Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పన్నా » వాతావరణం

పన్నా వాతావరణం

పన్నా సందర్శించడానికి అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మరియు మే నెలలుగా చెప్పవచ్చు. పన్నా టైగర్ రిజర్వు ఈ నెలలలో తెరచి ఉంటుంది. వాతావరణము సులభంగా ఉండుట వల్ల పులులు మరియు ఇతర జంతువులు గుర్తించడం చాలా ఆహ్లాదకరముగా ఉంటుంది. ఈ సమయంలో చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉండదు. అందువల్ల ఈ నెలల్లో పన్నా కు ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంటుంది.

వేసవి

వేసవి కాలంపన్నా లో వేసవికాలంలో ఉప ఉష్ణమండలీయ వాతావరణం కలిగి ఉండుట వలన చాలా వేడిగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత మే నెలలో 45 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటుంది. వేసవి సాధారణంగా మార్చి మధ్య నుండి ప్రారంభమై జూన్ మధ్య వరకు ఉంటుంది. ఇక్కడ వేడి గాలులు కారణంగా ఈ సమయంలో ప్రయాణమునకు అనుకూలం కాదు.

వర్షాకాలం

వర్షాకాలంవర్షాకాలం జూన్ మధ్య నుండి ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో జూలై మరియు ఆగస్టు నెలల్లో భారీ వర్షపాతం కలిగి ఉంటుంది. అందువల్ల పన్నా సందర్శించడానికి అనువైన సమయం కాదు.

చలికాలం

శీతాకాలముశీతాకాలము నవంబరు చివరిలో ప్రారంభమవుతుంది. డిసెంబరు మరియు జనవరి అత్యంత చల్లదనం ఉండే నెలలు. ఈ నెలలలో ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల సెల్సియస్ కు తగ్గిపోవచ్చు. శీతాకాలపు మధ్యాహ్నాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. కానీ రాత్రులు కఠినమైనవి మరియు చల్లగా ఉండుట వల్ల ఫిబ్రవరి ముగిసే వరకు పర్యటన కష్టం.