సిమ్లా లో వైస్ రీగల్ లాజ్ మరియు బొటానికల్ గార్డెన్ ప్రధాన పర్యాటక కేంద్రం. దీనిని 1888 లో నిర్మించారు. అబ్సర్వేటరీ హిల్ పై ఒక అందమైన భవనం లో కలదు. యురోపియన్ స్టైల్ భవనం. దీనిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు వేసవిలో బ్రిటిష్ ఇండియాలో విడిదిగా వుండేది. కనుక దీనిని రాష్ట్రపతి నివాస్ అంటారు. ప్రొఫెసర్ ఎస్. రాధాకృష్ణన్ పదవిలో వుండగా, దీనిని ప్రభుత్వ విద్యాశాఖ కు అప్పగించారు. 1964లో ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ అడ్వాన్స్డ్ స్టడీ స్థాపించారు. ఇది ఆరు అన్తుస్తుల బిల్డింగ్. చుట్టూ పచ్చటి ప్రదేశాలు, లాన్లు కలవు. బిల్డింగ్ బయట, లోపలి భాగాలు అందంగా వుంటాయి. ప్రసిద్ధి చెందిన ఈ భవనం సిమ్లా కాన్ఫరెన్స్ 1945, సిమ్లా అగ్రిమెంట్ 1947 వంటి సంఘటనలకు రుజువుగా వుంది.



Click it and Unblock the Notifications