ముక్తేస్వర్ టెంపుల్ పఠాన్ కోట కు 21 కి.మీ.ల దూరంలో కలదు. ఈ టెంపుల్ పంజాబ్ లో అతి పవిత్ర ప్రదేశాలలో ఒకటి. దీనిలో శివ భగవానుడు మరియు తెల్లటి శివ లింగం రాగి యోనిలో వుంటుంది. ఇంకనూ, విష్ణు, పార్వతి, గణేశ విగ్రహాలు కూడా కలవు.
పాండవులు ఇక్కడి గుహలలో వారి రాజ్య బహిష్కరణ సమయంలో వుండి ఇక్కడి గుడి నిర్మించి పూజలు చేసారని చెపుతారు. టెంపుల్ వెనుక రావి రివర్ మరియు కొండలు వుంటాయి. ఈ టెంపుల్ ను ముకేశ్రాన్ మందిర్ అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం బైసాఖి రోజున ఏప్రిల్ నెలలో ఒక ప్రసిద్ధ ముకేశ్రాన్ డా మేళ జరుగుతుంది. ఈ మేలా కు రాష్ట్రంలోని ప్రజలే కాక, జమ్మూ కాశ్మీర్ , హిమాచల్ ప్రదేశ్ ల నుండి కూడా భక్తులు వస్తారు. రావి నది యొక్క ఎడమ ఒడ్డు పంజాబ్ కు కుడి ఒడ్డు జమ్మూ కాశ్మీర్ కు చెంది వుండటం ఒక విశేషం.



Click it and Unblock the Notifications