సీతాకోక చిలుక మ్యూజియం చిమ్మట పురుగులు మరియు సీతాకోకచిలుకలకు అంకితం చేసిన భారతదేశంలో మాత్రమే ఉన్న ఏకైక మ్యూజియం. ఈ మ్యూజియం ప్రైవేటు యాజమాన్యం అద్వర్యంలో నడుస్తుంది. ఇక్కడ సీతాకోకచిలుకలు మరియు చిమ్మట పురుగుల యొక్క భారీ సేకరణ ఉంది. సీతాకోక చిలుక మ్యూజియం షిల్లాంగ్ యొక్క ప్రధాన షాపింగ్ ప్రాంతం, పోలీస్ బజార్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో రిఅత్సమ్థిఅహ్ వద్ద ఉంది. సీతాకోక చిలుక మ్యూజియంలో సీతాకోకచిలుకలు మరియు చిమ్మట పురుగులు యొక్క అరుదైన జాతులు ఉన్నాయి.
ఇక్కడ ప్రత్యేకంగా రూపొందించిన సీతాకోక చిలుక మ్యూజియంలో ప్రదర్శించబడుతున్న రంగుల సీతాకోకచిలుకలు చూడటానికి చాలా ఆనందంగా ఉంటుంది. ఈ మ్యూజియం సీతాకోకచిలుకల పెంపక కార్యక్రమం కొరకు ఉద్దేశించినది. కేవలం దీనిని వాణిజ్య కార్యక్రమం వలే ప్రారంభించారు. కాని నేడు ఒక పూర్తి స్థాయి సీతాకోకచిలుకలు మరియు చిమ్మట పురుగుల ఆంథాలజి కి కేంద్రమైంది. అంతేకాకుండా సీతాకోకచిలుకలు మరియు చిమ్మట పురుగుల యొక్క అరుదైన అనేక జాతిని పరిరక్షించడం,ఈ ప్రదర్శనశాల దుర్బలమైన జాతుల జీవిత చక్రం గురించి అరుదైన విషయాలను తెలియజేయటం కోసం ప్రసిద్ధి చెందింది. పర్యాటకులు సీతాకోక చిలుక మ్యూజియంను ఒక స్థానిక టాక్సీ ద్వారా చేరుకోవచ్చు.