Search
  • Follow NativePlanet
Share
» »పెంపుడు జంతువుల కోసమే ఓ ల‌గ్జ‌రీ హోట‌ల్ ఉంది.. తెలుసా?!

పెంపుడు జంతువుల కోసమే ఓ ల‌గ్జ‌రీ హోట‌ల్ ఉంది.. తెలుసా?!

పెంపుడు జంతువుల కోసమే ఓ ల‌గ్జ‌రీ హోట‌ల్ ఉంది.. తెలుసా?!

కొంతమందికి ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉంటుంది. కానీ, ఇంట్లో ఉండే పెంపుడు జంతువుల వల్ల వారెక్కడికీ వెళ్లలేకపోతుంటారు! వాటిని ఎవరిదగ్గర వదిలి వెళ్లాలా? అని ఆలోచిస్తుంటారు. ఒకవేళ మీరూ ఇలాగే ఆలోచిస్తుంటే! ఇప్పుడు మేం చెప్పబోయే ప్రాంతం గురించి తెలుసుకోండి. ఇక్కడ పెట్స్‌ను కంటికిరెప్పలా చూసుకుంటారు. అంతేకాకుండా వాటికి అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉంటాయి. మరెందుకు ఆలస్యం పదండి అక్క‌డి ప్ర‌త్యేక‌త‌ల గురించి మ‌రిన్ని విశేషాల‌ను తెలుసుకుందాం.

హ‌ర్యానాలోని గురుగ్రామ్‌లో పెట్స్ (కుక్కల) కోసం క్రిటెర్టి (Critterati) పేరుగల హోటల్‌ను ఐదేళ్ల క్రితం ప్రారంభించారు. పెంపుడు జంతువుల కోసం మ‌న దేశంలో ఏర్పాటు చేసిన మొట్ట‌మొద‌టి ల‌గ్జ‌రీ హోట‌ల్‌గా పేరుగాంచింది. ప్ర‌తి ఏటా మ‌రిన్ని కొత్త హంగుల‌తో నిత్యం ప్ర‌సిద్ధికెక్కుతోంది. ఇక్కడ కుక్కలకు వెల్వెట్ బెల్ట్, ఓ పెద్ద బెడ్, టీవీ, ప్రైవేట్ బాల్కనీ ఇలా వాటికోసం అన్ని సదుపాయాలూ ఉంటాయి. ఈ హోటల్లో విభిన్నపద్ధతిలో రోజు ప్రారంభమవుతుంది. మొదటగా ఏడు గంటలకు వాటికి వాకింగ్, తర్వాత టిఫిన్, తర్వాత బ్రేక్ ఉంటుంది. ఆడుకోవడానికి రెండు గంటలు ప్లే సెషన్, స్విమ్మింగ్ సెషన్, కేఫ్ సమయమూ ఉంటుంది. పెంపుడు జంతువుల కోస‌మే ప్ర‌త్యేక శిక్ష‌ణ పొందిన ప‌ర్య‌వేక్ష‌కులు 24 గంట‌లూ అందుబాటులో ఉంటారు.

haryana-1629723307-1664797378.jpg -Properties

య‌జమానుల కోసం ప్ర‌త్యేకంగా..

ప్రీమియం ల‌గ్జ‌రీ రిసార్ట్‌ల మాదిరిగానే ఈ హోట‌ల్‌లో పెంపుడు జంతువుల య‌జ‌మానులు విడిది చేసేందుకు కూడా ప్ర‌త్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఫ్యామిలీ రూమ్‌లు, సింగ‌ల్ రూమ్‌లు, బాల్క‌నీ వ్యూ రూమ్‌లు ఇలా స‌క‌ల స‌దుపాయాలు అందిస్తున్నారు నిర్వాహ‌కులు. కేవ‌లం పెంపుడు జంతువుల య‌జ‌మానుల కోస‌మే ప్ర‌త్యేక వంట‌కాల‌తో స‌రికొత్త రుచుల‌ను అందిస్తున్నారు. ఓవైపు తాము ప్రేమ‌గా చూసుకుంటోన్న పెంపుడు జంతువుల‌తో ఎంజాయ్ చేస్తూ.. మ‌రోవైపు మ‌న‌స్పూర్తిగా విశ్రాంతి తీసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

hariyananationalpark

స‌క‌ల స‌దుపాయాల విడిది కేంద్రం

ఈ హోట‌ల్‌లో పెంపుడు కుక్కల కోసం ఆడుకోవడానికి వేరుగా ప్లే రూమ్ అందుబాటులో ఉంది. దీంతోపాటు ఇక్కడ డాగ్ కేఫ్ అదనం. ఇందులో కుక్కలకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ అందిస్తారు. మెనూలో రైస్ - చికెన్, మటన్, పెన్ కేక్, ఐస్క్రీమ్స్ వంటి చాలా పదార్థాలు ఉంటాయి. అంతేకాదు, కుక్కల కోసం ఆల్కహాల్ లేని బెల్జియమ్ బియర్ కూడా అందుబాటులో ఉంటుంది. వేసవిలో కుక్కలకు వేడి ఎక్కువగానే ఉంటుంది.

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, హోటల్ పైన స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారు. ఈ స్విమ్మింగ్ పూల్ కోసం ప్ర‌త్యేక యూవీ సాంకేతిక‌త‌ను ఉప‌యోగించారు. కుక్కల మసాజ్ కోసం ప్రత్యేకంగా ఆయుర్వేదిక్ ఆయిల్, స్పా కూడా ఉందండోయ్! ఒకవేళ కుక్కలు అనారోగ్యానికి గురయితే.. బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు.. అందుకు క్రిటెర్టి హోటల్లో 24 గంటలు వెటర్నరీ డాక్టర్స్ అందుబాటులో ఉంటారు.

hariyana national zoo

వీటితో పాటు ఆపరేషన్ థియేటర్, ప్రతిక్షణం మెడికల్ యూనిట్ అందుబాటులో ఉంటుంది. అయితే, స‌దుపాయాల‌కు త‌గ్గ‌ట్టుగానే ఈ హోటల్లో ఒక్కరోజుకు వేలల్లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గురుగ్రామ్‌లోని గ‌ల్లెరియా మార్కెట్‌కు స‌మీపంలో ఈ హోట‌ల్ ఉంది.

More News

Read more about: pet luxury hotel gurugram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+