నోయిడా రద్దీగా ఉండే ఐటీ కేంద్రం. ప్రతీ సంవత్సరం అనేక జాతీయ అంతర్జాతీయ నిపుణులు నోయిడా వస్తూ ఉంటారు. వీరి వసతి భోజన సదుపాయాలకి వారి అవసరానికి తగ్గట్ట్లుగా నోయిడాలో సదుపాయాలున్నాయి. నవంబర్ నుండీ ఏప్రిల్ వరకు వాతావరణం ఆహ్లాదంగా ఉండటం వల్ల నోయిడా సందర్శనకి అనువైన కాలం.
వాతావరణం:ఇక్కడ వేసవి కాలం మార్చ్ నుండీ మే వరకు. ఈ కాలంలో ఉష్ణొగ్రతలు కనిష్టం గా 22 గరిష్టం గా 40 డిగ్రీలుంటాయి. మే నెలలో వేడి అధికంగా ఉంటుంది.
వర్షాకాలం:జూన్ నుండీ సెప్తెంబర్ వరకు వర్షా కాలం. ఈ కాలంలో వాతావరణం తడి మరియు ఆర్ద్రతతో నిండి ఉంటుంది.
శీతాకాలం:ఇక్కడ శీతాకాలం డిసెంబర్ నుండీ ఫిబ్రవరి వరకు. ఈ కాలంలో ఉష్ణొగ్రతలు కనిష్టంగా 7 గరిష్టంగా 22 డిగ్రీలుంటాయి.