ముగ్దలేశ్వర దేవాలయం పర్భాని గ్రామంలో కలదు. గోదావరి నదీ ఒడ్డున ప్రవాహం మధ్యలో కలదు. ఇది సుమారు 900 సంవత్సరాల క్రిందటిది. ఈ దేవాలయంలో ఒక లింగం ఉంటుంది. దీనిని నరసింహ స్వామి అని అంటారు. దేవాలయ శిల్పశైలి ఇతర వివరాలు వంటివి దేవాలయ ప్రవేశంలో రాతి ఫలకంపై వివరించారు. వర్షాకాలంలో నదీ ప్రవాహం పొంగటంతో దేవాలయం దర్శన అసౌకర్యమవుతుంది. భక్తులు దర్శనం కొరకు ఈత కొట్టుకుంటూ కూడా వస్తారు. గతంలో ఈ దేవాలయాన్ని శ్రీ సాహెబ్ రావు ముద్గాల్ కర్ మరియు శ్రీ సుభాష్ రావ్ ముడ్గాల్ కర్ అనే ఇరువురు స్ధానికులు నిర్వహించేవారు.



Click it and Unblock the Notifications