Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » షోఘి » వాతావరణం

షోఘి వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ సమయం: షోఘిని ఏడాదిలో ఏ సమయంలోనైన సందర్శించవచ్చు. అయితే, వాతావరణ పరిస్థితులు ఎంతో కఠిన౦గా, అసౌకర్యంగా ఉండే శీతాకాలపు జనవరి నెలలో ఈ ప్రాంత సందర్శన నుండి దూరంగా ఉండవచ్చు.

వేసవి

షోఘి ప్రాంతం ఏడాది పొడవునా ఒక మోస్తరు వాతావరణాన్ని కల్గి ఉంటుంది. వేసవికాలాలు వెచ్చగా, శీతాకాలంలో ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. నవరాత్రులను ఇక్కడ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. వేసవికాలం (మార్చ్ నుండి జూన్ వరకు): షోఘిలో వేసవి కాలం మార్చ్ లో మొదలై జూన్ నెల వరకు ఉంటుంది. ఈ కాలంలో ఈ ప్రాంత సగటు ఉష్ణోగ్రత 14 – 27 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉంటుంది. ఈ కాలంలో షోఘి ఎంతో వెచ్చగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి ఆగష్టు వరకు): షోఘి లో వర్షాకాలం జూలై లో మొదలై ఆగష్టు వరకు ఉంటుంది. షోఘి ప్రాంతంలో ఈ కాలంలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. పచ్చదనం విస్తరించి ఉండే ఈ ప్రాంతాన్ని ఈ కాలంలో సందర్శించడానికి పర్యాటకులు ప్రాధాన్యతనిస్తారు.

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు): నవంబర్ నెల, ఫిబ్రవరి వరకు కొనసాగే శీతాకాల ఆరంభాన్ని సూచిస్తుంది, జనవరి నెల ఎంతో చల్లగా ఉంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రత -4 –10 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉంటుంది. ఇక్కడ ఈ సమయంలో కొంత మంచు కురుస్తుంది.