Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పూంచ్ » వాతావరణం

పూంచ్ వాతావరణం

ఉత్తమ సమయం : అక్టోబర్ అలాగే నవంబర్ నెలలు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనువైన సమయం. ఎండాకాలాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. శీతాకాలాలు చాలా చలిగా ఉంటూ మంచు కురిపిస్తాయి. అవుట్ డోర్ ఆక్టివిటీస్ కి అనువుగా ఉండడం వల్ల ఎండాకాలంలో ఈ ప్రాంతాన్ని పర్యటించేందుకు పర్యాటకులు ఉత్సాహం కనబరుస్తారు.  

వేసవి

ఏడాది పొడవునా ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అందువల్ల ఈ ప్రాంతాన్ని ఏ సమయంలో నైనా సందర్శించవచ్చు. ఎండాకాలం తక్కువ . చలికాలంలో చలి గడ్డ కట్టించే విధంగా ఉంటుంది. వర్షాకాలంలో భారీ వర్షపాతాలు నమోదవుతాయి.ఎండాకాలం(ఏప్రిల్ నుండి జూన్) : ఎండాకాలం లో ఈ ప్రాంత వాతావరణం వెచ్చగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్. సానుకూలమైన వాతావరణ పరిస్థితుల వల్ల పర్యాటకులు ఈ ప్రాంతాన్ని ఈ సమయంలో సందర్శించేందుకు అమితమైన ఆసక్తి ని కనబరుస్తారు.  

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్): వర్షాకాలంలో ఈ ప్రాంతంలో గణనీయమైన వర్షపాతం లో నమోదవుతుంది. ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో పాటు చుట్టూ ఆకుపచ్చని సౌందర్యం కనువిందు చేస్తుంది.  

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి) : శీతాకాలం లో ఇక్కడి వాతావరణం బాగా చలిగా ఉంటుంది. ఫ్రీజింగ్ పాయింట్ వరకు మెర్క్యూరీ పడిపోతుంది. ఈ సమయంలో మంచు ఎక్కువగా కురుస్తుంది.