టాయ్ ట్రైన్ రైడ్ ను 1903 లో లార్డ్ కర్జన్ మొదలు పెట్టారు. ప్రసిద్ధి గాంచిన ఈ ప్రదేశం వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. ఈ ప్రయాణం కలకా నుండి సిమ్లా వరకు అంటే 96 కి. మీ. ల దూరాన్ని అయిదు గంటలలో చేస్తుంది. ఈ జర్నీ లో సుమారు 103 సొరంగాలు, 800 బ్రిడ్జి లు మీరు క్రాస్ చేస్తారు.
పర్వతాలు, పచ్చని మైదానాలు, దేవదార్ అడవులు మధ్య సాగే ఈ ప్రయాణం మీకు మరువలేని అనుభూతులు అందిస్తుంది. ఈ ట్రైన్ పర్వతాల లో ప్రయాణిస్తూ అనేక చోట్ల ఆగుతుంది. టూరిస్టులు ఫోటో లు తీసుకోవచ్చు. ట్రైన్ నెమ్మదిగా సాగుతుంది. ప్రయాణికులు ట్రైన్ నడిచేటపుడు దిగటం, ఎక్కటం కూడా చేయవచ్చు. డీలక్స్, రైల్ కార్, శివాలిక్ డీలక్స్ వంటి తరగతులు కలవు.
సూపర్ డీలక్స్ (శివాలిక్ క్వీన్ టూరిస్ట్ కోచ్, శివాలిక్ పాలస్ టూరిస్ట్ కోచ్ ) పాలస్ టూరిస్ట్ కోచ్) మరియు రెగ్యులర్ పాసెంజర్ ట్రైన్లు (కలకా సిమ్లా ఎక్స్ప్రెస్ మరియు హిమాలయన్ క్వీన్) వంటివి కలవు. ఇవి, ఉదయం కలకా లో మొదలై మధ్యాహ్నాన్ని కి సిమ్లా చేరుతుంది.



Click it and Unblock the Notifications