Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» సోనా మార్గ్

సోనా మార్గ్ - బంగారు మైదానం !

56

సముద్ర మట్టానికి 2740 మీటర్ల ఎత్తులోజమ్మూ కాశ్మీర్ లో ఉన్న ప్రసిద్దమైన కొండ ప్రాంతం సోనామర్గ్. చుట్టూ మంచు పర్వతాలతో ఉన్న సొనామర్గ్ పట్టణం జోజి లా పాస్ దగ్గర ఉంది. సొనామర్గ్ అంటే అర్ధం బంగారపు మైదానం. వసంత కాలంలో ఇక్కడ పూసే బంగారపు వర్ణపు పూలతో అలంకరింపబడడం వల్ల ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. సూర్యకిరణాలు ప్రసరించినప్పుడు బంగారపు వర్ణం తో ఈ పర్వతం మెరిసిపోతుంది.

ట్రెక్కింగ్, హైకింగ్ వంటి సాహస కార్యకలాపాలపై ఆసక్తి కలిగిన పర్యాటకులకు సొనామార్గ్ సరైన గమ్యం. ముఖ్యమైన అన్ని ట్రెక్కింగ్ మార్గాలు ఈ సొనామర్గ్ నుండే మొదలు అవడం కూడా సొనామర్గ్ ని ట్రెక్కింగ్ కి ప్రసిద్దమైన ప్రాంతంగా పెరుపొందడానికి దోహదపడ్డాయి. సహజమైన ప్రకృతి సౌందర్యానికి ఈ ప్రాంతం ప్రసిద్ది. కొలనులు, ప్రవాహాలు, పర్వతాలు ఎన్నో ఆకట్టుకుంటాయి. అంతే కాదు, అమర్నాథ్ కి వెళ్ళే యాత్రికులకు సొనామార్గ్ స్థావరంగా కూడా వ్యవహరిస్తుంది.

గడ్సర్, క్రిష్ణసర్, సత్సర్ మరియు గంగాబల్ వంటి ప్రసిద్దమైన పర్యాటక ఆకర్షణలైన సరస్సులు ఈ ప్రాంతం యొక్క అందాన్ని రెట్టింపు చేస్తాయి అనడంలో సందేహం లేదు. మంచు పర్వతాలు, ఆల్పైన్ పువ్వులతో అందంగా ఉండే గడ్సర్ సరస్సు సోనామార్గ్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. శీతాకాలంలో ఈ సరస్సుకి సమీపంలోనే ఉన్న గడ్డకట్టిన సత్సర్ లేక్ అలాగే బల్తాన్ లేక్ అందాలని చూసి ఆనందించవచ్చు.

ఈ ప్రాంతంలో ఉండే మరొక ప్రధాన పర్యాటక ఆకర్షణ క్రిష్ణసర్ లేక్. సముద్ర మట్టం నుండి 3801 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సరస్సు కి నిచినై పాస్ ద్వారా చేరుకోవచ్చు. ఈ ప్రాంతంలో మంచినీటి చేపలని ఫిషింగ్ చేసుకునే అవకాశం పర్యాటకులకి లభిస్తుంది. సముద్ర మట్టంనుండి 3600 మీటర్ల ఎత్తులో ఉన్న సత్సర్ లేక్ కి ట్రెక్కింగ్ ద్వారా సోనమార్గ్ నుండి పర్యాటకులు చేరుకోవచ్చు. పొడవాటి చెట్లు, ఆల్పైన్ పూలు ఈ సరస్సు యొక్క అందాలను మరింత పెంచుతాయి.

ఈ సరస్సులతో పాటు పర్యాటకులని అమితంగా ఆకర్షించే పర్యాటక ఆకర్షణ సొనామర్గ్ గ్లేసియర్ పాద ప్రాంతంలో ఉన్న తజివాస్ గ్లేసియర్. రావి చెట్లు అలాగే దేవదారు చెట్లు అధికంగా కలిగిన దట్టమైన అడవులతో ఈ ప్రాంతం ఉండడం వల్ల క్యాంపులకి అనువైన ప్రాంతం ఇది. సొనామర్గ్ లో ఉన్న మరొక పర్యాటక ఆకర్షణ లోయలోంచి ప్రవహించబడే అందమైన పర్వత నది అయిన నీలగ్రడ్ బాల్టిక్ కాలనీ లో ఉన్న ఇండస్ నదిలో ఈ నది సంగమిస్తుంది. ఔషద గుణాలు అలాగే హీలింగ్ గుణాలు కలిగిన ఈ నదీ జలం రంగు ఎరుపు.

