Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ప్రాగ్ పూర్ » వాతావరణం

ప్రాగ్ పూర్ వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ కాలం: ప్రాగ్ పూర్ లో వాతావరణం ఏడాది పొడవునా ఒక మోస్తరుగా ఉంటుంది. అయితే, వర్షాకాలం, వేసవికాలాలు ఈ ప్రాంత సందర్శనకు ఆదర్శమైనవిగా పరిగణిస్తారు. వేసవికాలంలో ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత 20, 32 డిగ్రీల సెంటిగ్రేడ్ ల మధ్య ఉండి, ప్రదేశాల పర్యటనకు అనువుగా ఉంటుంది.

వేసవి

ప్రాగ్ పూర్ ఏడాది పొడవునా ఒక మోస్తరు వాతావరణాన్ని కల్గి ఉంటుంది. ఇటువంటి ఆహ్లాదకర వాతావరణం వలన ఈ ప్రాంతాన్ని ఏడాదిలో ఏ సమయంలోనైనా సందర్శించవచ్చు.వేసవి కాలం (ఏప్రిల్ నుండి జూన్ వరకు) : ప్రాగ్ పూర్లో వేసవి కాలం ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉంటుంది. ఈ కాలంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 32, 20 డిగ్రీల సెంటిగ్రేడ్ గా నమోదు చేయబడ్డాయి. ఈ ప్రాంత ఆహ్లాదకరమైన వాతావరణం వలన పర్యాటకులు ప్రాగ్ పూర్ ను సాధారణంగా వేసవిలో సందర్శిస్తారు.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్ వరకు) : ప్రాగ్ పూర్ లో వర్షాకాలం జూలై లో ప్రారంభమై సెప్టెంబర్ నెల వరకు ఉంటుంది. ఈ కాలంలో ఇక్కడ భారీ వర్షాలు కురుస్తాయి; పర్యాటకులకు వర్షపు దుస్తులు తీసుకొని వెళ్లవలసినదిగా సూచించబడింది. ఈ ప్రాంత సందర్శనకు ఉపచార వాతావరణ గుణమున్నవర్షాకాలం కూడా మంచి సమయమే.

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు) : ప్రాగ్ పూర్ లో శీతాకాలం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ కాలంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వలే ఇక్కడి ఉష్ణోగ్రత మరింత తక్కువస్థాయికి పడిపోదు. ఈ ప్రాంతంలో శీతాకాలంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు 16, 25 డిగ్రీల సెంటిగ్రేడ్లుగా నమోదు చేయబడ్డాయి.