Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాలంపూర్ » వాతావరణం

పాలంపూర్ వాతావరణం

దర్శించటానికి సరి అయిన సమయం: ప్రయాణికులు సంవత్సరమంతా ఎప్పుడైనా పాలంపూర్ సందర్శించవొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉష్ణోగ్రతలు సమతలంగా ఉంటాయి. సహజంగా శీతాకాలంలో అంత అనుకూలంగా ఉండదు ఎందుకంటే ఈ సమయంలో ఉష్ణోగ్రత -2 డిగ్రీల వరకు పడిపోతుంది. ఇక్కడ బుద్ధ పూర్ణిమ మే నెలలో, హోలీ పండుగ ఫిబ్రవరి-మార్చ్ నెలలలో, దసరా అక్టోబర్ నెలలో భక్తీ శ్రద్ధలతో జరుపుకుంటారు. పర్యాటకులు ఎక్కువగా పండుగలలో ఈ ప్రాంతాన్ని సందర్శించటానికి ఇష్టపడతారు.

వేసవి

ఒక్క శీతాకాలంలో తప్ప ఇక్కడ వాతావరణం ఏడాది పొడుగునా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత -2 డిగ్రీలకు పడిపోతుంది.వేసవికాలం (ఏప్రిల్ నుండి జూన్): పాలంపూర్ లో వేసవి కాలం ఏప్రిల్ మరియు జూన్ నెలల మధ్యన ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి 29 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. ఈ సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించటానికి అనుకూలంగా ఉంటుంది.

వర్షాకాలం

వానాకాలం (జూలై నుండి సెప్టెంబర్):పాలంపూర్ లో జూలై మరియు సెప్టెంబర్ నెలల మధ్య వర్షాకాలం ఉంటుంది. ఈ కాలంలో వర్షపాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రయాణికులు ఈ కాలంలో వొచ్చినప్పుడు అవసరమైన సదుపాయాలతో రావలసి ఉంటుంది.

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి): నవంబర్ నుండి ఫిబ్రవరి నెలల మధ్యన శీతాకాలం ఉంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రత -2 డిగ్రీల వరకు పడిపోతుంది. ఈ కాలంలో పాలంపూర్ లో మంచు కురుస్తుంటుంది.