Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» సేవాగ్రాం

సేవాగ్రాం  - సేవకోసం

7

కొద్ది క్షణాల శాంతి అనుభవం కావాలంటే సేవాగ్రాం అనే చిన్న ప్రశాంత పట్టణం సరైన ప్రదేశం. పచ్చని చెట్లతో కప్పబడిన వనాల మధ్య వున్న ఈ పట్టణం ఆధ్యాత్మిక, ధ్యాన కేంద్రంగా ఉత్తమమైన ఎంపిక.

మహారాష్ట్రలో నెలకొని వున్నా సేవాగ్రాం అంటే “సేవ కోసం వున్నా వూరు” అని అర్థం – గాంధీ గారు ౧౯౪౦ లో ఈ ఊరోచ్చినప్పుడు దీనికి ఆ పేరు వచ్చింది. అంతకు ముందు దీన్ని షేగావ్ అనేవారు.

వార్ధా జిల్లా నుంచి కేవలం ౮ కిలోమీటర్ల దూరంలో వున్న ఈ పట్టణం భారత దేశం యొక్క ఆతిథ్యానికి, సేవలకు ఓ ఉత్తమ స్మారకం.

సేవాగ్రాం  ఆశ్రమం :

సేవాగ్రాం ఆశ్రమం గాంధీజీ జీవన విధానానికి దగ్గరి సంబంధం కలిగి వుంటుంది. తన భార్య కస్తూర్బా తో కలిసి ఆయన నివసించిన కుటీరం ఇప్పటికీ చెక్కు చెదరకుండా వుండి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఈ కుటీరాల్లో ఎలాంటి అలంకరణలూ లేవు, కళాత్మకంగానూ వుండవు. పైగా వెదురు చాపలు, బొంగులు మట్టి ఇటుకలతో తయారైన ఈ కుటీరం గాంధీగారు అవలంబించిన నిరాడంబర జీవన విధానాన్ని మన కళ్ళకి కడుతుంది.

ఈ ఆశ్రమంలో మనకి మాహాదేవ్ కుటీ, కిశోర్ కుటీ, పర్చురే కుటీ కనబడతాయి. చరిత్ర అంటే మక్కువ కలవారందరికీ స్వాతంత్రానికి పూర్వం వున్న అనుభూతుల్ని మిగులుస్తుంది ఈ ప్రదేశం.

గతంలో గాంధీజీ ఇక్కడ తన ఆశ్రమాన్ని నెలకొల్పినప్పుడు కేవలం ఓ వెయ్యి మంది నివాసం వుండేవారు. ఈనాడు ఈ చిన్న గ్రామం, ప్రపంచంలోని అత్యంత శక్తివంతుడైన వ్యక్తి జీవనవిధానాన్ని తెలుసుకునేందుకు ఏడాది పొడవునా వచ్చే  పర్యాటకులతో కళకళలాడుతోంది.

సేవాగ్రాం పర్యటన మిమ్మల్ని తన అందంతో మంత్రముగ్ధుల్ని చేస్తుంది, తన సేవా నిరతితో ప్రేరణ నిస్తుంది.

సేవాగ్రాం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సేవాగ్రాం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సేవాగ్రాం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సేవాగ్రాం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ద్వారా : దగ్గరలోని నాగపూర్, వార్ధా, లేదా దూరంలోని ముంబై, హైదరాబాద్, నాశిక్, భోపాల్, కాన్పూర్, విశాఖపట్నం, విజయవాడ, ఇండోర్, పూణే లాంటి నగరాల నుంచి కాని అనేకమైన బస్సు సర్వీసులు అందుబాటులో వున్నాయి. అటు ప్రభుత్వ రవాణా సర్వీసులు, ప్రైవేటు సర్వీసులు కూడా మిమ్మల్ని తేలిగ్గా ఇక్కడకు చేరుస్తాయి. డీలక్స్ బస్సా సెమి డీలక్స్ బస్సా అనే దాన్ని బట్టి చార్జీలు మారతాయి. సుమారుగా నాగపూర్ నుంచి సేవాగ్రాం కి వంద రూపాయల చొప్పున చార్జీలు అవుతాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ద్వారా : సేవాగ్రాం నాగపూర్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం ౭౫ కిలోమీటర్ల దూరంలో వుంది. మహరాష్ట్ర లోని నగరాలే కాక, ఇతర పెద్ద నగరాల నుంచి కూడా నాగపూర్ స్టేషన్ కు నిత్యం తిరిగే రైలు బళ్ళు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ దిగి టాక్సీలలో సేవాగ్రాం చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా : సేవాగ్రాం నాగపూర్ నగరానికి దగ్గరలో వుంది. కాబట్టి వాయు మార్గం ద్వారా వేల్లదలచుకుంటే వివిధ నగరాల నుంచి నాగపూర్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవడం ఉత్తమమైన మార్గం. హైదరాబాద్, పూణే, ముంబై, డిల్లి ళ నుంచి దేశీయ విమాన సేవలు ప్రతిరోజూ అందుబాటులో వున్నాయి. టికెట్ ఖరీదు ౪ వేల నుంచి ఏడు వేల దాకా వుంటుంది. విమానాశ్రయం నుంచి సేవాగ్రామ్ కి టాక్సీలలో చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Sep,Fri
Return On
12 Sep,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Sep,Fri
Check Out
12 Sep,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Sep,Fri
Return On
12 Sep,Sat

Near by City