సంగ్రూర్ నుంచి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో వున్న కంజ్హ్లా గ్రామంలో వున్న గురుద్వారా నానక్ ఝిరా సాహిబ్ కు శ్రీ గురు నానక్ జీ, శ్రీ గురు హరగోబింద్ సాహిబ్ జీ, శ్రీ గురు తేజ్ బహదూర్ జీ లు వచ్చారు. గురు నానక్ దేవ్ జీ ఇక్కడ వుండి, స్థానికులకు ఉదాసీ అనే తన బోధనాత్మక పర్యటనలో ప్రవచనాలు చెప్పారు. జానపదుల ప్రకారం, గురు తేజ్ బహదూర్ జీ కి ఒక ఆవిడ పాలు సమర్పించి ఆ ప్రాంతం నుంచి కుష్ఠు వ్యాధిని నిర్మూలించమని కోరింది.
గురువు గారి ఆశీస్సులతో ఆ గ్రామంలో కుష్టు వ్యాధి తగ్గిపోయి, ఆవిడ కోరిక తీరింది. ఈ గురుద్వారా చేరుకోవడానికి ఇక్కడ తేలిగ్గా దొరికే కాబ్ లేదా బస్సులో దాదాపుగా 25 నిమిషాలు పడుతుంది.



Click it and Unblock the Notifications