నంగాల్ ఒక ప్రణాలికా బద్ధ నగరం. చక్కటి అపార్ట్ మెంట్ వసతులు కలవు. మొదట్లో మూడు గ్రామాలు కలసి ఒకటి గా ఏర్పడింది. శివాలిక్ కొండలు, వివిధ నదులు ఉండటంతో నంగాల్ ఆకర్షణీయంగా వుంటుంది. 1955 లో సట్లేజ్ నది పై భక్రా నంగల్ డాం కట్టిన తర్వాత ఈ ప్రదేశం ప్రాధాన్యత సంతరించుకొంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణ డాం వద్డకల అందమైన సరస్సు. టూరిస్ట్ లు ఇంకనూ ఇక్కడ కల జుల్ఫా మాటా టెంపుల్, గురుద్వారా విభౌర్ సాహిబ్, శ్రీ బాబా ఉదో జి మహారాజ్ టెంపుల్ చూడవచ్చు. ఎన్నో ధరమ శాలలు, హోటళ్ళు వసతి గా కలవు. రూప నగర్ నుండి ఈ ప్రదేశం 63 కి. మీ. ల దూరం లో వుంది రోడ్డు మార్గంలో సౌకర్యంగా వుంటుంది.



Click it and Unblock the Notifications