Search
  • Follow NativePlanet
Share
» »ఈ సీజ‌న్‌లో సాహ‌స క్రీడ‌లకు చిరునామా.. చంద్ర తాల్‌!

ఈ సీజ‌న్‌లో సాహ‌స క్రీడ‌లకు చిరునామా.. చంద్ర తాల్‌!

ఈ సీజ‌న్‌లో సాహ‌స క్రీడ‌లకు చిరునామా.. చంద్ర తాల్‌!

కనుచూపు మేర చుట్టూ మంచు పర్వత శిఖరాల మధ్య హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది చంద్ర తాల్. ఇక్కడ ఎటు చూసినా పచ్చదనం తొణికిసలాడుతూ పర్యాటకులను ఆకర్షిస్తుంది. ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలంటే ఇష్టమున్నవారికి ఈ ప్రాంతం స్వర్గధామమనే చెప్పాలి. అందుకే, ఏటా ఈ సీజన్‌లో చంద్ర తాల్ వద్దకు చాలా మంది ట్రెక్కింగ్ కోసం వెళుతుంటారు. ఈ ప్రాంతం సముద్రమట్టం నుంచి సుమారు 4,300 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే కుంజుమ్ నుంచి వెళ్లాలి. కుంజుమ్ నుంచి చంద్ర తాల్ వద్దకు వెళ్లడానికి నిపుణులైన డ్రైవర్ల సాయం తప్పనిసరి. లేదంటే దాదాపు కిలోమీటరు మేర నడవాల్సి ఉంటుంది.

శీతాకాల సమయంలో ఈ ప్రాంతం అత్యంత అందంగా కనిపిస్తుంది. హిమాలయ పర్వత శిఖరాల నీడ మనపై పడుతున్న సమయంలో కలిగే అనుభూతి మాటల్లో చెప్పడం కష్టమే. ఇక్కడ రాత్రిపూట వాతావరణం తీవ్ర‌మైన చ‌ల్ల‌ద‌నాన్ని క‌లిగి ఉంటుంది. అందుకే, ట్రెక్కింగ్‌లో నిపుణులైన వారు మాత్రమే ఇక్కడకు వెళ్లడానికి ఉత్సాహం చూపుతారు. అలాగే, ఫొటోగ్రాఫర్లకు ఈ ప్రాంతం అత్యంత ఇష్టమైనది.

chandrataal

ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో ఇక్కడి అందాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అందువల్లే పౌర్ణమి రోజున చంద్ర తాల్ పర్యాటకానికి వెళ్లివచ్చినవారు ఆ అనుభవాలను జీవితాంతం గుర్తుంచుకొంటారు. పున్నమి వెలుగులో చంద్ర తాల్ సరస్సు అందాలు రెట్టింపు అవుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడకు ట్రెక్కింగ్ కోసం దేశ నలుమూలల నుంచి సాహస పర్యాటకులు వస్తుంటారు.

ప్రతిక్షణం జీవితంలో మర్చిపోలేని అనుభవం

బటాల్ లేదా కుంజుమ్‌ నుంచి ఈ ట్రెక్కింగ్ మొదలవుతుంది. సరోవరం ఒడ్డున ఉన్న పచ్చటి మైదానంలో టెంట్ వేసుకొని, సరస్సు అందాలను చూస్తూ గడిపే ప్రతిక్షణం జీవితంలో మర్చిపోలేని అనుభవంగా మిగిలిపోతుంది. అదే సమయంలో పక్షుల కుహుకుహు రాగాలు మనసును తాకుతాయని చెప్పడం అతిశయోక్తి కాదు.

chandra

కుంజూప్పాస్‌ నుంచి చంద్రతాల్ చేరుకోవడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది. సూరజ్‌లో నుంచి చంద్ర తాల్‌కు సుమారు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఢిల్లీ నుంచి కులు, మనాలి రోహ్ తంగ్ మార్గం ద్వారా చంద్ర తాల్‌ను చేరుకోవచ్చు. లేదా ఢిల్లీ నుంచి సిమ్లా, కనౌజ్, కుంజుమ్ చంద్ర తాల్‌ చేరుకోవచ్చు.

వాతావ‌ర‌ణాన్ని అంచ‌నా వేయడం మ‌ర్చిపోవ‌ద్దు

మ‌నాలి నుంచి చంద్ర తాల్‌కు వెల్ల‌ద‌ల‌చిన వారు ఇక్కడి స‌రస్సు చేరుకునేందుకు బ‌ట్టాల్ నుంచి సుమారు 13 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాల్సి ఉంటుంది. అలాకాకుండా కాజా నుంచి వెల్ల‌ద‌ల‌చేవారు కుంజుమ్ పాస్ ద‌గ్గ‌ర దిగి, ట్రెక్కింగ్ చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. గ‌మ్య‌స్థానాన్ని చేరుకునేందుకు సుమారు నాలుగు లేదా ఐదు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. అంచేత, మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు ముందే బ‌య‌లుదేర‌టం శ్రేయ‌స్క‌రం. స‌రస్సు ద‌గ్గ‌రలో రాత్రి క్యాంపు వేయాల‌నుకుంటే స‌రైన సైట్‌ను ఎంపిక చేసుకోవాలి.

chandrataal1

లేదా దూరంగా ఉండాల‌నుకుంటే మాత్రం, బ‌ట్టాల్ వ‌ర‌కూ డ్రైవ్ చేసి, అక్క‌డి పిడ‌బ్ల్యూ రెస్ట్ హౌస్ లేదా దాబాల‌లో బ‌స చేయ‌వ‌చ్చు. ఇక్క‌డి క్యాంపింగ్ ప్ర‌దేశాల‌లో విద్యుత్ సౌక‌ర్యాల‌తోపాటు ఫోన్ నెట్‌వ‌ర్క్ అందుబాటులో ఉండ‌ద‌ని గుర్తుంచుకోవాలి. ఇక్క‌డి వాతావ‌ర‌ణాన్ని అంచ‌నా వేయడం మ‌ర్చిపోవ‌ద్దు. చ‌ల్ల‌ని, బ‌ల‌మైన గాలులతో నిత్యం పోరాడాల్సి ఉంటుంది.

More News

    Read more about: chandratal
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+