రాయ్ పూర్ నుండి షుమారు 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరంగ్ ఒక పురాతన నగరం. ఈ నగరం భందదేవాల్ ఆలయం, మహామాయ ఆలయం వంటి పురాతన ఆలయాలకు పేరుగాంచింది.
భందదేవాల్ ఆలయం దాని నిర్మాణ శైలికి పేరుగాంచింది. ఈ ఆలయం నల్లరాయితో చేసిన మూడు అతిపెద్ద జైన తీర్థంకరుల విగ్రహాలను కలిగి ఉంది. అదేవిధంగా, మహామాయ ఆలయం కూడా జైన తీర్థంకరుల మూడు పెద్ద విగ్రహాలను కలిగి ఉంది, అంతేకాకుండా ఇక్కడ 24 జైన తీర్థంకరుల విగ్రహాలు చెక్కబడిన పెద్ద రాయికూడా ఉంది.
దంతేశ్వరి ఆలయం, చండి మహేశ్వరి ఆలయం, పంచముఖి మహాదేవ ఆలయం, పంచముఖి హనుమాన్ ఆలయం ఈ నగరంలోని ఇతర ప్రధాన ఆలయాలు.



Click it and Unblock the Notifications