వీటన్నిటితో పాటు పర్యాటకులు సముద్రమట్టం నుండి 3680 మీటర్ల ఎత్తులో ఉన్న సత్సారాన్ గాలి పాస్ గా ప్రసిద్ది చెందిన సత్సారాన్ పాస్ ని కూడా సందర్శించవచ్చు. ట్రెక్కింగ్ లకి ప్రసిద్ది చెందిన ప్రదేశం ఇది. జూన్ నుండి అక్టోబర్ నెలల మధ్యలోనే ఈ సత్సారన్ పాస్ ని పర్యాటకులు సందర్శించగలిగే అవకాశం ఉంది. జోజి-లా పాస్, నిచినై పాస్, కృష్ణసాగర్ పాస్, బల్తాల్ మరియు విశంసర్ సరస్సు వంటివి సొనామర్గ్ లో ఉన్న మరికొన్ని ప్రసిద్దమైన పర్యాటక ఆకర్షణలు.

ప్రజాదరణ పొందిన రవాణాల ద్వారా ఈ ప్రాంతానికి పర్యాటకులు సులభంగా చేరుకోవచ్చు. సొనామార్గ్ కి సమీపంలో ఉన్న విమానాశ్రయం శ్రీనగర్ విమానాశ్రయం. దీనినే షేక్ ఉల్ ఆలం విమానాశ్రయం అని కూడా అంటారు. సొనామర్గ్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విమానాశ్రయం భారత దేశంలో ని ప్రధాన నగరాలైన న్యూ ఢిల్లీ, ముంబై, మరియు చండీగర్ వంటి ప్రాంతాలకి చక్కగా అనుసంధానమై ఉంది.

సొనామర్గ్ కి దగ్గరలో ఉన్న రైల్వే కేంద్రం శ్రీనగర్ రైల్వే స్టేషన్. నగరం నడిబొడ్డు నుండి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఈ రైల్వే స్టేషన్ ఉంది. అయినప్పటికీ ఈ రైల్వే స్టేషన్ ఇంకా నిర్మాణం లో ఉండడం వల్ల సమీప రైల్వే స్టేషన్ గా జమ్మూ తావి రైల్వే స్టేషన్ ని పేర్కొనవచ్చు. సొనామర్గ్ నుండి శ్రీనగర్ అలాగే జమ్మూ కి బస్సులు తిరుగుతూ ఉంటాయి. రాష్ట్ర బస్సు సర్వీసులే కాకుండా పర్యాటకులు ప్రత్యేకమైన విలాసవంతమైన లక్జరీ బస్సుల ద్వారా కూడా శ్రీనగర్ మరియు జమ్మూ నుండి సొనామర్గ్ కి చేరుకోవచ్చు.

ఏడాది పొడవునా సొనామర్గ్ వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలంలో ఈ ప్రాంతం యొక్క ఉష్ణోగ్రత జీరో డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతుంది. మే నుండి అక్టోబర్ అలాగే నవంబర్ నుండి ఏప్రిల్ వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. మే నుండి అక్టోబర్ వరకు సైట్ సీయింగ్ కి అనువుగా ఉండే సమయం.

నవంబర్ నుండి ఏప్రిల్ మధ్యలో పర్యాటకులు మంచువర్షాన్ని గమనించవచ్చు.

సోనా మార్గ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సోనా మార్గ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సోనా మార్గ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సోనా మార్గ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం శ్రీనగర్ మరియు జమ్మూ లకి బస్సుల ద్వారా సోనామర్గ్ చక్కగా అనుసంధానమై ఉంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ బస్సు సర్వీస్ లని వాడుకుని పర్యాటకులు జమ్మూ మరియు శ్రీనగర్ ల నుండి సొనామర్గ్ కి చేరుకోవచ్చు. అంతే కాకుండా, విలాసవంతమైన ప్రత్యేక బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం సొనామర్గ్ కి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ నౌగాం రైల్వే స్టేషన్. శ్రీనగర్ రైల్వే స్టేషన్ అని కూడా అంటారు. సోనమర్గ్ నుండి 70 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ భారత దేశం లో ని మిగతా రైళ్ళ నెట్వర్క్ లన్నింటికీ అనుసంధానమై లేదు. జమ్మూ తావి రైల్వే స్టేషన్ భారత దేశంలోని ప్రధాన నగరాలకి అనుసంధానమై ఉంది. రైల్వే స్టేషన్ బయట టాక్సీ అలాగే క్యాబ్ సేవలు సోనామర్గ్ చేరుకునేందుకు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ప్రధాన పర్యాటక ఆకర్షణ అయిన సొనామర్గ్ కి వాయుమార్గం, రైలుమార్గం అలాగే రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. వాయు మార్గం : శ్రీనగర్ విమానాశ్రయం లేదా షేక్ ఉల్ ఆలం విమానాశ్రయం సొనామర్గ్ కి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీప విమానాశ్రయం. షిమ్లా, చండీగర్, ముంబై మరియు ఢిల్లీ వంటి ప్రధాన భారతీయ పట్టణాలకి ఈ విమానాశ్రయం చక్కగా అనుసంధానమై ఉంది. సొనామర్గ్ కి చేరుకునేందుకు విమానాశ్రయం వద్ద టాక్సీ లేదా క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue