మాత్ర‌మే ఉంటుంది.

ఇక్కడి లోయ అందాల‌ను మాట‌ల్లో వర్ణించ‌డం క‌ష్ట‌మ‌నే చెప్పాలి. దట్టమైన అడవులు, మనోహరంగా కనిపించే భూతలం మధ్య ఎంతటి బలమైన శతృవుదాడినైనా ఎదుర్కొనడానికి అవ‌కాశం ఉండేలా ఈ ప్రాంతం ఉంటుంది. చుట్టూ లోతైన లోయలతో, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడిన దుర్బేధ్యమైన కొండలతో, 300 అడుగుల దిగువన పడమర, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నదితో, కోట లోపలి వారికి బలమైన, సహజసిద్ధమైన రక్షణ కవచంగా దీనిని అభివ‌ర్ణిస్తారు.

More News

    Read more about: jammalamadugu andhra pradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+