వైజాగ్ నగరంలోని స్ట్రీట్ ఫుడ్‌ను టేస్ట్ చెయ్యాల్సిందే!
విశాఖ తీరంలో చల్లని సాయంత్రపు వేళ ఎంత సమయం ఉన్నా ఇట్టే గడిచిపోతుంది. మరి అలాంటి ప్రశాంతతను పొందే సమయంలో రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ నోటిని తాకితే ఎలా ఉంటుంది. తలచుకుంటేనే నోరూరిపోతోంది కదూ.
అందుకే, వైజాగ్‌లోని స్థానిక అభిమాన దేశీ నూడిల్ పాయింట్లు మీకు స్వాగతం పలుకుతున్నాయి. చల్లని సాయంత్రపు సమయాల్లో వేడి వేడి స్పైసీ ఫుడ్‌ను రుచి చూడాలంటే వైజాగ్‌లోని ఈ నూడుల్స్ పాయింట్‌లకు చేరుకోవాల్సిందే. వైజాగ్‌లోని ఉత్తమ దేశీ నూడుల్స్ పాయింట్‌ల (స్ట్రీట్ ఫుడ్) జాబితా మీకోసం!

మెగాస్ 555 – RK బీచ్ రోడ్
వైజాగ్‌లో చాలా సంవత్సరాలుగా అదే ప్రదేశంలో ఉన్న ఈ స్ట్రీట్ ఫుడ్ RK బీచ్ రోడ్‌లోని మోర్ సూపర్ మార్కెట్ దగ్గరగా ఉంటుంది. బీచ్ రోడ్‌లో అడుగుపెట్టేవారు తప్పనిసరిగా ఇక్కడి ఫుడ్ ప్రయత్నించాల్సిందే! 555 చికెన్ స్టార్టర్ మరియు 555 చికెన్ నూడుల్స్‌కు ఈ పాయింట్ బాగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు, కొన్ని రకాల నోరూరించే శాఖాహార దేశీ నూడుల్స్‌ను కూడా నిర్వాహకులు అందిస్తున్నారు. సముద్రం వీక్షణతో ఇక్కడ ప్రత్యేకమైన రుచికి మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు!

సూర్య ఫాస్ట్ ఫుడ్ – MVP కాలనీ
వెజ్ మంచూరియా నూడుల్స్ నుండి షెజ్వాన్ చికెన్ నూడుల్స్ వరకు ఇక్కడ దొరకని స్ట్రీట్ ఫుడ్ అంటూ ఉండదంటే నమ్మండి. తన సొంత వంటకాలతో వెరైటీ రుచులను అందిస్తూ వైజాగ్ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారంలో తనదైన ముద్ర వేశారు ఇక్కడి నిర్వాహకులు. సూర్య ఫాస్ట్ ఫుడ్ స్పైసీ ఫుడ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా చెబుతారు. వీరు అందించే డబుల్ ఎగ్ ఆమ్లెట్‌ని తప్పకుండా ప్రయత్నించండి!

టీనేజ్ పాయింట్ - ఉషోదయ
ఆహ్లాదకరమైన సాయంత్రం, ముఖ్యంగా పనిలో అలసిపోయిన తర్వాత పొగలుకక్కే మసాలా నూడుల్స్‌ను ఎవరు ఇష్టపడరు? మరోవైపు ఈ దేశీ నూడుల్స్ సాయంత్రం వేళల్లో స్నేహితులను కలుసుకునేటప్పుడు తినదగిన వంటకంగా మారింది. మీరు ఈ సాయంత్రం బయలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటే మాత్రం నేరుగా ఉషోదయ జంక్షన్‌లోని టీనేజ్ పాయింట్‌కి వెళ్లి, అక్కడి నూడుల్స్ ఒక్కసారి టేస్ట్ చేయండి. వారు అందించే డబుల్ ఎగ్ నూడుల్స్‌తో పాటు వివిధ రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలు మిమ్మల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి.

బాషా నూడుల్స్ - జిల్లా పరిషత్
వైజాగ్‌లోని చాలా ప్రసిద్ధ నూడుల్స్ పాయింట్ ఇది. ముఖ్యంగా జిల్లా పరిషత్ సమీపంలో ఉన్న ఈ బాషా నూడుల్స్ పాయింట్ ప్రదేశం సాధారణంగా కొత్తవారికి అంతగా తెలియదు. మీరు అందంగా తరిగిన ఉల్లిపాయలతో అలంకరిచబడే రుచి కరమైన స్ట్రీట్ ఫుడ్ కోరుకుంటే స్థానికులను అడిగిమరీ ఈ పాయింట్‌ను చేరుకోండి. సూప్‌ల నుండి ఫ్రైడ్ రైస్ వరకు ఇతర ఫాస్ట్ ఫుడ్ ఎంపికలను కూడా ఇక్కడ అందిస్తారు.

యశోద నూడుల్స్ పాయింట్ - శివాజీపాలెం రోడ్
వైజాగ్‌లోని ఉత్తమ దేశీ నూడుల్స్ జాబితాలో శివాజీ పార్క్ మెయిన్ గేట్ దగ్గర ఉన్న యశోద నూడుల్స్ పాయింట్ మరొక ఎంపిక. ఈ ఫాస్ట్ ఫుడ్ ఎక్స్‌ప్రెస్ అనేక వెజ్ వంటకాలతో అగ్రస్థానంలో ఉంది. వీటితోపాటు ఎగ్ నూడుల్స్ మరియు వెజ్ నూడుల్స్‌లో విభిన్న రుచులు ఇక్కడ లభిస్తాయి. మీరు ఈరోజు అక్కడికి వెళితే వారి పెప్పర్ చికెన్ మరియు క్రిస్పీ చికెన్‌ని తప్పకుండా ప్రయత్నించండి!



Click it and Unblock the Notifications












