Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పట్నితోప్

పట్నితోప్ - అందమైన పర్వత ప్రదేశం

24

పట్నితోప్ లేదా పట్ని తోప్,జమ్మూ మరియు కాశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లాలో ఉన్న ఒక అందమైన పర్వత ప్రదేశం. మొదట్లో ఈ స్థలాన్ని 'పటాన్ డా తాలాబ్', అనగా 'యువరాణి చెరువు' అని పిలిచేవారు. ఈ చెరువు,నిజంగానే ఒక రాకుమార్తె చే తన దైనందిన స్నానాలకు ఉపయోగించబడిందని చెప్పుకుంటారు. అయితే,కాలక్రమేనా దీని పేరు 'పటాన్ డా తాలాబ్' నుండి పట్నితోప్ గా మారిపోయింది. ఈ ప్రదేశం 2024 మీటర్ల ఎత్తులో ఉన్న పీఠభూమి మీద ఉంది. దట్టమైన దేవదారు అడవులు, కొండలు, ఉత్కంఠభరితమైన దృశ్యాలు మరియు ప్రశాంత వాతావరణం పట్నితోప్ ని ఒక ఆదర్శ విహార స్థలంగా తీర్చుదిద్దుతాయి. ఆ ప్రాంతంలో, సహజమైన మరియు చల్లని నీటిని అందించే మూడు మంచినీటి చెలమలు కూడా ఉన్నాయి. ఈ నీటి చెలమలు ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని భావిస్తారు. సమయం ఉంటే వీటిని సందర్శించవచ్చు.

శీతాకాలంలో పర్యాటకులు,స్కీయింగ్ మరియు ట్రెక్కింగ్ లాంటి అనేక బహిరంగ కార్యక్రమాలలో పాల్గొనేందుకు పట్నితోప్ కి తండోపతండాలు గా వస్తారు. పట్నితోప్ గోల్ఫ్, పారాగ్లైడింగ్, వాయు క్రీడలు, గుర్రపు స్వారీ, మరియు ఛాయాగ్రహణం వంటి చర్యలకు కూడా అనుకూలంగా ఉంటుంది. పర్యాటక ఆకర్షణలలో నాగ్ (కోబ్రా) ఆలయం, బుద్ధ అమర్ నాథ్ దేవాలయం, బహు కోట మరియు ఆలయం, అలాగే సుధ్ మహదేవ్, గౌరికుండ్, కుడ్ మరియు శివ గఢ్ వంటి పవిత్ర ప్రదేశాలు కూడా ఉన్నాయి.

పట్నితోప్ లో విమానాశ్రయం మరియు రైల్వే స్టేషన్ లేనప్పటికీ, పర్యాటకులు సులువుగా జమ్మూ ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. పర్యాటకులు, జమ్ము విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్, చేరుకున్న తర్వాత, పట్నితోప్ చేరుకోవడానికి రాష్ట్ర రవాణా బస్సులు లేదా క్యాబ్ లు తీసుకోవచ్చు. ఇది సంవత్సరం పొడవునా చూడదగ్గ ప్రదేశం అంటారు, అయితే, సందర్శనకు అత్యంత అనుకూలమైన సమయంగా మే నుండి జూన్ మరియు సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు పరిగణించవచ్చు. డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్య కాలం, స్కీయింగ్ మరియు ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలలో పాలుపంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

పట్నితోప్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పట్నితోప్ వాతావరణం

పట్నితోప్
17oC / 63oF
 • Smoke
 • Wind: E 7 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం పట్నితోప్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? పట్నితోప్

 • రోడ్డు ప్రయాణం
  రహదారి: పట్నితోప్, జమ్మూ మరియు శ్రీనగర్ జాతీయ రహదారి 1-ఎ మీదుగా బస్సు లేదా టాక్సీ ద్వారా చేరుకోవచ్చు. జమ్మూ & కాశ్మీర్ పర్యాటక అభివృద్ధి సంస్థ (జమ్మూ & కాశ్మీర్ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ – జె.కె.టి.డి.సి) జమ్మూ రైల్వే స్టేషన్ మరియు విమానాశ్రయం కోసం ప్రత్యేక లగ్జరీ బస్సులు నడుపుతుంది. పట్నితోప్ కి, వైష్ణో దేవి యొక్క స్థావర పట్టణం కత్రా నుంచి కూడా బస్సులు అందుబాటులో ఉన్నాయి. పట్నితోప్ కు జమ్మూ నుండి క్యాబ్ లు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు ప్రయాణం: పట్నితోప్ నుండి సమీపంలో జమ్ము తావీ మరియు ఉధంపూర్ రైల్వే స్టేషన్ ఉన్నాయి. జమ్ము తావీ, కొత్త ఢిల్లీ, ముంబై, కోలకతా, పాట్నా మరియు రుషికేష్ తో అనుసంధానించబడింది. ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందని ఉధంపూర్ రైల్వే స్టేషన్, కొత్త ఢిల్లీ మరియు జమ్మూ తో అనుసంధానించబడి ఉంది. పర్యాటకులు ఈ స్టేషన్లు నుండి పట్నితోప్ చేరుకోవడానికి బస్సులు లేదా క్యాబ్ లు సులువుగా దొరుకుతాయి.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  పర్యాటకులు ఈ గమ్యం చేరుకోవడానికి, ప్రధాన రవాణా రీతులయిన విమానయానం, రైల్వే లేదా రహదారులు ఏదైనా ఎంచుకోవచ్చు. విమాన యానం: పట్నితోప్ నుండి సమీప విమానాశ్రయం జమ్మూ విమానాశ్రయము. ఇక్కడి నుంచి వెళ్ళటానికి, ఇక్కడికి రావటానికి, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూర్ కి విమానాలు ఉన్నాయి. జమ్మూ విమానాశ్రయం, శ్రీనగర్, చండీగఢ్ మరియు లేహ్ వంటి ఇతర నగరాలతో కూడా అనుసంధానించబడి ఉంది. జమ్ము విమానాశ్రయం నుంచి పట్నితోప్ వెళ్ళటం కోసం, టాక్సీలు మరియు బస్సులు అందుబాటులో ఉన్నాయి.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Jan,Sun
Return On
21 Jan,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
20 Jan,Sun
Check Out
21 Jan,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
20 Jan,Sun
Return On
21 Jan,Mon
 • Today
  Patnitop
  17 OC
  63 OF
  UV Index: 2
  Smoke
 • Tomorrow
  Patnitop
  5 OC
  41 OF
  UV Index: 1
  Patchy rain possible
 • Day After
  Patnitop
  9 OC
  49 OF
  UV Index: 0
  Moderate or heavy rain shower