Search
  • Follow NativePlanet
Share
» »భ‌క్తుల‌కు టీజీఎస్ఆర్‌టిసి శుభ‌వార్త‌.. ఉజ్జయిని బోనాల జాత‌ర‌కు స్పెష‌ల్ బ‌స్సులు..

భ‌క్తుల‌కు టీజీఎస్ఆర్‌టిసి శుభ‌వార్త‌.. ఉజ్జయిని బోనాల జాత‌ర‌కు స్పెష‌ల్ బ‌స్సులు..

ర‌తి ఏటా ఆషాడ మాసంలో సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మహంకాళి బోనాల జాత‌ర ఎంతో వైభ‌వంగా జ‌రుగుతాయి. ఇక‌, ఈ ఏడాది కూడా ఈ జాత‌ర ఈ నెల 21, 22 వ తేదీల్లో జ‌ర‌గ‌నుంది. ఈ బోనాల జాత‌ర‌కు అధికారులు, ఆల‌య సిబ్బంది అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సికింద్రాబాద్ బోనాల జాత‌ర‌కు వివిధ ప్రాంతాల నుంచి భ‌క్తులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివస్తారు. ఈ నేప‌థ్యంలో ఈ జాత‌ర‌కు వెళ్లే భక్తుల‌కు టీజీఎస్ఆర్‌టిసి శుభ‌వార్త అందించింది.

ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జులై 21, 22 వ తేదీల్లో ఎంతో వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. ఇక‌, ఈ బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ నలుమూల నుంచి భక్తులు పెద్ద సంఖ్య‌లో హాజరవుతారు. ఈ ఉత్స‌వాల‌కు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వెళ్లే భక్తులకు టీజీఎస్ఆర్‌టిసి గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రేటర్‌లోని 24 ప్రాంతాల నుంచి 175 ప్ర‌త్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్ర‌క‌టించారు.

ఇక, ఈ స్పెష‌ల్ బ‌స్సులు ప‌ట్ట‌ణంలోని కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, పటాన్‌ చెరు, ఈసీఐఎల్‌, మెహిదీపట్నం, దిల్‌షుక్‌ నగర్‌, కూకట్‌పల్లి, చార్మినార్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి, పాత బోయిన్‌పల్లి, మల్కాజిగిరి, తదితర ప్రాంతాల నుంచి న‌డ‌వ‌నున్నాయి.

specialbusesforujjainbonalajatara

ఈ ప్ర‌త్యేక బ‌స్సులు సికింద్రాబాద్ వరకు భ‌క్తుల‌కు అందుబాటులో ఉంటాయని ఆర్‌టిసి ఎండీ స్వ‌యంగా ట్వీట్ చేశారు. ఉజ్జ‌యిని బోనాల జాత‌ర‌కు వెళ్లే భక్తులు ఆర్టీసీ కల్పించిన ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎండి సజ్జనార్ కోరారు. బోనాల జాతర సంధర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాల‌కు గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ బస్సులు నడుపుతున్నట్లు ఆయ‌న పేర్కొన్నారు. భ‌క్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయ‌న సూచించారు.

ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు..

ఈ బోనాల జాత‌ర‌కు వివిధ ప్రాంతాల నుంచి భ‌క్తులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా పోలీసు అధికారులు త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈనెల‌ 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఉజ్జ‌యిని మ‌హంకాళి టెంపుల్‌కు సుమారు రెండు కిలో మీట‌ర్ల ప‌రిధిలో ట్రాఫిక్‌ అంక్ష‌లు ఉండనున్నాయి.

ఈ క్ర‌మంలో క‌ర్బాలా మైదాన్, సంగీత్ ఎక్స్ రోడ్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, పార్క్‌లేన్, రాణిగంజ్, బైబిల్ హౌజ్, మినిస్ట‌ర్ రోడ్, రామ్‌గోపాల్‌ఫేట్ ఓల్డ్ పీఎస్, పార‌డైస్, సీటీవో ప్లాజా, ఎస్బీఐ ఎక్స్ రోడ్, వైఎంసీఏ ఎక్స్ రోడ్, సెయింట్ జాన్స్ రోట‌రీ, బాటా,ర‌సూల్‌పురా వైపు వ‌చ్చే వాహ‌న‌దారులు ఇత‌ర ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని అధికారులు సూచించారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌కు వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు కూడా అధికారులు ప‌లు సూచ‌న‌లు చేశారు. స్టేష‌న్‌లోకి ప్లాట్ ఫాం నంబ‌ర్ 1 నుంచి కాకుండా ప్లాట్ ఫాం నంబ‌ర్ 10 నుంచి లోప‌లికి చేరుకోవాల‌ని అధికారులు తెలిపారు.

specialbusesforujjainbonalajatara1

ప‌లు మార్పులు..

భ‌క్తుల‌కు ఎటువంటి అసౌక‌ర్యాలు క‌లుగ‌కుండా ఉండేందుకు అధికారులు ప‌లు ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు రెండు 500 KV ట్రాన్స్‌ఫార్మర్లు, జనరేటర్లను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బోజాల‌కు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సీఎస్ శాంతి కుమారి అధికారుల‌ను ఆదేశించారు.

ఈసారి ఆలయంలోకి కేవ‌లం ఐదుగురిని మాత్ర‌మే అనుమ‌తిస్తున్న‌ట్లు తెలిపారు. జోగినీలు, శివసత్తులతో పాటు ఐదుగురికి మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంది. దీంతో పాటు అమ్మవారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తులు మధ్యాహ్నం 1:30 నుంచి సా.4 గంటల లోపు బాట కూడలి నుంచి మాత్రమే ద‌ర్శించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆల‌య అధికారులు సూచించారు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+