పాకూర్ లో ఇది ఒక అందమైన పార్క్. దీనిని బ్రిటిష్ కాలంలో వారు తమ శత్రువుల నుండి రక్షణకై నిర్మించారు. ఈ పార్క్ ఇపుడు డిప్యూటీ కమిషనర్ కార్యాలయ ఆవరణలో వుంది టవున్ కు మధ్యలో వుండటం వలన, పర్యాటకులకు అనువైన సందర్శనాస్తలంగా వుంది.
ఈ టెంపుల్ పాకూర్ టవున్ మధ్యలో పాకూర్ రాజ్ బారి కేంపస్ లో కలదు. అతి పురాతనమైన ఈ కాళీ దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఈ దేవతను పాకూర్ రాజ వంశీకులు పూజించేవారు. ఇక్కడనుండి రైల్వే స్టేషన్ రెండు కి. మీ. లు మాత్రమే.
ఈ ప్రదేశం పాకూర్ కు 15 కి. మీ. ల దూరం లో కలదు. ఇక్కడ ఒక పురాతన శివాలయం కొండపై కలదు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి కి ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. భక్తులు అధిక సంఖ్యా లో వస్తారు.
ఈ ప్రదేశం లిట్టిపర బ్లాక్ నుండి దట్టమైన అడవి లో 18 కి. మీ. ల దూరంలో కలదు. నిర్మాణం కోడి గుడ్డు ఆకారంలో వుంది . క్ప్రతి ధ్వని కలిగిస్తుంది. దీనిని ఈ ప్రాంత రాజు ఉపయోగించేవాడని చెపుతారు.
ఈ సహజ వేడి నీటి బుగ్గ పకురియ కు 8 కి. మీ. ల దూరం లో కలదు. దీని స్నానం పవిత్రమైనది గా భావించి, భక్తులు మకర సంక్రాంతి సమయం లో ఇక్కడకు అధికంగా వస్తారు.