Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» రుద్రనాద్

రుద్రనాద్ - కోపంలో శివుడు!

8

ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లా లో రుద్రానాద్ ప్రసిద్ధి చెందిన ఒక గ్రామం. ఈప్రదేశం సముద్ర మట్టానికి 2286 మీ.ల ఎత్తున వుండి పర్యాటకులకు మంచు తో నిండిన హిమాలయన్ పర్వత శ్రేణులను చూపుతుంది. అసలు రుద్రానాద్ అనే పదానికి అర్ధం చెప్పాలంటే, 'కోపం గా వున్న వాడు' అని చెప్పాలి. ఈ గ్రామం అయిదు కేదార్ నాద్ లలో మూడవదిగా వస్తుంది. మిగిలిన నాలుగు టెంపుల్స్ ...కేదర్నాద్ టెంపుల్,తుంగనాథ్ టెంపుల్, మధ్య మహేశ్వర్ టెంపుల్, కల్పేశ్వర్ టెంపుల్ గా చెప్పవచ్చు. రుద్రనాథ్ టెంపుల్ లో హిందువుల దేముడు శివుడికి పూజలు చేస్తారు. ఇక్కడ శివుడిని నీలకంట మహాదేవ అంటారు. స్థానికుల నమ్మకాలమేరకు ఈ గుడి ని మహాభారతంలోని పాండవులు నిర్మించారు. ఒక కధనం మేరకు పాండవులు దుష్టులైన కౌరవులను యుద్ధంలో చంపారు. అయితే, శివ భగవానుడు వారిని కలవటానికి ఇష్టం చూప లేదు.

అపుడు శివుడు ఒక నంది గా మారి గర్హ్వాల్ ప్రాంతం లో దాక్కుంటాడు. విషయం తెలిసిన పాండవులు గుప్తకాశిలో పాండవులు ఆ నందిని చూసి బలవంతంగా ఆపేందుకు ప్రయత్నించి విఫలులు అవుతారు. ఆ వెంటనే శివుడి శరీరం అయిదు ప్రదేశాలలో ముక్కలుగా కనపడుతుంది. శివుడి ముఖం పడిన ప్రదేశంలో రుద్రనాథ్ టెంపుల్ నిర్మించారు. ఈప్రదేశం చుట్టూ అనేక నీటి సరస్సులు కలవు. అవి సూర్య కుండ్, చంద్రకుండ్,తర కుండ్,మరియు మాన కుండ్ గా చెపుతారు. ఈప్రదేశం నుండి అందమైన హాతి పర్వత, నంద దేవి,నంద ఘుంటి,త్రిశూల్ శిఖరాలను చూడవచ్చు. టూరిస్టులు ఈ టెంపుల్ ను సాగర్ గ్రామం నుండి లేదా జోషిమట్ ల నుండి ట్రెక్కింగ్ లో చేరవచ్చ్లు. మార్గం లో సుందరమైన పచ్చిక బయళ్ళు చూడవచ్చు. రంగు రంగుల అడవి పూవులు కల పనార్ బుగియాల్ వాటిలో ఒకటి. ఇక్కడ ఒక జలపాతం మరియు ఒక టెంపుల్ ఈ మైదానం వద్ద కలవు.

రుద్రనాథ్ ట్రెక్కింగ్ మార్గంలో అత్యధిక ఎత్తు కల ప్రదేశం పిత్రదార్, ఇది సముద్ర మట్టానికి 4000 మీ. ల ఎత్తున కలదు. ఈ ప్రదేశ ప్రశాంతత దీని అందాలకు మరింత శోభ నిస్తుంది. ఈ ప్రదేశంలో మరొక ఆకర్షణ నందికుండ్, ఇది ఒక సరస్సు, చుట్టూ మంచు శిఖరాలతో చుట్టుముట్టబడి వుంటుంది. స్థానికుల కధనాల మేరకు, శివుడి వాహనమైన నంది ఈ లేక్ లో నీరు తాగేది. ఈ లేక్ లో పర్యాటకులు చౌఖంబ శిఖర ప్రతిబింబాలు చూడవచ్చు. టూరిస్టులు రుద్రనాథ్ కు సమీపంలో కల కల్పేశ్వర్ టెంపుల్ మరియు మధ్య మహేశ్వర్ టెంపుల్ లను కూడా దర్శించవచ్చు. రుద్రనాత్ ప్రదేశం చూడాలనుకునే వారు వాయు, రైలు, రోడ్ మార్గాలలో దీనిని చేరవచ్చు. డెహ్రాడూన్

లో కల జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ సమీప ఎయిర్ బేస్. రుద్రనాథ్ చేరేందుకు గోపేశ్వర్ నుండి ఒక ట్రెక్కింగ్ మార్గం కలదు. రుద్రనాథ్ కు రిషికేశ్ రైల్వే స్టేషన్ సమీపం. రుద్రనాథ్ కు సమీప ప్రదేశాలైన రిషి కేష్, డెహ్రాడూన్, కోట్ ద్వార, హరి ద్వార ల నుండి బస్సులు కలవు. అందమైన ఈ ప్రదేశాన్ని చూసేందుకు ఏప్రిల్ నుండి నవంబర్ వరకు సరైన సమయం. ఈ ప్రదేశం సందర్శనకు ఏప్రిల్ నుండి నవంబర్ వరకు గల వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది.

రుద్రనాద్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రుద్రనాద్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం రుద్రనాద్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? రుద్రనాద్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ ప్రయాణం రిషికేశ్, డెహ్రాడున్, కోట్ ద్వార, హరి ద్వార ల నుండి గోపేశ్వర్ కు ప్రభుత్వ బస్సు లు కలవు. గోపేశ్వర్ నుండి రుద్రనాథ్ కు కాలి నడకన చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం రుద్రనాథ్ కు సమీప రైలు స్టేషన్ రిషికేశ్ లో కలదు. ఇది 215 కి. మీ.ల దూరం లో కలదు. ఈ రైలు స్టేషన్ ఇండియా లోని ప్రధాన నగరాలకు అనేక రైళ్ళు కలిగి వుంది. రైలు స్టేషన్ నుండి పర్యాటకులకు ప్రీ పైడ్ టాక్సీ లు దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ సమీప ఎయిర్ బేస్. ఇది సుమారు 230 కి.మీ.ల దూరంలో కలదు. ఈ ఎయిర్ పోర్ట్ నుండి న్యూ ఢిల్లీ లోని ఇందిరా గాంధి ఎయిర్ పోర్ట్ కు విమానాలు కలవు. ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీ లలో రుద్రనాథ్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue