Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సోనా మార్గ్ » వాతావరణం

సోనా మార్గ్ వాతావరణం

ఉత్తమ సమయం మే నుండి అక్టోబర్ అలాగే నవంబెర్ నుండి ఏప్రిల్ మధ్యలో సొనామర్గ్ ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. మే నుండి అక్టోబర్ నెలలలో ఇక్కడి వాతావరణం చల్లగా సౌకర్యవంతంగా ఉంటూ ఎత్తైన కొండ ప్రాంతాలని సందర్శించేందుకు అనువుగా ఉంటుంది. మంచు వర్షాన్ని చూసి ఆనందించాలనుకునే పర్యాటకులు నవంబర్ నుండి మే నెలలలో ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు.  

వేసవి

ఏడాది పొడవునా సొనామర్గ్ ప్రాంత వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. భారీగా మంచు కురవడం వల్ల అతి స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక్కడ వర్ష పాతాలని ఉహించలేము. సంవత్సరంలో ఏ సమయములోనైనా వర్షం కురుస్తుంది. ఎండాకాలం (మే టు అక్టోబర్) : ఎండాకాలం లో సొనామర్గ్ వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ నమోదయ్యే యావరేజ్ ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్. ఈ సమయం యాత్రికులకి అనువైన సమయం.  

వర్షాకాలం

వర్షాకాలం: సొనామర్గ్ ప్రాంతంలో వర్షాలు ఏ సమయంలో నైనా కురవవచ్చు. దారులు జారుడుగా ఉండడం వల్ల వర్షాలు కురిసే సమయంలో ట్రెక్కింగ్ కొంచెం ప్రమాదకరమైనది. అందుచేత ఈ సమయంలో సొనామర్గ్ ని సందర్శించే పర్యాటకులు ఈ సమయంలో వంపులు తిరిగిన అలాగే ముంపు కలిగే ప్రాంతంలో ట్రెక్కింగ్ చేసే ఆలోచన విరమించుకోవాలి.  

చలికాలం

శీతాకాలం (నవంబర్ టు ఏప్రిల్) : శీతాకాలంలో ఈ ప్రాంత ఉష్ణోగ్రత జీరో లెవెల్ కి పడిపోతుంది. భారీ మంచు వర్షం తో ఇక్కడి శీతకాలం ముడిపడి ఉంటుంది. మంచుతో కప్పబడిన పర్వతాలని అలాగే గడ్డ కట్టిన సరస్సులని పర్యాటకులు ఈ సమయంలో చూసి ఆనందించవచ్చు.