లెహ్ ప్రదేశానికి 140 కి. మీ. ల దూరంలో కల పనామిక్ గ్రామం నుబ్రా వాలీలో ప్రధాన ఆకర్షణ. ఈ గ్రామం ఇండియా చైనా సరిహద్దులలో వుండటం చేత పర్యాటకులు ఈ ప్రదేశం తర్వాత ప్రయాణించ రాదు. గ్రామ పొలిమేరలలో కల వేడినీటి బుగ్గ కారణంగా ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందినది. ఇది సముద్ర మట్టానికి 10,442 అడుగుల ఎత్తున కలదు.
ఈ వేడి నీటి బుగ్గ నీటి లో సల్ఫర్ అధికంగా వుండటం చేత, ఇది కీళ్ళ నొప్పులను తొలగిస్తుందని నమ్ముతారు. ఈ గ్రామం చూసే వారు ఈ కొండలపై నుండి ట్రెక్కింగ్ లో వంతెన మీదుగా హరగ్రాం చేరవచ్చు. హర గ్రామ్ తర్వాత అక్కడే కాన మరియు 250 సంవత్సారాల పురాతన ఇన్సా బౌద్ధ ఆరామాన్ని చూడవచ్చు. పర్వతాల అందాలే కాక పచ్చటి ప్రదేశాలు, ఇసుక దిన్నెలు కూడా చూడవచ్చు.



Click it and Unblock the Notifications