Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» అనంతనాగ్

అనంతనాగ్ - శివుడి ప్రయాణ మార్గం !

21

అనంతనాగ్ జిల్లాను &కాశ్మీర్ పట్టణానికి వాణిజ్య రాజధాని గా చెపుతారు. ఈ పట్టణం కాశ్మీర్ కు నైరుతి భాగంలో కలదు. ఈ ప్రదేశం కాశ్మీర్ లో బాగా అభి వృద్ధి చెందిన ప్రదేశం . క్రి. పూ. 5000 సంవత్సరాల నాటికే ఈ ప్రాంతం వాణిజ్య పరంగా అభివృద్ధి చెందిన ప్రదేశం గా గుర్తించబడి పట్టణ నాగరికతలు విలసిల్లాయి. ఈ పట్టణం చుట్టూ శ్రీనగర్, కార్గిల్ ,పుల్వామా, దోడ మరియు కిష్టవార్ వంటి వివిధ నగరాలు కలవు.

ఈ జిల్లా కు ఆ పేరు శివుడు తాను అమరనాథ్ గుహ కు వెళ్ళే సమయంలో అనేక ఆభరానాలను వదిలివేసేటపుడు తన శరీరం పైకల విలువైన ఆభరణాలతో పాటు అనేక నాగుపాములను ఇక్కడ వదిలివేసాదని ఆ కారణంగా ఈ ప్రదేశానికి 'అనంత' అనే పేరు వచ్చిందని స్థానికులు చెపుతారు. ప్రస్తుతం అనంతనాగ్ మూడు తాలూకాలకు చేర్చబడి వుంది. అవి గూల్ గులాబ్ ఘర్, దోడ, మరియు బుదాల్ ఈ ప్రదేశం దాని పుణ్య క్షేత్రాల కారణంగా పర్యాటకులలో ప్రేసిద్ధి చెందినది. హిందువులు మరియు ముస్లింలు కూడా దీనిని సందర్శిస్తారు. హజారత్ బాబా రిషి, గోస్వామి గుండ ఆశ్రమ్, శిలాగ్రాం టెంపుల్, నిలా నాగ వంటివి అనంతనాగ్ జిల్లలో కొన్ని ప్రసిద్ధ క్షేత్రాలు. ఈ ప్రాంతంలో ఏడు దేవాలయ సముదాయాలు కలవు. వాటిలో హనుమాన్ టెంపుల్, శివ టెంపుల్, సీతా టెంపుల్ మరియు గణేష్ టెంపుల్ పేరు పడినవి. ఈ గుడులు మాత్రమే కాక పర్యాటకులు ఇక్కడ అందమైన సాలాగ్ నాగ, మాలిక్ నాగ మరియు నాగబాల వంటి కొన్ని నీటి బుగ్గలు కూడా చూడవచ్చు.

అనంతనాగ్ వెళ్ళేవారు ఇక్కడకు 9 కి మీ ల దూరం లో కల మార్తాండ్ టెంపుల్ తప్పక చూడాలి. ఈ టెంపుల్ సూర్య భగవానుడు కొరకు రాజు లలితాదిత్య నిర్మించాడు ఈ టెంపుల్ శిల్ప శైలి కాశ్మీరి హిందువులకు అద్భుత మనిపిస్తుంది ప్రస్తుతం మార్తాండ్ సన్ టెంపుల్ శిధిలమై వుంది. అయినప్పటికీ టూరిస్టులు మంచు తో కప్పబడిన పర్వతాల మధ్య దీని శిధిలాలను చూడవచ్చు. ఈ టెంపుల్ మాత్రమే కాక పర్యాటకులు 15న వ శతాబ్దానికి చెందిన షేక్ జైనుద్దిన్ యొక్క ఆయుష్ముగం మసీదుని కూడా చూడవచ్చు. షేఖ్ జైనుద్దిన్ తన జీవితం అంతా అల్లా కు సమర్పించాడు. తాను గుహలోనె ఉంటూ స్థానికులకు అల్లా గురించి బోధించాడు

టూరిస్టులు, సమయాన్ని బట్టి ఇంకనూ ఇక్కడ కల మసీద్ సైడ్ షాబ్ నాగ్బాల్, ఖేర్బ వాని అస్తాపాన్ మరియు ఆయుష్ముగంలను చూడవచ్చు. జాన్ బిషప్ మెమోరియల్ హాస్పిటల్ భూమి లో నిర్మించిన చిన్న చాపెల్ చాలా పవిత్ర స్థలం. ఈ చాపెల్ ను 1982 లో ప్రొటెస్టెంట్ క్రిస్తియన్ల మరియు క్రిస్టియన్ అధికారుల అవసరాలకు నిర్మించారు. ఈ ప్రాంతం లోని క్రిస్టియన్ ఉద్యోగుల అభివృద్ధి కొరకు ఈ చాపెల్ పని చేస్తుంది.

