Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పోచంపల్లి

పోచంపల్లి -  భారత దేశపు పట్టు పట్టణం

9

తెలంగాణ లోని నల్గొండ జిల్లా లోని పోచంపల్లి పట్టణం, అక్కడ నేయబడే అత్యంత నాణ్యమైన పట్టు చీరల వల్ల, భారత దేశపు పట్టు పట్టణంగా పేరు పొందింది. కేవలం చీరల వల్లే పోచంపల్లి ప్రసిద్ధి కాదు. సంస్కృతి, సంప్రదాయం, వారసత్వ సంపద, చరిత్ర, ఆధునికతల మేలు మిశ్రమం కావటం దీని ప్రత్యేకత. ఈ సుందర పట్టణం కొండలు, తాటి చెట్ల వరసలు, సరస్సులు, చెరువులుచే ఆవృతమై ఉంది. ప్రజల నిత్య కృత్యాలతో పట్టణం ఎప్పుడూ సందడిగా ఉంటుంది. అయితే, వారి పని, అతిథులను మనస్ఫూర్తిగా ఆహ్వానించటంలో అడ్డుపడదు. నిజానికి, చాలా మంది విదేశీ పర్యాటకులు పట్టు చీరల నేత నేర్చుకోవటానికి వారాలు తరబడి పోచంపల్లి లోనే బస చేయటం సాధారణం.

ఈ పట్టణానికి చాలా ఆసక్తికరమైన చరిత్ర ఉంది. స్వాతంత్ర్యానంతర భారత దేశంలోని ఒక ముఖ్యమైన ఉద్యమానికి పోచంపల్లి లో జరిగిన సంఘటన వెన్నెముకగా నిలిచింది. 1951 వ సంవత్సరంలో ఇక్కడికి విచ్చేసిన వినోభా భావేకి పోచంపల్లి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రజలు తమకోసం, తమ కుటుంబాల కోసం 80 ఎకరాల భూమిని కోరారు. పోచంపల్లి లో ఒక భూస్వామి అయిన వెద్రే రామచంద్ర రెడ్డి 250 ఎకరాల భూమిని ప్రజలకు స్వచ్చంద వితరణగా అందించారు. ఈ ఘటన భూదాన ఉద్యమ స్ఫూర్తిని బాగా రగిలించింది. అప్పటినుంచి ఈ పట్టణం భూదాన్ పోచంపల్లిగా పిలవబడుతుంది.

పోచంపల్లిలో చూడవలసిన ఆసక్తికరమైన ప్రదేశాలలో వినోభా మందిరం, 101 ద్వారాల గృహం ముఖ్యమైనవి. విమానాశ్రయం గానీ, రైల్వే స్టేషన్ గానీ ఇక్కడ లేకపోయినా, హైదరాబాద్ నుంచి ఈ పట్టణం చేరుకోవటం తేలికే. రాష్ట్రం  లోని మిగతా ప్రదేశాల లాగే పోచంపల్లి లో ఉష్ణ మండల వాతావరణం ఉంటుంది. వేసవులు మిక్కిలి వేడిగా, శీతకాలాలు చల్లగా ఉంటాయి. ఆసక్తికరమైన చరిత్రతో, విశిష్టమైన సంస్కృతితో, కొనుగోలుకి అవకాశాలతో పోచంపల్లి అనబడే ఈ చిన్న పట్టణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాత్రికులను ఆకర్షిస్తుంది.

పోచంపల్లి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఎలా చేరాలి? పోచంపల్లి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం: హైదరాబాద్ నుంచి వస్తున్నట్టు అయితే పోచంపల్లికి చక్కని రహదారి అందుబాటులో ఉంది. హైదరాబాద్ నగరం పోచంపల్లి పట్టణాలు మధ్య దూరం సుమారు 35 కి.మీలు. హైదరాబాద్ నుంచి పోచంపల్లి కి చాలా బస్సులు తిరుగుతాయి. కొన్ని ప్రైవేటు బస్సు యాజమాన్యాలు పోచంపల్లి కి ప్రత్యేక యాత్రలు నిర్వహిస్తాయి. వీటి సహాయంతో పర్యాటకులు పోచంపల్లి లో ఒక పగలు, ఒక రాత్రి పూర్తిగా గడిపి అక్కడ చూడదగ్గ విశేషాలన్నీ చూడవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం: పోచంపల్లి లో రైల్వే స్టేషన్ లేదు. బీబీనగర్ దీనికి అత్యంత సమీపంలోని రైల్వే స్టేషన్. పోచంపల్లి పట్టణానికి బీబీనగర్ రైల్వే స్టేషన్ ల మధ్య సుమారు 16 కి.మీ ల దూరం. రైల్వే స్టేషన్ నుంచి టాక్సీ గానీ బస్సు గానీ ఎక్కి పోచంపల్లి చేరుకోవచ్చు. పొరుగు నగరాలు, పట్టణాల నుంచి బీబీనగర్ రైల్వే స్టేషన్ చేరుకోవడం సులభతరం.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం: పోచంపల్లి కి అతి సమీపంలోని ఉన్న విమానాశ్రయం రాజీవ్ గాంధి అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్ విమానాశ్రయం). విమానాశ్రయానికి, పట్టణానికి మధ్య సుమారు 50 కి.మీల దూరం. విమానాశ్రయం నుంచి ప్రైవేటు టాక్సీలో పోచంపల్లి పట్టణం చేరుకోవచ్చు. టాక్సీ రుసుము రూ.2000 నుంచి 4000 వరకు ఉండవచ్చు. పోచంపల్లి చేరుకోవడానికి సుమారు రెండు గంటల సమయం పట్టవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun