Search
 • Follow NativePlanet
Share

పరదీప్  – రేవు పట్టణం !!

18

ఒడిశా లోని జగత్సింగ్ పూర్ జిల్లాలో వేగంగా అభివృద్ది చెందుతున్న పారిశ్రామిక ప్రాంతాల్లో ఒకటి పరదీప్. పరదీప్ భువనేశ్వర్ విమానాశ్రయం నుంచి 125 కిలోమీటర్లు, కటక్ రైల్వే స్టేషన్ నుంచి 95 కిలోమీటర్ల దూరంలో వుంది. పరదీప్ రేవు పరదీప్ పట్టణాన్ని భారత తూర్పు కోస్తాలో ప్రధాన రేవు పట్టణంగా మార్చింది. రాష్ట్రంలో ఇది అతి ప్రాచీన రేవు కూడా. పరదీప్ సామర్ధ్యం అర్థం అయ్యాక, స్టీల్ ప్లాంట్లు, అల్యూమినియం రిఫైనరీలు, ఒక పెట్రో కెమికల్ సముదాయ, ధర్మల్ విద్యుత్ కేంద్రాలు అన్నీ ఇక్కడ ఏర్పాటు చేసారు. ఇలాంటి మరిన్ని పరిశ్రమల గురించి తెలుసుకోవాలనుకునే వారికి పరదీప్ రేవు ఇంకా చాలా అందిస్తుంది. ప్రకృతి అందాన్ని ప్రేమించే వారికి ఇక్కడి విస్తారమైన సముద్ర తీరం, ఉష్ణమండల సూర్యుడు, పచ్చటి అడవులు, సహజ నీటి చెలమలు, అన్నీ కలిసి పరదీప్ ను చూసి తీరాల్సిన స్వర్గధామంగా మారుస్తాయి.

పరదీప్ లోను చుట్టు పక్కల పర్యాటక కేంద్రాలు

పరదీప్ బీచ్ లో బంగారు రంగు నీటి వెంట ఈత కొడుతూనో లేక నడుస్తూనో కుటుంబ౦తో సరదాగా గడపడానికి ఈ ప్రదేశం బాగుంటుంది. సందర్శకులు శుభ్రమైన, పచ్చని స్ముర్తి ఉద్యానవనంలో విశ్రాంతి కూడా తీసుకోవచ్చు, ఈ తోట 1990 లో పరదీప్ లో వచ్చిన తుఫాను వల్ల జీవనాధారం కోల్పోయిన వారికి ఏర్పాటుచేయబడింది. ఇక్కడ ఉన్న మ్యూజికల్ ఫౌంటైన్ కూడా సందర్శనకు విలువైనది. గహిర్మత బీచ్ అరుదైన తెల్లని మొసళ్ళ జాతులకు నిలయం, ఇది తెలుపు మానిటర్ బల్లులు, సముద్ర తాబేళ్లు, వలస పక్షులు అలాగే జింకలకు ప్రసిద్ది చెందింది. భితర్కనిక నేషనల్ పార్క్, నదులు, సెలయేళ్ల ద్వారా అధిగమించే మదనదుల తో ఏర్పడిన అడవి, మనిషి, ప్రకృతి, జంతువులు సామరస్యంతో జీవించడానికి చరిత్రలో తిరిగి వంద సంవత్సరాలు పట్టవచ్చు. 28 టా౦కులతో పరదీప్ వద్ద ఉన్న మరైన్ అక్వేరియం అనేక రకాల జాతులకు చెందిన చేపల వద్ద మిమ్మల్ని వదిలితే ఆశ్చర్యంతో నోరు తెరుస్తారు. వార్షిక ఉరుసు ఉత్సవ సమయంలో పరదీప్ లోని జగన్నాథ ఆలయాన్ని సందర్శించే పర్యాటకులు జగన్నాథ రధాన్ని గీసే అన్ని మతాల ప్రజలను చూసి ఆశ్చర్యానికి గురౌతారు. ఇక్కడ, ఇది నిజంగా లౌకిక భారతదేశ స్పష్టమైన భావనను కలుగచేస్తుంది.