అనంతనాగ్ సందర్శించే టూరిస్టులు దానిని వాయు, లేదా రైలు లేదా బస్సు మార్గాలలో చేరవచ్చు. శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ సుమారు 62 కి. మీ.ల దూరం లో వుంటుంది. ఈ ఎయిర్ పోర్ట్ ను షేఖ్ ఉల్ ఆలం ఎయిర్ పోర్ట్ అంటారు. ఇక్కడనుండి న్యూ ఢిల్లీ మరియు జమ్మూలకు విమానాలు నడుస్తాయి. న్యూ ఢిల్లీకి వచ్చే విదేశీ యాత్రికులు శ్రీనగర్ కు ఫ్లైట్ లో చేరవచ్చు. శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ నుండి అనంతనాగ్ సిటీ సెంటర్ కి టాక్సీ లు తెలికగా లభిస్తాయి.

రైలు ప్రయాణం లో అనంతనాగ్ రైన్ జంక్షన్ కు జమ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్రధాన ప్రదేశాలనుండి చేరవచ్చు. టూరిస్టులు ఇండియా లోని ప్రధాన నగరాలనుండి వచ్చేవారు 247 కి. మీ.ల దూరంలో కల జమ్మూ తావి రైల్వే స్టేషన్ వరకు వచ్చి అక్కడనుండి అనంతనాగ్ చేరవచ్చు. రోడ్డు ప్రయాణం లో వచ్చేవారు ప్రభుత్వ బస్సులలో చేరవచ్చు. అనంతనాగ్ కు వసంత కాలం లేదా సమ్మర్ సీజన్ అనుకూలమైనవి.

అనంతనాగ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అనంతనాగ్ వాతావరణం

అనంతనాగ్
10oC / 50oF
 • Sunny
 • Wind: WSW 4 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం అనంతనాగ్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? అనంతనాగ్

 • రోడ్డు ప్రయాణం
  రోడ్ ప్రయాణం అనంతనాగ్ పట్టణం రోడ్ మార్గం లో జమ్మూ , శ్రీ నగర్ లకు కలుపబడి వుంది. జమ్మూ దీనికి 237 కి. మే. లు సుమారు 4 గంటలలో చేరవచ్చు. పైన చెప్పిన నగరాల నుండి అనంతనాగ్ కు టాక్సీలు లేదా బస్సులు తేలికగా దొరుకుతాయి. టూరిస్టులు లగ్జరీ బస్సులను కూడా తగిన ఖర్చుతో పొందవచ్చు.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు ప్రయాణం అనంతనాగ్ కు రైలు స్టేషన్ కలదు. ఇది రాష్ట్రం లోని ప్రధాన స్టేషన్ ల కు కలుపబడి వుంది. అయితే ప్రధాన రైలు స్టేషన్ అయిన జమ్మూ తావి రైలు స్టేషన్ దేశం లోని ప్రధాన నగరాలు న్యూ ఢిల్లీ, ముంబై చెన్నై చండీగర్ మరియు త్రివెంద్రుం పట్టణాలకు రైలు సదుపాయం కలిగి వుంది. ఈ రెండు రైల్వే స్టేషన్ లకు అనంత నాగ సిటీ సెంటర్ నుండి పర్యాటకులు టాక్సీలలో చేరవచ్చు.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయు ప్రయాణం షేక్ ఉల్ ఆలం ఎయిర్ పోర్ట్ గా పిలువా బడే శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ అనంతనాగ్ కు సుమారు 62 కి. మీ.ల దూరం లో వుంటుంది. ఈ ఎయిర్ పోర్ట్ జమ్మూ మరియు న్యూ ఢిల్లీ విమానాశ్రయాలకు చక్కగా అనుసంధానించబడి వుంది. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుండి శ్రీనగర్ కు రెగ్యులర్ ఫ్లైట్ లు కలవు. శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీ లేదా కాబ్ లలో అనంతనాగ్ చేరవచ్చు.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
27 Oct,Tue
Return On
28 Oct,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
27 Oct,Tue
Check Out
28 Oct,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
27 Oct,Tue
Return On
28 Oct,Wed
 • Today
  Anantnag
  10 OC
  50 OF
  UV Index: 4
  Sunny
 • Tomorrow
  Anantnag
  8 OC
  47 OF
  UV Index: 4
  Partly cloudy
 • Day After
  Anantnag
  10 OC
  49 OF
  UV Index: 5
  Partly cloudy