Search
  • Follow NativePlanet
Share
» »ప్ర‌యాణికుల‌కు తెలంగాణ ఆర్‌టీసీ గుడ్‌న్యూస్‌... విజ‌య‌వాడ‌కు ఈ గ‌రుడ బ‌స్సులు..

ప్ర‌యాణికుల‌కు తెలంగాణ ఆర్‌టీసీ గుడ్‌న్యూస్‌... విజ‌య‌వాడ‌కు ఈ గ‌రుడ బ‌స్సులు..

తెలుగు రాష్ట్రాలలోనూ ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ప‌లు ప్ర‌త్యేక రైళ్ల‌ను, బ‌స్సుల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు ఇప్ప‌టికే అధికారులు తెల‌పారు. అయితే, తాజాగా తెలంగాణ ఆర్‌టీసీ ప్ర‌యాణికుల‌కు పండుగ కానుక ఇచ్చేసింది. ప్ర‌యాణికుల‌కు మెరుగైన స‌దుపాయాన్ని క‌ల్పించేందుకు ఈ గ‌రుడ బ‌స్సుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేప‌థ్యంలోనే హైద‌రాబాద్ సిటీ నుంచి నేడు ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు రెండు ఈ గరుడ బస్సులను అధికారులు ప్రారంభించారు.

హైదార‌బాద్ నుంచి విజ‌య‌వాడ‌కు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను న‌డ‌పాల‌ని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిన నేప‌థ్యంలో మొదటి దశలో రెండు ఈ గరుడ బస్సులను నేడు ప్రారంభించింది. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ స్వ‌యంగా తెలిపారు.రాత్రి 9.30, 10.30కు బయల్దేర్దే ఈ గరుడ ఎలక్ట్రిక్ బస్సులు సిటిలోకి రాకుండా నేరుగా ఔటర్‌ మీదుగా విజయవాడ వైపు కు వెళ్తాయి. దీని వ‌ల్ల సుమారు గంటన్నర ప్రయాణ సమయం కలిసి రానున్న‌ట్లు అధికారులు తెలిపారు. దీంతో బీహెచ్‌ఈఎల్‌ నుంచి విజయవాడకు దాదాపు ఆరుగు గంటల్లోనే చేరుకోవ‌చ్చు.

నేటి నుంచే ఈ గ‌రుడ బ‌స్సులు..

విజయవాడ వైపు వెళ్లే వారు మరింత వేగంగా తమ గ‌మ్య‌స్థానాల‌ను చేరుకునేలా ఆర్టీసీ ఈ గరుడా బస్సుల్ని ఔటర్‌ మీదుగా నడపాలని తెలంగాణ ఆర్‌టిసి నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణయంతో బీహెచ్‌ఇఎల్‌-విజయవాడ మధ్య ప్రయాణంలో దాదాపు గంటన్నర సమయం కలిసి రానున్న‌ట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం విజయవాడ నుంచి వచ్చే బస్సులు హయత్‌ నగర్‌ వరకు స్పీడుగానే వెళ్తున్నా.. అక్కడ నుంచి ఎల్‌బినగర్‌ మీదుగా బీహెచ్‌ఈఎల్‌ చేేరుకునేందుకు సుమారు రెండుగంటల సమయం పడుతోంది.

garudabusestovijayawada

ఇక‌, పగటి పూట ఇక్క‌డి ట్రాఫిక్‌లో చిక్కుకుంటే మాత్రం అంతే సంగతులు. ఇక రాత్రి ఏడు తర్వాత ఏ సర్వీసు బస్సులైనా నగరం నుంచి బయటకు వెళ్లాలంటే గంటల కొద్ది సమయం పడుతోంది. ఈ క్ర‌మంలో బీహెచ్‌ఈఎల్‌ నుంచి విజయవాడ వెళ్లే ఈ బస్సుల్ని ఇకపై ఔటర్‌ మీదుగా నడపాలని తెలంగాణ ఆర్‌టిసి నిర్ణ‌యించింది. ఔటర్‌ రింగ్ రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్సులు నడిపాలని అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలో సెప్టెంబర్ 30 నుంచి అంటే నేటి నుంచి రెండు ఎలక్ట్రానిక్‌ -గరుడ బస్సుల్ని ఓఆర్ఆర్ మీదుగా నడపనున్నారు.

ఈ మార్గాల్లో...

తెలంగాణ ఆర్‌టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు 1.15 గంటల నుంచి గంటన్నర వరకు సమయం కలిసి రానున్న‌ట్లు అధికారులు తెలిపారు సుమారు 75-90 నిమిషాలు ముందే ప్ర‌యాణికులు త‌మ త‌మ గ‌మ్య‌స్థానాల‌కు చేరుకోవ‌చ్చ‌ని అధికారులు చెబుతున్నారు. నేటి సాయంత్రం తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చేతుల మీదుగా ఈ సర్వీసులు ప్రారంభం కానున్న‌ట్లు టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ పేర్కొన్నారు. ఔటర్‌ మీదుగా ప్రయాణించే రెండు ఈ గ‌రుడ బస్సు సర్వీసులు బీహెచ్ఎల్, బీరంగూడ, చందానగర్, రాంచంద్రాపురం, మియాపూర్, నిజాంపేట క్రాస్ రోడ్డు , హౌసింగ్ బోర్డు మీదుగా మలేషియన్ టౌన్‌షిప్‌ , మై హోమ్ భుజా, సైబరాబాద్ కమిషనరేట్, జేఎన్టీయూ, రైతుబజార్‌, టెలికాంనగర్ మీదుగా ఔటర్‌వైపు వెళ్తున్న‌ట్లు అధికారులు తెలిపారు.

ట్రాఫిక్ స‌మ‌స్య‌లు లేకుండా...

ఎలాంటి ట్రాఫిక్ స‌మ‌స్య‌లు లేకుండా బీహెచ్‌ఈఎల్‌ నుంచి రోజూ రాత్రి 9.30, 10,30 గంటల నుంచి రామచంద్రాపురం నుంచి ఈ బ‌స్సులు బయల్దేరనున్నాయి. విజయవాడ వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అధికారులు సూచించారు. బీహెచ్ఈఎల్ నుంచి విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌ చేరుకునేందుకు ఔటర్‌ రింగ్‌ రోడ్డు మార్గంలో 337 కిలోమీట‌ర్ల‌ దూరం ప్రయాణించాల్సి ఉంటుందని అధికారులు లెక్కించారు. హైదరాబాద్‌-విజయవాడ, విజయవాడ-బీహెచ్‌ఈఎల్‌ సర్వీసులు 6.25 గంటల్లోనే చేరుకుంటున్న‌ట్లు అధికారులు తెలిపారు.

అమీర్‌పేట్‌, చాదర్‌ఘాట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌ మీదుగా బీహెచ్ఎల్ మీదుగా విజయవాడకు చేరుకోవాలంటే సుమారు 301 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాల్సి ఉంటుంది. అదే ఔటర్‌ మీదుగా వెళితే మరో మరో 36 కిలోమీట‌ర్లు దూరం పెరుగుతుంది. ప్రయాణ దూరం పెరిగినా సమయం తగ్గిపోతుంది. ఈ మార్గంలో బస్సు ఛార్జి గతంలో రూ.750 ఉండేది. ఈ ఛార్జీ ప్రస్తుతం పెర‌గ‌లేదు. కాబ‌ట్టి ప్ర‌యాణికుల‌కు ఎటువంటి ట్రాఫిక్ స‌మ‌స్య‌లు లేకుండా ప్రయాణం చేయొచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+