Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పరదీప్ » వాతావరణం

పరదీప్ వాతావరణం

పరదీప్ వాతావరణంనవంబర్, మార్చ్ నెలల మధ్యలో పరదీప్ సందర్శన సరైనది. సంవత్సరంలో ఈ సమయంలో వాతావరణం చాలా చల్లగా, సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే, రాత్రులు, సాయంత్రాలు ఎక్కువ చల్లదనం ఉంటుంది కావున తేలికపాటి శీతాకాల దుస్తులను వెంట తీసుకెళ్లడం మంచిది.

వేసవి

వేసవి మార్చ్ లో వేసవి కాలం ఆగమనంతో, పరదీప్ లో వేడి మొదలౌతుంది. మండే సూర్యుడివల్ల వాతావరణంలో ఆర్ద్రత పెరిగి భరించలేనిదిగా ఉంటుంది. మే చివరి వరకు ఉండే వేసవిలో ఉష్ణోగ్రత 41 డిగ్రీల కంటే ఎక్కువ పెరగవచ్చు. వేసవిలో పరదీప్ పర్యటన సూచనప్రాయం కాదు.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలంలో పరదీప్ లో భారీవర్షాలు కురుస్తాయి. వర్షాకాలం మే నెలలో ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. అక్టోబర్ లో చెదురుమదురు వర్షాలు పడతాయి. ఈ ప్రాంతంలో సంవత్సరంలో సగటు వర్షపాతం 1480 మిల్లీమీటర్లుగా నమోదవుతుంది.

చలికాలం

శీతాకాలం పరదీప్ లో శీతాకాలం అక్టోబర్ చివరలో ప్రారంభమౌతుంది. నవంబర్ మధ్య వరకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది, తరువాత చలి ప్రారంభమౌతుంది. ఒరిస్సాలోని ఇతర ప్రాంతాల వలె ఈ ప్రాంతంలో చల్లని గాలులు వీస్తాయి. రాత్రిసమయంలో ఉష్ణోగ్రత 9 డిగ్రీలకు పడిపోతుంది. మార్చ్ ప్రారంభం వరకు శీతాకాలం ఉంటుంది.