దానాపూర్ లో ఉన్న గురుద్వారా హండి సాహిబ్ పాత పాట్న నగరానికి పశ్చిమాన షుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. గురు తేజ్ బహదూర్ కుటుంబం పాట్న వదిలిపెట్టిన తరువాత సాహిబ్ మొదట ఇక్కడే ఆగారు. మతగ్రంధాల ప్రకారం, మై పర్దని అనే వృద్ధ మహిళ ఒక గిన్నె నిండా (హండి) ఖిచిడి వండి ఇచ్చింది దాని ఫలితంగా హన్దివాలి సాంగత్ అనే పేరుతో ఒక మందిరాన్ని స్థాపించారు, అది ఇప్పుడు గురుద్వారా హండి సాహిబ్ గా పిలువబడుతుంది.



Click it and Unblock the Notifications