కోణార్క్ - రాతిపై చెక్కబడిన గాధ!

భువనేశ్వర్ నుండి 65 కిలోమీటర్ల దూరం లో ఉన్న కోణార్క్ స్మారక కట్టడాలు కలిగిన అందమైన పట్టణం. మనోహరమైన బే ఆఫ్ బెంగాల్ సముద్రతీరం కి ఎదురుగా ఉన్న ఈ చిన్న పట్టణంలో భారత దేశం యొక్క అత్యధ్బుతమైన నిర్మాణ సౌందర్యాలను వీక్షించవచ్చు.

కోణార్క్ ఓడిశా ఆలయం యొక్క నిర్మాణ సౌందర్యాన్ని ప్రదర్శిస్తుంది. కోణార్క్ నగరం యొక్క అందం రాతి పై చెక్కబడినది. అంతేకాకుండా, ఈ ప్రాంతాన్ని మానవుడి భాషని ఓడించే రాతి భాష గా అభివర్ణిస్తారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన అధ్బుతమైన స్మారక కట్టడాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.

కోణార్క్ లో ఇంకా చుట్టు పక్కల పర్యాటక ఆకర్షణలు

ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులని ఆకర్షించే ఎన్నో ఆకర్షణలు కోణార్క్ పర్యాటకం సొంతం. ఈ పట్టణం అద్భుతమైన నిర్మాణం కలిగిన సన్ టెంపుల్ కి ప్రసిద్ది. నిజానికి కోణార్క్ అనే పేరు కోణ అనబడే సంస్కృత పదం నుండి వచ్చింది. కోణ అంటే కోణము అర్క అంటే సూర్యుడు. సూర్యుడికి అంకితమివ్వబడిన ఆలయం అందమైన ఆలయం తో ఈ పేరు వచ్చింది.

ఈ సన్ టెంపుల్ సముదాయం లో మాయాదేవి మరియు వైష్ణవ టెంపుల్ మందిరాలు కలవు. కోణార్క్ లో ని అందమైన ప్రసిద్ది చెందిన ఆలయాల సందర్శనని పర్యాటకులు ఆనందించవచ్చు. కోణార్క్ ప్రధాన దైవం కి అంకితమివ్వబడిన ఆలయం రామచండి టెంపుల్. ప్రసిద్ది చెందిన పర్యాటక ఆకర్షణ ఇది.

త్రవ్వకాలలో వెలికితీయబడిన బుద్ధుడి విగ్రహం కలిగిన బౌద్ధ విహారం కురుమ. పర్యాటకులను అమితంగా ఆకర్షించే ప్రదేశం. ప్రాచి నది ఒడ్డున ఉన్న కాకతాపూర్ మంగళ టెంపుల్ ఝాము యాత్ర అనబడే ప్రసిద్దమైన వేడుకల వల్ల అనేకమంది పర్యాటకులని ఆకర్షిస్తుంది. చౌరాసి లో ఉన్న బరాహి టెంపుల్ లో ఉన్న విశిష్టత మాతృ దేవత యొక్క విగ్రహం. అష్టరంగా వద్ద విశాల దృశ్య వీక్షణం అధ్బుతంగా ఉంటుంది.

కోణార్క్ మఠ్ కూడా ప్రసిద్ది చెందిన పర్యాటక ఆకర్షణ. వైభవోపేతమైన స్మారక చిహ్నాలు అలాగే ఆధ్యాత్మిక ఆకర్షణలతో పాటు కోణార్క్ లో మంత్ర ముగ్ధుల్ని చేసే బీచ్ పర్యాటకులని కట్టిపడేస్తుంది. ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యూజియం కూడా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇందులో సన్ టెంపుల్ సముదాయం లో నుండి సేకరించిన ఎన్నో అవశేషాలు ఉన్నాయి.

కోణార్క్ - పాత కొత్తల మేలు కలయిక

కోణార్క్ పర్యాటకం పాత కొత్తల మేలు కలయిక. ఒకవైపు చారిత్రక స్మారక చిహ్నాలు అలాగే శతాబ్దాల పురాతన ఆలయాల నిర్మాణాలు మిమ్మల్ని ఆశ్చర్యపరిస్తే మరొకవైపు కోణార్క్ యొక్క ఉత్సాహపురితమైన సామాజిక జీవితం ఆకర్షిస్తుంది.

కోణార్క్ - రంగులమయం

కోణార్క్ కచ్చితంగా పర్యాటకుల స్వర్గం. ఈ ఉత్సాహపురితమైన నగరం ప్రపంచం నలు మూలల నుండి పర్యాటకులని వివిధ పర్వదినాలలో ఆకర్షిస్తుంది. కోణార్క్ డాన్సు ఫెస్టివల్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 నుండి 5 వరకు జరుగుతుంది. ఇది దేశం లో నే జరిగే శాస్త్రీయ నృత్య వేడుకలు. ప్రాచీన నృత్యాలైన ఒడిస్సి, భరతనాట్యం, కథక్, కూచిపూడి, మణిపురి మరియు స్థానిక ఛౌ డాన్సు ల యొక్క ప్రదర్శన వేడుకలు.

కోణార్క్ పర్యాటకం లో ప్రధాన ఆకర్షణ చేతి వస్తువుల మేళా. నోరూరించే వంటకాలు ఇక్కడి పర్యాటకులని ఆకట్టుకుంటాయి. కోణార్క్ లో పెద్ద ఎత్తున జరిగే మరొక ముఖ్యమైన పండుగ చంద్రభాగ మేళా యొక్క మాఘ సప్తమి మేళా. ఫిబ్రవరి నెలలో జరుగుతాయి.

కోణార్క్ లో ని షాపింగ్ ఆహ్లాదకరమైన అంశం. కోణార్క్ లో ఉన్న రంగుల కుటీర పరిశ్రమలో అప్ప్లిక్ వర్క్ తో అలంకరించబడిన పందిళ్ళు, అలంకరించబడిన బాగ్స్ మరియు గొడుగులు వంటివి లభిస్తాయి. వివిధ హిందూ దేవతలా యొక్క చిత్రాలు, ఏనుగు దంతం, రాయి మరియు చెక్కతో చెయ్యబడిన డెకరేటివ్ వస్తువులు పట్టా పెయింటింగ్స్ వంటి వివిధ రకాల ప్రసిద్ద వస్తువులు ఆకట్టుకుంటాయి.

కోణార్క్ ని సందర్శించేందుకు ఉత్తమ సమయం

అక్టోబర్ నుండి మార్చ్ వరకు కోణార్క్ ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. శీతాకాల వాతావరణం ఈ ప్రాంత పర్యటనకు అనువుగా ఉంటుంది.

కోణార్క్ కి ఎలా చేరాలి?

కోణార్క్ కి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. విమానాల ద్వారా చేరుకునే పర్యాటకులకు భుబనేశ్వర్ విమానాశ్రయం ప్రవేశ మార్గం గా వ్యవహరిస్తుంది. పూరి ఇంకా భుబనేశ్వర్ లో ఉన్న రైల్వే స్టేషన్లు మరియు రోడ్డు నెట్వర్క్స్ కోణార్క్ కి చేరుకునేందుకు ఉపయోగపడతాయి.

Please Wait while comments are loading...