పరదీప్ పర్యటన, పరదీప్ నుండి షుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెహ్రు భవనం, లైట్ హౌస్ ని ప్రదర్శిస్తుంది. పరదీప్ అందించే హనుమంతుడి ఆలయం కూడా ప్రధాన ఆకర్షనలలో ఒకటి.

నాలుక-తడుపుకునే సముద్ర ఆహరం, సేదతీర్చే పానీయాలు

పగలు ఏ సమయంలోనైనా సముద్ర ఆహారాన్ని కోరుకున్నంత తీసుకోవచ్చు; చేపలు, రొయ్యలు ఇక్కడి ప్రత్యేకత. కొబ్బరితో తయారుచేసే పరదీప్ లస్సి లేదా గావేస్కర్ లస్సి ప్రతి సందర్శకుడు కోరుకునే పానీయం. మధువన్ మార్కెట్ భవనంలో ఢిల్లీ దర్బారు వద్ద మీరు ఒక ప్లేటు బిర్యానీ ఆర్డర్ ఇస్తే, ఖచ్చితంగా ఇంకా కావలి అని అడుగుతారు. ప్రసిద్ధ బిర్యానీ 99 కి ఎక్కువ ఆర్డర్లు వస్తాయి.

పరదీప్ వాతావరణం

పరదీప్ లో వాతావరణం వేసవి, శీతాకాలం, వర్షాకాలం అనే మూడు కాలాలుగా విభజించారు. పరదీప్ వద్ద వేసవి చాలా వేడిగా, ఆర్ద్రంగా ఉండి, శీతాకాలం చాలా చల్లగా ఉంటుంది.

పరదీప్ చేరుకోవడం ఎలా

మీరు భువనేశ్వర్ విమానాశ్రయం లేదా కటక్ రైల్వే స్టేషన్ కి వెళ్ళారా అనేది పెద్ద విషయం కాదు, మీరు పరదీప్ కి బస్సులో వెళ్ళవచ్చు. NH-5A పరదీప్ కి ఒరిస్సా లోని అన్ని ప్రధాన నగరాలనూ కలుపుతుంది. వాస్తవానికి, పరదీప్ రైలుద్వార కలుపబడి ఉంది; కానీ ప్రతి ఒక్కరూ భువనేశ్వర్ లేదా కటక్ గుండా ఈ ప్రాంతాన్ని చేరడానికి ప్రాధాన్యతనిస్తారు. ఇక్కడి పర్యటనకు నవంబర్ నించి మార్చ్ వరకు ఉత్తమ సమయంగా భావించబడింది.

పరదీప్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పరదీప్ వాతావరణం

పరదీప్
33oC / 91oF
 • Haze
 • Wind: S 7 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం పరదీప్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? పరదీప్

 • రోడ్డు ప్రయాణం
  పరదీప్ కు రోడ్ రవాణా కలదు. నేషనల్ హై వే 5 ఓడిషా లోని అన్ని ప్రదేశాలకు పరదీప్ ను కలుపుతుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనుండి, టాక్సీ లు, బస్సు లు కలవు.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  పరదీప్ కు రైలు స్టేషన్ కలదు. కాని పర్యాటకులు భువనేశ్వర్ లేదా కటక్ రైలు స్టేషన్ లు ఉపయోగిస్తారు. కటక్ ప్రధాన రైలు స్టేషన్. ఇది 94 కి. మీ. ల దూరం. ఇక్కడ నుండి బస్సు సౌకర్యం తరచుగా కలదు.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  పరదీప్ కు సమీప ఎయిర్ పోర్ట్ భువనేశ్వర్ లో కలదు. దీనిపేరు బిజు పట్నాయక్ ఎయిర్ పోర్ట్. ఇక్కడ నుండి ఇండియా లోని అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు ప్రయాణించవచ్చు. ఈ ఎయిర్ పోర్ట్ 109 కి. మీ. కల దూరం.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
22 Jul,Mon
Return On
23 Jul,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
22 Jul,Mon
Check Out
23 Jul,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
22 Jul,Mon
Return On
23 Jul,Tue
 • Today
  Paradip
  33 OC
  91 OF
  UV Index: 8
  Haze
 • Tomorrow
  Paradip
  28 OC
  83 OF
  UV Index: 8
  Partly cloudy
 • Day After
  Paradip
  28 OC
  83 OF
  UV Index: 8
  Partly cloudy