పన్నా - డైమండ్ నగరం !

పన్నా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందిన భారతీయ నగరం. ప్రపంచం మొత్తంలోనే పన్నా వజ్రాలు నాణ్యత మరియు స్పష్టత కలిగి ఉంటాయి. ప్రముఖంగా ప్రతి నెల చివరిలో జిల్లా మేజిస్ట్రేట్ ద్వారా వేలం జరుగుతుంది.

నగరంలో హిందువులకు మతపరమైన ప్రాముఖ్యత చాలా కలిగి ఉంది. ఇక్కడ మహామతి ప్రన్నాథ్ స్వయంగా సందేశాన్ని భోదించారు. అంతేకాకుండా జగాని జెండా విప్పారు. పన్నాలో మహామతి తన శిష్యులతో పాటు పదకొండు సంవత్సరాలు గడిపిన తర్వాత అయన సమాధి తీసుకోవాలని నిర్ణయించుకున్నారని నమ్ముతారు.

పన్నా మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

పన్నా టూరిజంలో పన్నా నేషనల్ పార్క్ యొక్క ఉనికి ఎక్కువగా ఉన్నప్పటికీ పాండవుల గుహలు మరియు జలపాతాలు కూడా సమానంగా ప్రసిద్ధి చెందాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఈ అందమైన నగరంలో ప్రకృతి ప్రేమికులకు పార్కులు మరియు మనోహరమైన పిక్నిక్ స్పాట్ లు ఉన్నాయి.

టైగర్స్ హోం

పన్నా నేషనల్ పార్క్ పన్నాలో ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉంది. ఎందుకంటే పులులు ఉన్న అతి తక్కువ జాతీయ పార్కులలో ఇది ఒకటి. ఖజురహో నుండి ఈ పార్క్ కు సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడ పుష్కలంగా రిసార్ట్స్ మరియు రాత్రి బస కోసం హోటల్స్ ఉన్నాయి.

పన్నా చేరుకోవడం ఎలా?

పన్నా రైలు మరియు బస్సు మార్గాల ద్వారా రాష్ట్రంలో ఇతర నగరాలు మరియు పట్టణాలకు అనుసంధానించబడి ఉంది.

పన్నా వాతావరణము

పన్నా భౌగోళిక స్థానాన్ని బట్టి అక్టోబర్ మరియు ఏప్రిల్ నెలల మధ్య ఈ ప్రదేశములో ప్రయాణం చేయడానికి అనువుగా ఉంటుంది. ఉప ఉష్ణమండలీయ వాతావరణాన్ని కలిగి ఉంటుంది.

Please Wait while comments are loading...