విమాన మార్గం: పోచంపల్లి కి అతి సమీపంలోని ఉన్న విమానాశ్రయం రాజీవ్ గాంధి అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్ విమానాశ్రయం). విమానాశ్రయానికి, పట్టణానికి మధ్య సుమారు 50 కి.మీల దూరం. విమానాశ్రయం నుంచి ప్రైవేటు టాక్సీలో పోచంపల్లి పట్టణం చేరుకోవచ్చు. టాక్సీ రుసుము రూ.2000 నుంచి 4000 వరకు ఉండవచ్చు. పోచంపల్లి చేరుకోవడానికి సుమారు రెండు గంటల సమయం పట్టవచ్చు.