Search
  • Follow NativePlanet
Share
» » ప్ర‌పంచంలోనే ఎత్త‌యిన అంబేద్క‌ర్ విగ్ర‌హం ఎపీలోనే...

ప్ర‌పంచంలోనే ఎత్త‌యిన అంబేద్క‌ర్ విగ్ర‌హం ఎపీలోనే...

విజ‌య‌వాడ న‌గ‌రం న‌డిబొడ్డున ప్ర‌పంచంలోనే అతి ఎత్త‌యిన అంబేద్క‌ర్ విగ్ర‌హం అవిష్కృత‌మైంది. జ‌న‌వ‌రి 19న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చేతుల‌మీదుగా ఈ విగ్ర‌హం అవిష్కృత‌మ‌య్యింది. ఈ విగ్ర‌హం ఎత్తు 206 అడుగులు. ప్ర‌పంచంలోనే అతి ఎత్త‌యిన అంబేద్క‌ర్ విగ్ర‌హంగా ఇది పేరుగాంచింది. ఇది విజ‌య‌వాడ న‌గ‌రం న‌డిబొడ్డున స్వ‌రాజ్య మైదానంలో నిర్మించింది. ఈ విగ్ర‌హ నిర్మాణానికి సుమారు 400 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చ‌య్యింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మహా విగ్రహ విశేషాలెంటో ఓసారి చూద్దాం.

భార‌త‌దేశంలో మతాతీతమైన విగ్రహాల్లో ఈ విగ్ర‌హ‌మే అతిపెద్ద‌ది. ఈ విగ్రహం మెుత్తం ఎత్తు 206 అడుగులు, 81 అడుగుల బేస్, 125 అడుగుల విగ్రహం. ఈ విగ్ర‌హ ప‌నులు మార్చి 21,2022లో ప్రారంభ‌మ‌య్యాయి. ఈ విగ్ర‌హ త‌యారీకి మొత్తం 120 ట‌న్నుల కాంస్యాన్ని వాడిన‌ట్లు తెలుస్తోంది. 400 మెట్రిక్ ట‌న్నుల స్టీలుతోపాటు 2,200 ట‌న్నుల శాండ్ స్టోన్‌ను కూడా వాడిన‌ట్లు తెలుస్తోంది. ఈ విగ్ర‌హాన్ని మొత్తం 18,18 ఎక‌రాల్లో నిర్మించ‌డం జ‌రిగింది. ఈ విస్తీర్ణంలో అందమైన తోట‌, మ్యూజిక‌ల్ ఫౌంటేన్లు, పిల్లలు ఆడుకునేందుకు, వాకింగ్ చేసుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్ల‌ను చేయ‌డం జ‌రిగింది. ఈ విగ్ర‌హ త‌యారికీ మొత్తం ఖ‌ర్చు రూ. 404.35 కోట్లు.

ambekarstatue , Vijayawada

ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్త‌యిన అంబేద్క‌ర్ విగ్ర‌హంగా పేరుగాంచింది. ఇక భార‌త‌దేశంలోని అతి పెద్ద విగ్రహాల్లో మూడవ స్థానంలో ఈ విగ్ర‌హం నిలిచింది. మొదటి స్థానంలో స్టాట్యూ ఆఫ్ యూనిటీగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉంది. ఈ విగ్ర‌హం 597 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక‌, రెండవ స్థానంలో శంషాబాద్ పరిధిలో నిర్మించిన స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి విగ్రహం ఉంది. ఈ విగ్ర‌హం 216 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ తర్వాత మూడో స్థానంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజయవాడలో జ‌న‌వ‌రి 19,2024న ప్రారంభ‌మ‌యిన స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఉంది. ఇది 206 అడుగుల ఎత్తులో ఉంటుంది.

38 ఘ‌ట్టాల‌ను ప్ర‌ద‌ర్శించే ఆర్ట్ వ‌ర్క్...

విజ‌య‌వాడ‌లోని అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని జీ ప్ల‌స్ టూగా నిర్మించ‌డం జ‌రిగింది. దీని గ్రౌండ్‌ఫ్లోర్‌లో నాలుగు హాల్స్ ఉంటాయి. అందులో ఒక సినిమా హాలు కూడా ఉంది. మిగిలిన మూడు హాళ్లు అంబేద్క‌ర్ జీవిత చ‌రిత్ర తెలిపే డిజిట‌ల్ మ్యూజియంల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. మొద‌టి మంత‌స్తులో 2,250 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం క‌లిగిన నాలుగు హాళ్లు క‌ల‌వు. అందులోని ఒక హాల్లో అంబేద్క‌ర్‌కు ద‌క్షిణ భార‌త‌దేశంతో ఉన్న అనుభందాన్ని డిస్‌ప్లే చేయ‌డం జ‌రుగుతుంది. మిగిలిన రెండు హాళ్ల‌లో మ్యాజియం ఉండ‌గా, మరో హాళ్లో లైబ్ర‌రీ ఉండ‌నున్నాయి. వీటితో పాటు ఇక్కడ మినీ థియేట‌ర్లు, ఫుడ్‌కోర్టు, క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌, వెహిక‌ల్ పార్కింగ్ వంటివి కూడా ఉన్నాయి.

ఈ బిల్డింగులో అంబేద్క‌ర్ జీవిత చ‌రిత్ర గురించి తెలిపే 38 ఘ‌ట్టాల‌ను ప్ర‌ద‌ర్శించే ఆర్ట్ వ‌ర్క్‌ను కూడా ఏర్పాటు చేయ‌నున్నారు. వాటితో పాటు ఇందులో మినీ థియేట‌ర్లు, ఫుడ్‌కోర్ట్‌, 2,000 మంది కూర్చ‌నే వీలుగా ఏర్పాటు చేశారు. ఇక ఫుడ్ కోర్టు అయితే 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇవే కాకుండా ఈ బిల్డింగ్ చుట్టూ నీటి కొల‌నులు, వాట‌ర్ ఫౌంటెన్లు, మ్యూజిక‌ల్ బిల్డింగ్ ముందుభాగంలో ఉన్నాయి. ఈ బిల్డింగ్‌ను నిర్మించేందుకు స్థానిక కూలీలతో పాటు, ఢిల్లీ, బిహార్, రాజస్థాన్‌ నుంచి వచ్చిన కూలీలు రెండేళ్ల పాటు మూడు షిఫ్ట్‌ల‌లో ప‌నిచేస్తున్నారు. ఈ పనులను 55 మంది సాంకేతిక నిపుణులు పర్యవేక్షించ‌నున్నారు.

More News

    Read more about: andhra pradesh tourism
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+