Search
  • Follow NativePlanet
Share
» »ఏప్రిల్ 1 నుంచి విజ‌య‌వాడ డివిజ‌న్‌లో ర‌ద్ద‌య్యే రైళ్లు ఇవే..!

ఏప్రిల్ 1 నుంచి విజ‌య‌వాడ డివిజ‌న్‌లో ర‌ద్ద‌య్యే రైళ్లు ఇవే..!

ఏపీలోని విజయవాడ డివిజన్‌లో రైల్వే ట్రాక్‌ల నిర్వహణ పనులు జ‌రుగుతున్నాయి. ఈ కారణంగా పలు రైళ్లను పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు విజయవాడ డివిజన్ అధికారులు ప్ర‌క‌టించారు. అస‌లే వేస‌వి ప్ర‌యాణాల ప్ర‌ణాళిక‌ల‌తో బిజీగా ఉన్నవారు ఈ విష‌యాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌రి విజ‌య‌వాడ డివిజ‌న్ అధికారులు ప్ర‌క‌టించిన ఆ జాబితాలో ఏ రైళ్లు ర‌ద్దు చేయ‌బ‌డ్డాయి? ఏ రైళ్లు దారిమ‌ళ్లించ‌బ‌డ్డాయి తెలుసుకుందామా?!

రైలు ప్ర‌యాణీకుల భ‌ద్ర‌త విష‌యంలో కేంద్ర రైల్వే ఎప్పుడూ అప్ర‌మ‌త్తంగా ఉంటుంది. అందులో భాగంగా నిత్యం ఎక్క‌డిక‌క్క‌డ మ‌ర‌మ్మ‌తు ప‌నులు చేస్తూ ఉంటారు. ఈ స‌మ‌యంలో ప్ర‌యాణీకులు ఇబ్బంది ప‌డిన‌ప్ప‌టికీ వారి భ‌ద్ర‌తే రైల్వేకు ముఖ్యం. ఇందులో భాగంగానే విజ‌య‌వాడ డివిజ‌న్‌లో రైల్వే ట్రాక్ నిర్వ‌హ‌ణ ప‌నులు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఏప్రిల్‌ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం-విశాఖపట్నం (17219), గుంటూరు-విశాఖపట్నం (22701/22702), ఏప్రిల్‌ 2 నుంచి 29 వరకు విశాఖపట్నం-మచిలీపట్నం (17220) రైళ్లను పూర్తిగా రద్దు చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ట్రాక్‌ నిర్వ‌హణ ప‌నులు పూర్త‌య్యేవ‌ర‌కే ఈ రైళ్లు ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Vijayawada division from April 1

పాక్షికంగా రద్దయిన రైళ్ల బాబితా..

వీటితోపాటు ఏప్రిల్‌ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం - విజయవాడ (07896), విజయవాడ - మచిలీపట్నం (07769), నర్సాపూర్‌ - విజయవాడ (07863), విజయవాడ - నర్సాపూర్‌ (07866), మచిలీపట్న - విజయవాడ (07770), విజయవాడ - భీమవరం జంక్షన్‌ (07283), మచిలీపట్నం - విజయవాడ (07870), విజయవాడ - నర్సాపూర్‌ (07861) రైళ్లు విజయవాడ - రామవరప్పాడు మధ్య పాక్షికంగా రద్దు అయ్యాయని తెలిపారు. వీటి జాబితా ఎప్ప‌టిక‌ప్పుడు వెల్ల‌డించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ రైళ్ల‌ను దారి మళ్లించారు..

ఏప్రిల్‌ 1, 8, 15, 22 తేదీల్లో ఎర్నాకుళం-పాట్నా (22643), ఏప్రిల్‌ 6, 13, 20, 27 తేదీల్లో భావ్‌నగర్‌ - కాకినాడ పోర్టు (12756), ఏప్రిల్‌ 3, 5, 10, 12, 17, 19, 24, 26 తేదీల్లో బెంగళూరు-గౌహతి (12509), ఏప్రిల్‌ 1, 3, 5, 6, 8, 10, 12, 13, 15, 17, 19, 20, 22, 24, 26, 27 తేదీల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ (11019), ఏప్రిల్‌ 1 నుంచి 28 వరకు ధనాబాద్‌ - అలప్పుజ (13351), ఏప్రిల్‌ 4, 11, 18, 25 తేదీల్లో టాటా-యశ్వంత్‌పూర్‌ (18111), ఏప్రిల్‌ 3, 10, 17, 24 తేదీల్లో జసిదిహ్‌ - తాంబరం (12376), ఏప్రిల్‌ 1, 8, 15, 22 తేదీల్లో హతియ - ఎర్నాకుళం (22837),

ఏప్రిల్‌ 6, 13, 20, 27 తేదీల్లో హతియ - బెంగళూరు (18637), ఏప్రిల్‌ 2, 7, 9, 14, 16, 21, 23, 28 తేదీల్లో హతియ - బెంగళూరు (12835), ఏప్రిల్‌ 5, 12, 19, 26 తేదీల్లో టాటా - బెంగళూరు (12889) రైళ్లు వయా విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా దారి మళ్లించిన‌ట్లు వెల్ల‌డించారు. ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ త‌ర‌హా చ‌ర్య‌లు తీసుకుంది రైల్వే శాఖ‌. వేస‌వి విహారానికి ఇప్ప‌టికే ప్లాన్ చేసుకున్న ఔత్సాహిక ప‌ర్యాట‌కులు ఇందుకు అనుగుణంగా త‌మ టూర్ ప్లాన్‌ను మార్చుకుంటే స‌రిపోతుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+