తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. భక్తులు శ్రీవారికి కానుకగా సమర్పించిన పలు వస్తువులను వేలం వేయనున్నట్లు తెలిపింది. ఈ వేలంలో ఎవ్వరైనా పాల్గొని, వేలం ఉంచిన వస్తువులను సొంతం చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ఇంతకీ శ్రీవారికి కానుకగా వచ్చని ఎలాంటి వస్తువులు వేలం ఉంచనున్నారు? వేలంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? ఇలాంటి సందేహాలు మీకూ ఉన్నాయా? మరెందుకు ఆలస్యం.. దేవస్థానం ఆద్వర్యంలో జరగబోయే వేలం పూర్తి వివరాలు తెలుసుకుందా..
హిందువులు కలియుగ దైవంగా భావించే తిరుమల వెంకటేశ్వరుని దర్శనం కోసం నిత్యం భక్తులు తహతహలాడుతుంటారు. తమ ఇష్టదైవానికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో తమకు తోచిన వస్తువులను స్వామివారికి కానుకలుగా హుండీలో సమర్పించుకుంటారు. అలా వచ్చిన కానుకలను వేలం రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందించనుంది.
మార్చి 13వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. స్వామివారికి కానుకల రూపంలో వచ్చిన వాచీలు, మొబైల్ ఫోన్‌లను మార్చి 13న జరిగే వేలంలో ఉంచనున్నట్లు తెలిపింది. ఒక్క తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్‌లను ఈ వేలంలో టీటీడీ వేయనుంది.

ఈ వేలంలో ఎలా పాల్గొనాలి?
ఈ వేలంలో ఉండే సెల్ ఫోన్, వాచీల కంపెనీల పరిశీలిస్తే.. టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాట, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్, ర్యాడో లాంటి పెద్ద కంపెనీ వాచీలతోపాటు ఐ ఫోన్లు, వివో, నోకియా, కార్బన్, శామ్సంగ్, మోటోరోలా, ఒప్పో కంపెనీల సెల్ ఫోన్‌లు ఉన్నాయి. కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న 23 లాట్లు వాచీలు, 27 లాట్లు సెల్ ఫోన్‌లు ఈ-వేలంలో ఉంచనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం వేళల్లో సంప్రదించవచ్చని టీటీడీ తెలిపింది.
అలాగే భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం అధికరిక వెబ్‌సైట్ www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించవచ్చని వెల్లడించింది. శ్రీవారికి వచ్చిన కానుకలను కూడా భక్తితో స్వీకరించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వేలంలో పాల్గొని టీటీడీ అందిస్తోన్న అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు.
ఈ నెలలో తిరుమల విశేష పర్వదినాలు
మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష ఉత్సవాలను ఇప్పటికే టీటీడీ అధికారికంగా వెల్లడించింది. మార్చి 8వ తేదీన మహా శివరాత్రి వేడకను ఘనంగా జరగనున్నట్లు తెలిపింది. అలాగే, మార్చి 20 నుంచి 24వతేదీ వరకు శ్రీవారి తెప్పోత్సవాలు ఉంటాయని, మార్చి 25న తుంబురు తీర్థ ముక్కోటి, శ్రీ లక్ష్మీ జయంతి నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అంతేకాదు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. మరెందుకు ఆలస్యం ఈ మార్చి నెలలో శ్రీవారి దర్శనానికి కుటుంబసమేతంగా వెళ్లేందుకు ప్లాన్ చేసుకోండి.



Click it and Unblock the Notifications













